నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి రాజకుమార్ గణియ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల ఆదేశాలతో .. మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించిన శ్రీశైలం రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య ఆధ్వర్యంలో నల్లమల అడవులలో నివసిస్తున్న అడవి బిడ్డలైన చెంచు గిరిజనులకు ఉచిత వైద్య సేవలను అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని హటకేశ్వరం వద్దగల చెంచుగూడెం లో నివసిస్తున్న చెంచు బిడ్డలకు రెడ్ క్రాస్ సొసైటీ వారి మొబైల్ హెల్త్ వ్యాన్ ను అందుబాటులో పెట్టి వారి ఆరోగ్య సమస్యలపై చర్చించి వారికి అవసరమైన మందులు టానికులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు అందరికీ కూడా బిపి షుగర్ అలాగే పల్స్ ఆక్సి మీటర్ ద్వారా ఆరోగ్యమును పరీక్షించి వారికి అవసరమైన సిరప్ లను, టాబ్లెట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయడం జరిగిందని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు నల్లమల అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు కనుక ఎక్కువగా వీరి జీవనం అడవులలో సాగుచున్నందున చెంచులకు ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు దగ్గు ఆయాసం ఆస్తమా గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కర్నూల్ జిల్లా చైర్మన్ శ్రీ KG గోవింద రెడ్డి, గార్ల సహకారంతో మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా అడవి బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. అలాగే ఈ సంవత్సరం శివరాత్రికి మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్, పల్స్ అక్సిమీటర్ బీపీ చెకింగ్ వంటి అత్యవసరమైన వైద్య పరికరాలను కైలాస ద్వారం వద్ద 24/7 అందుబాటులో ఉంచి ఎంతోమంది భక్తులకు వైద్య సేవ అందించడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామీణ వైద్యులు డాక్టర్ కే ప్రసాద్, విజయలక్ష్మి తో పాటుగా సభ్యులు ఎస్ భాస్కర్, దమయంతి, ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ టాగోర్ గారు అంబులెన్స్ డ్రైవర్ వరుణ్ కౌశిక్ మొదలవారి పాల్గొన్నారని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు.