జిల్లాలో రూ. 14 కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాo .. జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటకదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ….ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు.జిల్లాలో రూ. 14కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను, కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.. మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని, అలాగే ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీ , కరెంటు వాడకాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. సోలార్ పవర్ , విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కర్బన ఉద్గారాలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ, పవర్ అందించే చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ …స్పెయిన్ దేశంలో ప్రపంచ పర్యావరణ ఆర్గనైజేషన్ 45 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుస్థిరమైన మార్గంలో పయనించడం.ఉమ్మడి జిల్లాలో ప్రకృతి పరంగా పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతికపరంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నవని వాటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని తద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని జిల్లా అభివృద్ధి చెందుతుందని , కర్నూలు జిల్లాలో శిల్పారామంను ఏర్పాటు చేస్తున్నామని , స్థానికంగా హరిత హోటల్ ను పర్యాటకులను ఆకర్షించే విధంగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు , గురవయ్యాల నృత్యం, కోలాటం ఆహుతులను అలరించాయి. జిల్లా కలెక్టర్ వారికి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా ఈ సమావేశానికి డి ఆర్ ఓ వెంకటనారాయణమ్మ, డిస్ట్రిక్ట్ టూరిజం డివిజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, జడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి,హోసింగ్ పీడీ చిరంజీవి, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐఓ లాలెప్ప, డిఎస్ఓ రాజా రఘువీర్ , ఎస్ డి సి నాగ ప్రసూన లక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డిసి కొండయ్య, డి ఆర్ డి ఏ పీడీ రమణారెడ్డి, సీపీవో భారతి, తహసీల్దారులు రమేష్, రవి , శ్రీనాథ్, టీజీవీ కళా క్షేత్రం కళారత్న పత్తి ఓబుళయ్య, టూరిజం శాఖ సిబ్బంది, ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.