ఆంధ్ర ప్రదేశ్

మానసిక ఒత్తిడి, దురాలవాట్ల కారణంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి…ఎంపీ బస్తిపాటి నాగరాజు

వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామి చేసుకోవాలని సూచించిన .. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు   కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో గలకర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో నిర్వహించిన ప్రపంచం హృద్రోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ వెంకటేష్, హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీ.సీ డాక్టర్.చంద్రశేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడ, దురాలవాట్ల కారణంగా రోజు రోజుకూ గుండె జబ్బులు పెరిగిపోతున్నాయన్నారు.50శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి రోజూ 40 నిముషాల పాటు నడవడం, యోగా చేయడం తో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తవని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్. ప్రతాప్ శరత్,హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కల్కూర చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు డాక్టర్.భవాని ప్రసాద్ మరియు వైద్యులు పాల్గొన్నారు..

గ్రామాలలో..జనసేన వైపు గ్రామస్తుల చూపు .. సంధ్య విక్రమ్ కుమార్

V power news : కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు మండలం అనుగొండ, ముడుమాలకుర్తి ,వెంకటగిరి కొత్తూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో సంధ్య విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన కండువా వేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మనమంతా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను చింత సురేష్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేరుద్దామని ఆయన చేస్తున్న మంచిని వివరిద్దామని కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సైనికుల్లా కదులుదామని ఆయన పిలుపునిచ్చారు.

APRSA కర్నూలు రెవెన్యూ డివిజన్ ఆధ్వర్యంలో … సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ వర్ధంతి

సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి  పూల మాలలు వేసిన APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావు, డివిజన్లోని తహసీల్దారులు  V POWER NEWS  : కర్నూలు రెవెన్యూ డివిజన్ APRSA సభ్యులoదరూ కలిసి, రెవిన్యూ డివిజన్ కార్యలయము సమావేశ మందిరములో కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావుల అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ జరిగింది.ఈ సభకు కర్నూలు డివిజన్ లోని రెవిన్యూ డివిజన్ సభ్యులు మరియు డివిజన్ లోని తహసీల్దారు లు హాజరై కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఫోటో కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సింహపురి సింహము అయిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను APRSA అధ్యక్షులు వి.రామాంజనేయులు కొనియాడారు.అలాగే APRSA ప్రతి సభ్యుడు అయన యొక్క స్ఫూర్తితో పోరాట పటిమతో యుండి ప్రతి యొక్క ఉద్యోగి కి సేవలను చేయాలనీ కొనియాడారు.అలాగే ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు,సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకటలక్ష్మి, కోడుమూరు తహసీల్దారు  బి.నాగరాజు మరియు విశ్రాంత తహసీల్దారు మల్లికార్జున తదితర వక్తలు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను ప్రసంగించారు. ఈ  కార్యక్రమములో APRSA కర్నూలు డివిజన్ అసోసియేషట్ అధ్యక్షులు సతీష్,APRSA కర్నూలు డివిజన్ ట్రెజరర్ R. విష్ణు ప్రసాద్, APRSA కర్నూలు డివిజన్ E.C., మెంబర్ వెంకట సునీల్ కుమార్, పౌర సరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దారు మురళీకృష్ణ, వెల్దుర్తి డిప్యూటీ తహసీల్దారు సి.గురుస్వామి రెడ్డి, EDM. జయక్రిష్ణ, RDO కార్యాలయం జూనియర్ సహాయకులు సోయబ్ అస్లాం భాష తదితర రెవిన్యూ ఉద్యోగులు అందరూ పాల్గొనడము జరిగినది

CMRF చెక్కును అందజేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

… V POWER NEWS  : కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన పి.కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఆయన తన కార్యాలయంలో అందజేశారు… కేశవరెడ్డి ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ఎంపీ నాగరాజును సంప్రదించి సీఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.3,09,470 మంజూరు అయ్యాయి.. కాగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు…ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు…

కర్నూలు కలెక్టర్ సిరి చేతులమీద గా “వన్ స్టాప్ సెంటర్” సేవ పోస్టర్స్ విడుదల

V POWER NEWS  : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ – మిషన్ శక్తి ద్వారా అందిస్తున్న సేవలు తాత్కాలిక వసతి, వైద్య, న్యాయ, పోలీస్ మరియు కౌన్సిలింగ్ సేవలు ఉంటాయి. ఎపుడు వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించాలి అనేటువంటి పోస్టర్స్ ను.సోమవారం నాడు కలెక్టర్ సిరి అలాగే జాయింట్ కలెక్టర్ నవ్య చేతులమీద గా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ, డిఆర్ఓ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విజయ లక్ష్మి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ స్వర్ణలత, జోష్టనా పాల్గొన్నారు.

కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల లో సైన్స్ ల్యాబ్ పరిశీలించినా .. డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలమని.

V POWER NEWS KURNOOL TOWN. :కర్నూలు జిల్లా, మహిళ అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలమని , కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల లోని సైన్స్ ల్యాబ్ పరిశీలించారు, మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్ సేవలు , బేటిబచావ్ బేటిపడ్దోవ్,పీర్ గ్రూపు లీడర్స్ యొక్క భాద్యతలను గురించి తెలియజేశారు ,ఇందులో భాగంగా కె. వి. ఆర్. డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి. ఎఫ్.ఓ. జి. శ్రీనివాసులు, కేస్ వర్కర్ ఐ.విజయకుమారి, పారా మెడికల్ పి. రేష్మా పాల్గొన్నారు

16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు స్వాధీనం .. కర్నూలు DSP బాబు ప్రసాద్

లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు .. ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు .. కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్.  V POWER NEWS KURNOOL,  క్రైమ్  : కర్నూలు రెండవ పట్టణ పోలీసులు 16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని  శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్,  కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజారావు, ఎస్సైలు సతీష్, మల్లికార్జున తో కలిసి  కర్నూలు  రెండవ పట్టణ పోలీసుస్టేషన్ లో నిందితుని వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని  కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక  స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టామని, మాకు రాబడిన సమాచారం మేరకు   కర్నూలు- సుంకేశుల రోడ్డు లో ఉన్న రెండు వాగుల వద్ద శుక్రవారం నాడు , తెలంగాణ రాష్ట్రం, గద్వాల పట్టణం, దౌడురాళ్ళ కాలనీకి చెందిన తెలుగు జయంత్ @జస్వంత్  ను అరెస్టు చేసి, అతని నుండి 32 బైక్ (హోండాషైన్ , హిరో హోండా, యూనికార్న్ ) లను రికవరీ చేయడం జరిగిందని వీటి విలువ రూ. 16 లక్షల వరకు ఉంటుందన్నారు.  

కోర్టు విచారణలో ఉన్న భూములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలి.. రైతుల భూములు కాపాడాలి…జిల్లా కలెక్టర్ కు రైతులు వినతిపత్రం అందచేత… V POWER NEWS : కర్నూలు జిల్లా,గోనెగండ్ల మండలం,గంజిహళ్లి గ్రామంలో కోర్టు విచారణలో ఉన్న భూ ములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు కురువ వెంకటేష్, బోయ ధనుంజయులు, గోవిందు, లాజర్, కాటన్న,అరవ రాజు, ఏ.రామాంజినేయులు ఏ. అంజనేయులు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం, ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం, గంజిహళ్ళి గ్రామంలో పరిధి లో 2008వ సంవత్సరంలో షేక్ అస్లాం బాషా అను వ్యక్తి ఫ్యాక్టరీ నిర్మిస్తామని,ఆ ఫ్యాక్టరీ లో ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగవకాశం కల్పిస్తామని, అంతవరకు భూమిలో రైతులు సాగుచేసుకునేలా హక్కులు ఉంటాయని మోస పూరిత మాటలు చెప్పి రైతుల భూముల నుండి సుమారు 200ఎకరాలు,ఎకరా రూ.13వేలకు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన చెందారు. అంతేకాకుండా 2011వ సంవ త్సరంలో షేక్ అస్లాం బాషా, మాచాని రమేష్ కు ఎకరా రూ. 1.25లక్షలకు విక్రయించి నట్లు తెలిసిందన్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు సంయుక్తంగా పత్తికొండ జూని యర్ సివిల్ జడ్జి కోర్ట్ లో OS/46/2021 ప్రకారంగా పిటిషన్ వేయడం జరిగింది. కాని కోర్టులో విచారణ కొనసాగుతున్న కూడా మాచాని రమేష్ భూములను అక్రమంగా విక్రయించేందుకు కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు విచారణలో ఉన్న భూములను విక్రయిస్తే రైతుల కుటుంబ సభ్యులు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,కోర్ట్ తీర్పు వచ్చేవరకు మా చాని రమేష్ పై రిజిస్ట్రేషన్, ఆన్లైన్, అడంగళ్ ను పెండింగ్ లో పెట్టాలన్నారు. ఈ ప్రకారం గా రైతుల భూములను కాపాడి,న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

మంత్రి నారా లోకేష్ కి రాఖీ కట్టిన కర్నూలు ఎంపీ నాగరాజు సతీమణి జయసుధ

 V POWER  NEWS  :   రాష్ట్ర ఐ.టి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీమణి జయసుధ రాఖీ కట్టారు… ఉండవల్లి లో ని మంత్రి నివాసంలో కుటుంబ సమేతంగా ఎంపీ నాగరాజు లోకేష్ ని కలిశారు… ఈ సందర్బంగా మంత్రికి తన కుటుంబ సభ్యులను పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు… అనంతరం లోకేష్ కి ఎంపీ సతీమణి రాఖీ కట్టారు

ప్రతి ఒక్కరూ .. యోగాను అలవాటు చేసుకోవాలి … కర్నూలు పార్లమెంటు మెంబర్ బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ నెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రజలకు యోగ పై అవగాహన కలిపించేందుకు కర్నూలు రూరల్ మండలం పంచాలింగాల గ్రామంలోని తన స్వగృహం లో ఆయన యోగాసానాలు చేసారు. యోగా చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందని, యోగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని ఎం.పి నాగరాజు తెలిపారు. 

error: Content is protected !!