కేంద్ర మంత్రులు కుమార స్వామి, సోమన్నలను కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

 V POWER NEWS  : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కేంద్ర భారీ పరిaశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నలను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులను పధ్బనాబం అతిథి గృహంలో విరి విరిగా కలిసిన ఎం.పి వారికి, శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రులను కోరారు.. https://youtu.be/aUkaW3WEDfw?si=0sSYFJqevEgcjsVS

మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా ” అడవి బిడ్డల సేవలో – రెడ్ క్రాస్ వైద్య సేవలు “

నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి రాజకుమార్ గణియ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల ఆదేశాలతో .. మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించిన శ్రీశైలం రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య ఆధ్వర్యంలో నల్లమల అడవులలో నివసిస్తున్న అడవి బిడ్డలైన చెంచు గిరిజనులకు ఉచిత వైద్య సేవలను అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని హటకేశ్వరం వద్దగల చెంచుగూడెం లో నివసిస్తున్న చెంచు బిడ్డలకు రెడ్ క్రాస్ సొసైటీ వారి మొబైల్ హెల్త్ వ్యాన్ ను అందుబాటులో పెట్టి వారి ఆరోగ్య సమస్యలపై చర్చించి వారికి అవసరమైన మందులు టానికులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు అందరికీ కూడా బిపి షుగర్ అలాగే పల్స్ ఆక్సి మీటర్ ద్వారా ఆరోగ్యమును పరీక్షించి వారికి అవసరమైన సిరప్ లను, టాబ్లెట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయడం జరిగిందని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు నల్లమల అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు కనుక ఎక్కువగా వీరి జీవనం అడవులలో సాగుచున్నందున చెంచులకు ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు దగ్గు ఆయాసం ఆస్తమా గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కర్నూల్ జిల్లా చైర్మన్ శ్రీ KG గోవింద రెడ్డి, గార్ల సహకారంతో మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా అడవి బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. అలాగే ఈ సంవత్సరం శివరాత్రికి మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్, పల్స్ అక్సిమీటర్ బీపీ చెకింగ్ వంటి అత్యవసరమైన వైద్య పరికరాలను కైలాస ద్వారం వద్ద 24/7 అందుబాటులో ఉంచి ఎంతోమంది భక్తులకు వైద్య సేవ అందించడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామీణ వైద్యులు డాక్టర్ కే ప్రసాద్, విజయలక్ష్మి తో పాటుగా సభ్యులు ఎస్ భాస్కర్, దమయంతి, ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ టాగోర్ గారు అంబులెన్స్ డ్రైవర్ వరుణ్ కౌశిక్ మొదలవారి పాల్గొన్నారని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉంటాం – బిజెపి

ప్రతి బిజెపి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారంలో మమేకమవుదామని పిలుపునిచ్చిన .. బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా ఎన్నికల సహాధికారి దేశాయి చంద్రన్న. V POWER NEWS . ADONI  ఆదివారం స్థానిక అసెంబ్లీ కార్యాలయంలో ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షుడు తోవి నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, కో – కన్వీనర్ నాగరాజు గౌడ్ లు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు న్యాయవాది లోకేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ సింహం నాగేంద్ర, కౌన్సిలర్ వాషిమ్, ప్రధాన కార్యదర్శులు రమేష్ ఆచారి, వినోద్ కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్

అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినా .. జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ V POWER  NEWS :   కర్నూలు జిల్లా  సీ. బెలగల్ మండల పరిధిలోని పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక శ్రీలేఖ మృతి చెందింది. ఫిబ్రవరి 28వ తేదీన పోలకల్ పాఠశాల మైదానంలో వున్న చెట్టు ఈదురు గాలులకు మీద పడటం తో తీవ్రగాయాల పాలయ్యింది. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. ప్రమాదం జరిగిన రోజు నుండి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా డిఇఓ తో పాటు మండల విద్య శాఖ అధికారి ఆదమ్ బాషా గారు , హెడ్మాస్టర్ అసోసియేషన్ , ఆ పోలకల్ హెడ్మాస్టర్ మరియు టీచర్స్ ఆవిరామంగా కృషి చేశారు. డీఈఓ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే కాకుండా మండల విద్యాధికారులు అక్కడే వుంచి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం శ్రీలేఖ తుదిశ్వాస వదలడంతో జిల్లా విద్యాధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధను దిగమింగి పోస్టుమార్టం వద్ద తనే దగ్గర వుండి బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ భరోసాను కుటుంబ సభ్యులకు అందించారు. స్వగ్రామం గోనెగండ్ల మండలపరిధిలోని పెద్దనెలటూరుకు వెళ్లిన జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసి నివాళులు అర్పించారు. వెంటనే అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” వారోత్సవాలు …

V POWER NEWS :   కర్నూల్ పట్టణంలో, స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సాధికారత ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాల సందర్బంగా, మార్చ్ 1 నుండి 8 వరకు మహిళా హక్కులు ,మానవ హక్కులు, సమాన వేతనం, పనిలో గౌరవం, మహిళకు, బాలికలకు ,రక్షణలో భాగంగా, ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.  అందులో భాగంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్కూలు విద్యార్థులు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు మరియు కలెక్టర్ కార్యాలయం నుండి మెడికల్ కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు మరియు బాలికలందరికి హక్కులు, సమానత్వం, సాధికారత ఉండాలని సమాజానికి ప్లే కార్డు ద్వారా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగి ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని పి. నిర్మల, ACDPO రేవతి జోష్ట్న, మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాస్ ఆచారి, DCPO శారదా, ఇండ్ల విజయలక్ష్మి ,వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ, స్వర్ణలత, మరియు ఫేవోర్డ్ నెట్వర్క్ ఏవి రమణయ్య ,కొమ్ము పాలెం శ్రీనివాస్ , మధు, శకుంతల, ఎలీషాబాబు పాల్గొన్నారు.

పంచలింగాల గ్రామంలో … ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసినా …కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

… బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితం… గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు   V POWER NEWS  :     రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితమని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు.. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించారన్నారు.. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న ఎం.పి..రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, రఫిక్, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు..

పోలీస్ స్టేషన్ ఆశ్రయించే .. బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

నేరా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. … రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలి – కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ V POWER NEWS .. : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామ న్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు, శిక్షణ డీఎస్పీ ఉష శ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

ఐస్ ముద్దుపై శివలింగం – చిన్నారి అద్భుతం

కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన కిడ్నీస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఉజ్వల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐస్ ముద్దపై శివలింగాన్ని తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి శిక్షణ లేకుండా, స్వయంగా తన సృజనాత్మకతతో శివలింగాన్ని తీర్చిదిద్దడం విశేషం. ఈ సూక్ష్మ శిల్పకళను తయారు చేయడానికి ఉజ్వలకు ఒక గంట సమయం పట్టింది. ఐస్ ముద్దను తన చేతుల్లో పట్టుకొని సుతిమెత్తగా శిల్పాన్ని రూపొందించిన విధానం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఐస్ గడ్డతో శివలింగాన్ని సునాయాసంగా తయారు చేయగలగడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. ఉజ్వల యొక్క సృజనాత్మకతను పాఠశాల టీచర్లు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందిస్తూ, ఆమెకు ప్రశంసలు కురిపించారు. పసివాడైనప్పటికీ, పునీతమైన శివలింగాన్ని రూపొందించిన ఉజ్వల, భవిష్యత్తులో గొప్ప శిల్పి అవుతుందని ఆశాభావం వ్యక్తమైంది. ఆమెకు మహాశివరాత్రి పట్ల ఉన్న భక్తి, కళాప్రతిభ ఈ చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంది.

మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు …. అన్నపూర్ణ దేవి గృహస్థాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు … అంతిరెడ్డి అరవింద రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల) శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బుధవారం నాడు శ్రీశ్రీశ్రీ తిరుపతి నాయన ఆరాధన కార్యక్రమం శుభ సందర్భంగా, శివోహం టెంపుల్ ట్రస్ట్ ఈ మహత్తర కార్యక్రమానికి అదేవిధంగా స్వామి అమ్మవార్ల భక్తులకు మరియు శివ స్వాములకు సేద తీర్చుకొనుటకు వసతులు, నీటి వసతులు, అన్న ప్రసాద వితరణ పూర్తిగా ఉచితంగా సంపూర్ణంగా జరిగినది. ఈ మహత్తర కార్యక్రమం వేల మంది శివ దీక్ష స్వాములు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి …

డిమాండ్ చేసినా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్   నంద్యాల జిల్లా “Vపవర్  న్యూస్ :  రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్.యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం నాడు మంగళగిరి లోని విద్యా భవన్ నందు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ భాష్యం శ్రీ చైతన్య ఆక్స్ఫర్డ్ రవీంద్ర కేకేఆర్ వంటి మరియు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 2025 -26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు. కార్పొరేట్ సంస్థల వారు బహిరంగంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు వేసి అడ్మిషన్ల కొరకు ఎలక్షన్ ప్రచారం రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దిక్రీడో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ స్కూల్, అని ప్రచారం నిర్వహిస్తూ ఐఐటి త్రిబుల్ ఐటీ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఎల్కేజీ నుండే ప్రారంభిస్తున్నామని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆర్థికమే ధ్యేయంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి, చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల పేర్లతో పిఆర్ఓ లను ,ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్ ఫీజులతో పాటు,స్పెషల్ ఫీజు,పుస్తకాల ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాలలో ఉదృతమైన ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులుబి.సిద్ధు, కె.నాగరాజు,రూపాశంకర్, శ్రీను,మణి, భానుప్రసాద్ పాల్గొన్నారు.

error: Content is protected !!