ప్రతి బిజెపి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారంలో మమేకమవుదామని పిలుపునిచ్చిన .. బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా ఎన్నికల సహాధికారి దేశాయి చంద్రన్న.
V POWER NEWS . ADONI ఆదివారం స్థానిక అసెంబ్లీ కార్యాలయంలో ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షుడు తోవి నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, కో – కన్వీనర్ నాగరాజు గౌడ్ లు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు న్యాయవాది లోకేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ సింహం నాగేంద్ర, కౌన్సిలర్ వాషిమ్, ప్రధాన కార్యదర్శులు రమేష్ ఆచారి, వినోద్ కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.