జాతీయం

బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి…100 మంది పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతికి చెందిన ఎంపీ బస్తీపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు జిల్లా…హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ ఘటన పై అధికారులతో మాట్లాడి , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అనంతరం మాలమల్లేశ్వర స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్న మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు పేర్కొన్నారు.

రేషన్ షాపు డీలర్,సచివాలయ ఉద్యోగుల ద్వారా.. స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చు … జాయింట్ కలెక్టర్

నగరంలోని బుధవారపేట లో ఎఫ్.పి.షాపులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య V POWER NEWS  : కర్నూలు జిల్లాలో అక్టోబర్ నెల 15 వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చని,16 వ తేదీ తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేయబడతాయని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. బుధవారం నాడు నగరంలోని బుధవారపేట లో 1382073, 1382075 ఎఫ్.పి.షాపులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రేషన్ పంపిణీ ని పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.పి షాపుల ద్వారా వినియోగదారులకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

…. కర్నూలు జిల్లాలో  స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా చౌక దుకాణల్లో సరుకులను సులభతరంగా తీసుకోవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో రేషన్ కార్డుదారులకు ఆయన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు,ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూ… జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందాం …కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

జిల్లాలో రూ.  14 కోట్లతో   5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాo .. జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటకదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి  మాట్లాడుతూ….ఈ ఏడాది  ప్రపంచ పర్యాటక దినోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు.జిల్లాలో రూ.  14కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను, కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్  సూచించారు.. మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని, అలాగే  ఇళ్లలో, కార్యాలయాల్లో  ఏసీ , కరెంటు  వాడకాలను తగ్గించి  పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. సోలార్ పవర్ , విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి  కర్బన ఉద్గారాలు లేకుండా  పర్యావరణాన్ని కాపాడుతూ, పవర్ అందించే చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ …స్పెయిన్ దేశంలో ప్రపంచ పర్యావరణ ఆర్గనైజేషన్ 45 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుస్థిరమైన మార్గంలో పయనించడం.ఉమ్మడి జిల్లాలో ప్రకృతి పరంగా పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతికపరంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నవని వాటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని తద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని జిల్లా అభివృద్ధి చెందుతుందని , కర్నూలు జిల్లాలో శిల్పారామంను ఏర్పాటు చేస్తున్నామని , స్థానికంగా హరిత హోటల్ ను పర్యాటకులను ఆకర్షించే విధంగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్  ప్రదర్శనలు , గురవయ్యాల నృత్యం, కోలాటం  ఆహుతులను అలరించాయి. జిల్లా కలెక్టర్ వారికి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా ఈ సమావేశానికి డి ఆర్ ఓ వెంకటనారాయణమ్మ, డిస్ట్రిక్ట్  టూరిజం డివిజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, జడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి,హోసింగ్ పీడీ చిరంజీవి, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐఓ లాలెప్ప, డిఎస్ఓ రాజా రఘువీర్ , ఎస్ డి సి నాగ ప్రసూన లక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డిసి కొండయ్య, డి ఆర్ డి ఏ పీడీ రమణారెడ్డి, సీపీవో భారతి, తహసీల్దారులు రమేష్, రవి , శ్రీనాథ్, టీజీవీ కళా క్షేత్రం కళారత్న పత్తి ఓబుళయ్య, టూరిజం శాఖ సిబ్బంది, ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.  

UJF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విస్తృత సమావేశం… ముఖ్య అతిథులుగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు. స్వేచ్ఛలో భారత్ అధమస్థానం … రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే. …మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి —

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం  ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ . అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ . జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు :ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్. V POWER NEWS  : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని, ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ, చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు. అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు. కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు. అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు. అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు. అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్, వజ్రరాజు, రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు, మద్దిలేటి, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారిద్దాం’..

స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం. … నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేల జరిమనా నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ..లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు. … రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు. V POWER NEWS  .. ADONI :    సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం డివిజన్ లోని స్కానింగ్ నిర్వాహకులు, ప్రైవేట్, ప్రభుత్వ వైద్య అధికారులకు, మరియు సంబంధిత అధికారులతో , సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కలిగించాలని నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం ఉందన్నారు.ఆదోని డివిజన్ పరిధిలో 48 స్కానింగ్ కేంద్రాలు ఉండగా. డివిజన్లో ఉన్న స్కానింగ్ కేంద్రాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు చేయాలన్నారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ…భ్రూణ హత్య అనేది సమాజానికి కలిగే తీవ్ర అనర్థం మాత్రమే కాకుండా, చట్టపరంగా కూడా నేరం. గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ చేసి, ఆడ శిశువులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం మన సమాజం ఎదుట ఉన్న సవాలుగా మారింది. భారతదేశంలో “పురుష-స్త్రీ నిష్పత్తి” అసమతుల్యతకు ప్రధాన కారణంగా భ్రూణ హత్యలు ఉన్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. “భ్రూణ హత్య నిషేధ చట్టం – 1994 (PCPNDT Act)” ప్రకారం, గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ చేయడం మరియు భ్రూణ హత్య చేయడం చట్టబద్ధంగా నిషేధించబడింది. ఆడ పిల్లల తల్లిదండ్రులుకు చదువు యొక్క విలువలను తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని వారిని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా వారికి అవగణ కల్పించాలని సంబంధిత అధికారులకు డి.ఎస్.పి హేమలత సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి మాట్లాడుతూ…లింగ నిర్ధారణ చేయకుండా ఉండటం – వైద్యులు ఎవరూ గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించరాదన్నారు. నైతిక వైద్య సేవలు అందించడం – పేదరికం, కుటుంబ ఒత్తిళ్ల వలన భ్రూణ హత్యకు ఒత్తిడి ఎదుర్కొనే తల్లులకు మానసిక, వైద్య పరమైన సలహా అందించాలన్నారు. చట్టాన్ని కఠినంగా పాటించడం – PCPNDT చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సామాజిక అవగాహన పెంచడం – భ్రూణ హత్యల హానికారక ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల ప్రాముఖ్యతను గుర్తించడం – బాలికల హక్కులను ప్రోత్సహిస్తూ, “బేటీ బచావో – బేటీ పడావో” వంటి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ సమావేశంలో డి.ఎస్.పి హేమలత, డిప్యూటీ డి.యం.హెచ్.వో డాక్టర్ సత్యవతి, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, డెమో అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డెమో అధికారి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మానిటరింగ్ కన్సల్టెంట్ అధికారి సుమలత, సిడిపిఓస్ సఫర్ నిషా బేగం, ఉమ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” వారోత్సవాలు …

V POWER NEWS :   కర్నూల్ పట్టణంలో, స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సాధికారత ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాల సందర్బంగా, మార్చ్ 1 నుండి 8 వరకు మహిళా హక్కులు ,మానవ హక్కులు, సమాన వేతనం, పనిలో గౌరవం, మహిళకు, బాలికలకు ,రక్షణలో భాగంగా, ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.  అందులో భాగంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్కూలు విద్యార్థులు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు మరియు కలెక్టర్ కార్యాలయం నుండి మెడికల్ కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు మరియు బాలికలందరికి హక్కులు, సమానత్వం, సాధికారత ఉండాలని సమాజానికి ప్లే కార్డు ద్వారా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగి ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని పి. నిర్మల, ACDPO రేవతి జోష్ట్న, మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాస్ ఆచారి, DCPO శారదా, ఇండ్ల విజయలక్ష్మి ,వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ, స్వర్ణలత, మరియు ఫేవోర్డ్ నెట్వర్క్ ఏవి రమణయ్య ,కొమ్ము పాలెం శ్రీనివాస్ , మధు, శకుంతల, ఎలీషాబాబు పాల్గొన్నారు.

ఐస్ ముద్దుపై శివలింగం – చిన్నారి అద్భుతం

కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన కిడ్నీస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఉజ్వల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐస్ ముద్దపై శివలింగాన్ని తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి శిక్షణ లేకుండా, స్వయంగా తన సృజనాత్మకతతో శివలింగాన్ని తీర్చిదిద్దడం విశేషం. ఈ సూక్ష్మ శిల్పకళను తయారు చేయడానికి ఉజ్వలకు ఒక గంట సమయం పట్టింది. ఐస్ ముద్దను తన చేతుల్లో పట్టుకొని సుతిమెత్తగా శిల్పాన్ని రూపొందించిన విధానం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఐస్ గడ్డతో శివలింగాన్ని సునాయాసంగా తయారు చేయగలగడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. ఉజ్వల యొక్క సృజనాత్మకతను పాఠశాల టీచర్లు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందిస్తూ, ఆమెకు ప్రశంసలు కురిపించారు. పసివాడైనప్పటికీ, పునీతమైన శివలింగాన్ని రూపొందించిన ఉజ్వల, భవిష్యత్తులో గొప్ప శిల్పి అవుతుందని ఆశాభావం వ్యక్తమైంది. ఆమెకు మహాశివరాత్రి పట్ల ఉన్న భక్తి, కళాప్రతిభ ఈ చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంది.

మయూర వాహనంపై మల్లన్న వైభవం …. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పరవశించిన భక్తులు

నేడు రావణవాహన సేవలో దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు …  శ్రీశైలం  మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు శనివారం రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. ఆనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూర వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజారికాలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్షేత్రపుర వీదుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి. డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

error: Content is protected !!