క్రైమ్

బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి…100 మంది పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతికి చెందిన ఎంపీ బస్తీపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు జిల్లా…హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ ఘటన పై అధికారులతో మాట్లాడి , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అనంతరం మాలమల్లేశ్వర స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్న మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ కి రాఖీ కట్టిన కర్నూలు ఎంపీ నాగరాజు సతీమణి జయసుధ

 V POWER  NEWS  :   రాష్ట్ర ఐ.టి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీమణి జయసుధ రాఖీ కట్టారు… ఉండవల్లి లో ని మంత్రి నివాసంలో కుటుంబ సమేతంగా ఎంపీ నాగరాజు లోకేష్ ని కలిశారు… ఈ సందర్బంగా మంత్రికి తన కుటుంబ సభ్యులను పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు… అనంతరం లోకేష్ కి ఎంపీ సతీమణి రాఖీ కట్టారు

తమపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి. … శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు

శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజీత్ బాషకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యా సాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు. శ్యామ్ విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ వెంచర్లో ఓకిరాణం షాపు విషయంలో గోడవ చోటుచేసుకుందని ఈఘటనపై నాగులాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మందలించారని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో అందరూ మంచి గా ఉండాలని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై అసభ్యంగా మాట్లాడి దాడి చేశారన్నారు. ఈఘటన పై నాగులాపురం స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. విద్యా సాగర్ ను సస్పెండ్ చేసి ఈకేసులో వారిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు 15మంది పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు

టిడిపి నేతల దౌర్జన్యం మహిళ ఆత్మహత్యాయత్నం

– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది  V POWER NEWS :  ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో … ప్రతి అంశాన్నీ నమోదు చేయాలి — జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ …  ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.  పోలీసులు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  అన్నారు.  ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ నేర సమీక్షా సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్  తో  జిల్లా ఎస్పీ  మాట్లాడారు. అనంతరం  సిఐడి ఐజి ,  సిసిటిఎన్ఎస్  గురించి  జిల్లా ఎస్పీ తో మాట్లాడారు… ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ   పోలీసు అధికారులతో  మాట్లాడo  జరిగింది.   కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు,  సూచనలు చేశారు.  కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలని,   పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్ఎస్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్‌ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు.   సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు,  నాన్‌ గ్రేవ్‌ కేసులలో పార్ట్‌ 1, పార్ట్‌ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.   మర్డర్‌ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా  కోర్టులో ధాఖలు  చేయాలని,  డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా  చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో  పని చేసే సిసిటిఎన్ ఎస్   పోలీసు సిబ్బందితో  మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు,  పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు  మరియు  డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్  ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో  తనిఖీలు నిర్వహించాలన్నారు.  సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.   ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా,  ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,  డిఎస్పీలు బాబు ప్రసాద్,  శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు ,  ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ ,  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు. 

పులికనుమ రిజర్వాయర్ లో వ్యక్తి గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. .. కొనసాగుతున్న సహాయక చర్యలు. … లభించని ఆచూకీ..! మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దకడుబూరు మండల పరిధిలోని పులికనుమ గ్రామానికి చెందిన (60) గొర్రెల నాగేంద్ర ఇవాళ ఉదయం గ్రామ శివారులో ఉన్న పులికనుమా రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.. ఆయన కనిపించకపోవడంతో గల్లంతయారేమోననే అనుమానంతో అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

పోలీస్ స్టేషన్ ఆశ్రయించే .. బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

నేరా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. … రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలి – కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ V POWER NEWS .. : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామ న్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు, శిక్షణ డీఎస్పీ ఉష శ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

పోలీసు లపై తిరగబడిన ముద్దాయులు అరెస్టు .. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ 

ముద్దాయిలను రిమాండ్ కు  తరలించినా  పోలీసులు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు  విక్రాంత్ పాటిల్  ఆదేశాల మేరకు, ఆదోని  డి.ఎస్.పి యం. హేమలత  వారి సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  కే. శ్రీరామ్.   11.02.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని మధు ఆసుపత్రి యజమాని అయిన  గుర్రెడ్డి  ఫిర్యాదు మేరకు, ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్  18/2025 u/s 308(2), 351 (2) r/w 3 (5)  BNS మేరకు రఘునాద్ మరియు అడివేష్ అను ముద్దాయులపై కేసు నమోదు చేయడమైనది.  సదరు కేసులో ముద్దాయులు మధు ఆసుపత్రి లో  ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరున చాలా అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు.  సదరు పిర్యాదులను వెనుకకి తీసుకోవడానికి ఫిర్యాదు దారుడు అయిన గుర్రెడ్డి ని ముద్దాయులు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారని ఫిర్యాదు దారుడి అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకుని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విదంగా ఒప్పందం  కుదుర్చుకోవడం జరిగింది.  అంతేకాకుండా బలవంతంగా 10 వేల రూపాయలను ఫోన్ పే కూడా చేయించుకున్నారు.  సదరు కేసులో ముద్దాయులకు నోటీసులు ఇవ్వడానికి 12.02.2025 వ తేదీన సాయంత్రము 17.15 గంటలకు బాల భాస్కర్ మరియు ముని చంద్ర కానిస్టేబుళ్లు వెళ్ళగా వారిపై తిరగబడి దాడికి పాల్పడి గాయపరచి పారిపోవడము  జరిగినది.  సదరు సంఘటనపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు Cr No.19/2025 u/s 121(1) r/w 3(5) BNS,ఆదోని  వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ రామ్ కేసు నమోదు చేయడo జరిగిందని, శనివారం నాడు  ఆదోని ఎస్డిపిఓ అయిన  ఎo. హేమలత వారి పర్యవేక్షణలో , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన. శ్రీరామ్ , ఎస్ ఐ.రామస్వామి  మరియు సిబ్బంది ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జి వద్ద సదరు ముద్దాయులను అరెస్టు చేసి రిమాండుకు పంపడము జరిగిందని అలాగే  ప్రస్తుత పంచాయతీ రాజ్ డెపార్టుమెంట్ కు చెందిన డిప్యూటీ ఇంజనీర్  (DE) ని కూడా డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారమ ఉందని  కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి అడివేష్ @ ఏనుగుల అడివేష్, అను వీరిపై  గతంలో వీరిపై ఇస్వి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాబడినది అని  వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్  మీడియా సమావేశంలో తెలిపారు. 

పెద్దతుంబలం గ్రామంలో … ఉరి వేసుకుని వివాహిత మృతి.

పెద్ద తుంబలం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది 21ఏళ్ల వివాహిత అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనూష తన భర్త శాంతరాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు రెండేళ్ల అమ్మాయి 9 నెలల బాబు ఉన్నారు. అనూష తండ్రి నక్కల హనుమంతు, తల్లి నక్కల బుజ్జమ్మ. ఆమె కుటుంబంలో నలుగురు సంతానం ఉండగా అనూష రెండవ పాప. భర్త కుటుంబంలో మామ తిక్కయ్య అత్త లలితమ్మ ఉన్నారు. ఈ ఘటనపై అనూష కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అaనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అనూష మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కోసిగి పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

 కోసిగి పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక బార్డర్లో స్టేషన్ కు దగ్గర ఉండటంతో అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక దుకాణదారుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పాత రికార్డులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. రాబోయే రేణుక ఎల్లమాంబ జాతరను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని శాంతి భద్రతలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డి.ఎస్.పి ఉపేంద్ర బాబు,సి.ఐ మంజునాథ్,ఎస్సై చంద్రమోహన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 

error: Content is protected !!