V POWER NEWS : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1నుండి 8వరకు మహిళా హక్కులు,సమాన వేతనం, పనిలో గౌరవం ఉండాలని మరియు ఈరోజు కార్యక్రమం లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ఆయా మత పెద్దలతో మరియు మహిళలతో కాండిల్స్ వెలిగించుకొని సంతోషనగర్ నుండి గీతముఖర్జీ నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని p. నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ p. మేరీస్వర్ణలత, WASI G. లలితమ్మ osc సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్, మహిళలు పాల్గొన్నారు.