మహిళా శాసన సభ్యురాలు  పల్లె సింధూర రెడ్డి మాటలను ఖండిoచినా … లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్.

— నాడు నేడు భిక్షాటనతోనే ఎరుకల , లంబాడి ప్రజల జీవితాలు.   గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా  గిరిజన,లంబాడీలకు ఉంది.  — రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు చేపడతాo.   V POWER NEWS  :   కర్నూలు మండలం ఎన్ఎస్ తండా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ గారు మాట్లాడుతూ ఈమధ్య ఆరవ తేదీన పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రజలు 35 లక్షల పైబడి 32 తెగలుగా ఉన్నారని వీరిలో ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థాయి ప్రాంతంలో ఏజెన్సీ గిరిజనులుగా ఇంకా కనీస రోడ్డు వైద్య సౌకర్యం లేని ప్రాంతంలో బ్రతుకుతున్నారని అలాగే మైదాన ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 20 లక్షల పైబడి జనాభా 70 నియోజకవర్గాలలో ఉన్నారని, ఈ ప్రజలను పాలకులు ఓటర్లుగా మాత్రమే వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని ఈ రాష్ట్రం వదిలి పారిపోయేటట్లు చేసే కార్యక్రమాలు పెట్టుకున్నట్టు ఉన్నట్లు ఉన్నారని. అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మొదటిసారి పుట్టపర్తి నియోజకవర్గం లో ఎన్నిక కాబడిన పల్లె సింధూర రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో దాదాపుగా 30 వేల  లంబాడి ఓట్లతోగెలిచి అక్కడ ఉన్నటువంటి గిరిజన లంబాడి ప్రజల. జీవితాలపై కనీస అవగాహన లేకుండా. స్వాతంత్రానికి ముందు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగల కంటే అన్ని విధాలుగా విద్య వ్యవసాయము వ్యాపార రంగాలలో ఉంటూ  హార్దికంగా రాజకీయంగా బ్రిటిష్ కాలంలోనే పాలేగాల్ల పాలన చేసినటువంటి బోయ కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ని స్వయానా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తో బోయలు నేటికీ దుర్భర జీవితాలు గడుపుతున్నారు లంబాడి ప్రజల ఓట్లతో గెలిచిన  ఎమ్మెల్యే  మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. నాడు నేడు గిరిజన లంబాడీల లు బ్రతుకుతెరువు లేక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తమిళనాడు రాష్ట్రం చెన్నై బాంబే కలకత్తా లాంటి నగరాలకు వెళ్లి బ్రతుకుతున్న సంగతి పాలకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ గిరిజనుల జీవితాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా కులాల మధ్య కుంపటి  పెట్టే కార్యక్రమాలు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామన్నారు.  ఒకవైపు అన్ని రంగాలలో రాయలసీమ బ్రిటిష్ కాలంలోనే  పాలెగాలుగా నేడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా శాసించే స్థాయిలో ఉండి అన్ని రకాల ముందున్న బోయజాతి వారిని అతి పేదవారిగా వర్ణిస్తూ విలువైన శాసనసభ  సమయాన్ని కేటాయించిన పల్లె సింధూర రెడ్డిని స్వయానా స్పీకర్ గారే సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా మా గిరిజన లంబాడీలకు ఉందని సంగతి గుర్తు చేస్తున్నామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు మొదలుపెడతామని కైలాస్ నాయక్  తెలిపారు.

స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నా … నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి.

V POWER  NEWS   :    నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. 

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ….

మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు.  …పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు.  … బ్యాంకు లింకేజీ కింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ  చేశాం.  ….నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతి చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు.  20వ శతాబ్ద ప్రధమార్ధంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. 

ప్రజా సమస్యలను  త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి – నందికొట్కూరు MLA గిత్త  జయసూర్య.

గ్రీవెన్సెస్ కార్యక్రమంలో  …. నందికొట్కూరు శాసనసభ్యుడు  గిత్త  జయసూర్య V POWER NEWS  :  నంద్యాల జిల్లా,  నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ ప్రజాపిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 నెలలు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టార‌ని, సామాన్యుడికి కూడా పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు. ప్రజల నుంచి, అర్జీలు  స్వీకరించారు. అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, మూడవ  శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ,ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనాలని సూచించారని , ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగినది.  

తుంగభద్ర నదిలో ఆంధ్ర గట్టు వైపు కర్ణాటక కన్ను పడింది.. అక్రమంగా ఇసుక తరలింపు … ట్రాక్టర్ల తో ఇతర ప్రాంతాలకు తరలింపు.. పథకాలకు తూట్లు పొడుస్తున్న మాఫియా..!

V POWER NEWS :  మంత్రాలయం రూరల్/కోసిగి : కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే..కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు..కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఆంధ్ర గడ్డ వైపు కర్ణాటక రాష్ట్రంలో తమాపూర్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..పదుల సంఖ్యలలో ట్రాక్టర్ లతో యదేచ్ఛగా ఇసుకను నిలువ చేస్తూ పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటుంది.అగసనూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తే రాబోయే తరానికి ఇసుక అనేది ఉండకుండా పోతుందని వారిని ఆపడానికి ట్రై చేస్తున్నా అవడం లేదు..అక్రమంగా ఇసుకను పట్టపగలే గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గట్టు వద్ద గుట్టాలుగా నిల్వచేస్తున్నారు..అనంతరం రాత్రి వేళలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్క ట్రిప్పు రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం..ఇప్పటికైనా రెవెన్యూ,పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియా పై చర్యులుa తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

మంత్రాలయంలో అత్యంత వైభవంగా  .. రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం. 

శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించినా … సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. V POWER  NEWS :   మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ మఠంలో స్వామివారి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించి, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ రాయర రథోత్సవాన్ని స్వామిజీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్వామిజీ దీప ప్రజ్వలనం చేసి “నాద హారం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా, ప్రఖ్యాత సంగీత కళాకారులు తమ కళ రూపాన్ని, సేవను భక్తితో స్వామివారికి సమర్పించారు.ఈ పవిత్రమైన మరియు గొప్ప కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాయల ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.  

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.

మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి. .. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. V POWER NEWS  …  KURNOOL  :  పోలీసు అధికారులు, పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు స్టేషన్ లో  రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ మన్మధ విజయ్ తదితరులు ఉన్నారు.

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి …. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్

V POWER NEWS .. :    నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో వున్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ కరెక్షన్స్‌, మ్యుటేషన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ సంబంధిత దరఖాస్తులను కూడా దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాసిల్దార్, సర్వే అధికారులు, గ్రామ రైతులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా .. మహిళలకు పోషకహారం, యోగ ఆసనాలు మానసిక వత్తిడి ఫై గురించి అవగాహనా కార్యక్రమం.

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1 నుండి 8వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. నిర్మల ఆదేశాల మేరకు కార్యక్రమం లో భాగంగా మహిళలకు పోషకహారం గురించి అవగాహనా కల్పించారు . అన్ని చిరుదన్యాలు, ఆకుకూరలు, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేసి మహిళలకు వివరించడం జరిగింది. అలాగే యోగ చెయ్యడం ద్వారా మహిళలు , మానసిక వత్తిడిలకు లోను కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. మహిళలు ఇంట్లో గూడా యోగ ఆసనాలు చేసుకోవడం వలన మానసిక వత్తిడికి గురి కాకుండా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ సునీత పారా మెడికల్ పి. రేష్మ పాల్గొన్నారు.

సీనియర్ పాత్రికేయుడు జోసెఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం .. నంద్యాల APWJF జిల్లా నాయకుడు పరామర్శించినా మౌలాలి

V POWER NEWS  … ATMAKUR :  ఆత్మకూరు పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు జోసఫ్ చంద్రశేఖర్ కు కాలు చిటికెన వేలు విరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం జోసఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం కొనసాగడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు మౌలాలి హాస్పిటల్ వెళ్లి ఆత్మకూరు ప్రజాశక్తి విలేఖరి జోసెఫ్ చంద్రశేఖర్ ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు

error: Content is protected !!