ఆంధ్ర ప్రదేశ్

ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి .. మంత్రి టీజీ భరత్

V POWER NEWS, KURNOOL : కర్నూలు జిల్లాలో ఈ నెల 16 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి  వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ప్రధాన మంత్రి పర్యటనను ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు.హెలిప్యాడ్,సభాప్రాంగణం, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు..  

బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి…100 మంది పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతికి చెందిన ఎంపీ బస్తీపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు జిల్లా…హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ ఘటన పై అధికారులతో మాట్లాడి , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అనంతరం మాలమల్లేశ్వర స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్న మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు పేర్కొన్నారు.

రేషన్ షాపు డీలర్,సచివాలయ ఉద్యోగుల ద్వారా.. స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చు … జాయింట్ కలెక్టర్

నగరంలోని బుధవారపేట లో ఎఫ్.పి.షాపులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య V POWER NEWS  : కర్నూలు జిల్లాలో అక్టోబర్ నెల 15 వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చని,16 వ తేదీ తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేయబడతాయని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. బుధవారం నాడు నగరంలోని బుధవారపేట లో 1382073, 1382075 ఎఫ్.పి.షాపులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రేషన్ పంపిణీ ని పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.పి షాపుల ద్వారా వినియోగదారులకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్ ఆధ్వర్యంలో .. తడికనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సూపర్ జిఎస్టి  – సూపర్  సేవింగ్ పై అవగాహన

ప్రజల మౌలిక సదుపాయాలపై జీఎస్టీని తగ్గించి ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కృషి చేస్తుంది … సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్ V POWER NEWS : కర్నూలు జిల్లాలో.. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్  ఆధ్వర్యం లో కల్లూరు మండలంలోని తడికనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజల యొక్క అవసరాల మేరకు ఔషధాలు, పాలు, నిత్య అవసరాలు, ఎల్ఐసి పాలసీలు మొదలైన వాటి మీద ప్రభుత్వం వారు జీఎస్టీని తగ్గించి ప్రజలు ఆర్థిక సంక్షేమానికి కృషి చేయడానికి ప్రయత్నం చేసిందని దయచేసి ఈ విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తదుపరి గ్రామ ప్రజలందరితో కలిసి ర్యాలీ నిర్వహించటం జరిగినది. ఈ సమావేశం హాజరైనటువంటి డిసిపిఓ రామకృష్ణ  ప్రభుత్వంలో జిఎస్టి స్లాబ్ రేట్స్ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి జిఎన్ఎస్ రెడ్డి మరియు ఉప మండల అభివృద్ధి అధికారి నగేష్, ఏపీఎం పుష్ప,సర్పంచ్ సహేరబి,పొదుపు సంఘ నాయకురాలు జుబేదాబీ  ఇతర గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగినది.

సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి .. ఉరుసులో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నార కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు V POWER NEWS: కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

…. కర్నూలు జిల్లాలో  స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా చౌక దుకాణల్లో సరుకులను సులభతరంగా తీసుకోవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో రేషన్ కార్డుదారులకు ఆయన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు,ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూ… జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందాం …కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

జిల్లాలో రూ.  14 కోట్లతో   5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాo .. జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటకదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి  మాట్లాడుతూ….ఈ ఏడాది  ప్రపంచ పర్యాటక దినోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు.జిల్లాలో రూ.  14కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను, కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్  సూచించారు.. మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని, అలాగే  ఇళ్లలో, కార్యాలయాల్లో  ఏసీ , కరెంటు  వాడకాలను తగ్గించి  పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. సోలార్ పవర్ , విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి  కర్బన ఉద్గారాలు లేకుండా  పర్యావరణాన్ని కాపాడుతూ, పవర్ అందించే చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ …స్పెయిన్ దేశంలో ప్రపంచ పర్యావరణ ఆర్గనైజేషన్ 45 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుస్థిరమైన మార్గంలో పయనించడం.ఉమ్మడి జిల్లాలో ప్రకృతి పరంగా పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతికపరంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నవని వాటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని తద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని జిల్లా అభివృద్ధి చెందుతుందని , కర్నూలు జిల్లాలో శిల్పారామంను ఏర్పాటు చేస్తున్నామని , స్థానికంగా హరిత హోటల్ ను పర్యాటకులను ఆకర్షించే విధంగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్  ప్రదర్శనలు , గురవయ్యాల నృత్యం, కోలాటం  ఆహుతులను అలరించాయి. జిల్లా కలెక్టర్ వారికి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా ఈ సమావేశానికి డి ఆర్ ఓ వెంకటనారాయణమ్మ, డిస్ట్రిక్ట్  టూరిజం డివిజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, జడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి,హోసింగ్ పీడీ చిరంజీవి, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐఓ లాలెప్ప, డిఎస్ఓ రాజా రఘువీర్ , ఎస్ డి సి నాగ ప్రసూన లక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డిసి కొండయ్య, డి ఆర్ డి ఏ పీడీ రమణారెడ్డి, సీపీవో భారతి, తహసీల్దారులు రమేష్, రవి , శ్రీనాథ్, టీజీవీ కళా క్షేత్రం కళారత్న పత్తి ఓబుళయ్య, టూరిజం శాఖ సిబ్బంది, ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.  

APRSA కర్నూలు రెవెన్యూ డివిజన్ ఆధ్వర్యంలో … సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ వర్ధంతి

సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి  పూల మాలలు వేసిన APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావు, డివిజన్ తహసీల్దారులు 

ఈసీ సమావేశంలో వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన సదస్సు

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు ఈసీ సమావేశంలో వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన సదస్సు V POWER NEWS  : కర్నూలు జిల్లాలోని..స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు జిల్లా మహిళ సమైక్య ఈసీ సమావేశంలో శక్తి మిషన్ కింద పనిచేసే వన్ స్టాప్ సెంటర్ సర్వీసెస్ ప్రీమారిటల్ కౌన్సెలింగ్, మిషన్ వాత్సవం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది వి. విజయ కుమారి, యం.సునీత మరియు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో .. ఘనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభం..

V POWER NEWS: కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపెటర్ బోరెల్లి సుధాకర్ మరియు ఫోటోగ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫైటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డిజి ప్రింట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ కార్డ్స్ ,ఆల్బమ్స్, బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్, విసిటింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, LED ప్రేమ్స్, వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో  వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాదు మరియు  విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటితో తయారు చేయబడు తుందని ఆయన తెలిపారు. ఈ సదా అవకాశంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవ,జయకాంత్ క్రిస్టియన్.భార్గవాచారి ఫోటో వీడియో గ్రాఫర్స్ ప్రెసిడెంట్,బద్రి ప్రసాదు సీనియర్ ఫోటోగ్రాఫర్, రాంభూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్, సురేష్ బాబు సీనియర్ డిజైనర్, వడ్ల మధు కుమార్ సీనియర్ డిజైనర్, సిద్దు పవర్ సీనియర్ డిజైనర్, బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్, కే చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్, ధర్మాపేట శేఖర్, ఇబ్రహీం నవత స్టూడియో,మరియు కుటుంబ సభ్యులు,ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్, పాస్టర్స్, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!