పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్ రాకేష్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి — PDSU-PYL సంఘాల డిమాండ్.

డబ్బులు దండుకొని వైద్యం చేయకుండా పసికందు మృతికి కారణమైన డాక్టర్ రాకేష్ రెడ్డి తక్షణమే అరెస్టు చేయాలి. …. లేనిపక్షంలో పిడిఎస్యు-పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో మధు చిన్నపిల్ల హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళన సిద్ధం అవుతాయo …. 

 V POWER NEWS   : నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల ఆస్పత్రిలో వైద్యం వికటించి పసికందు మృతి కారకులైన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసికందు మృతి సంఘటన పైన సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈరోజు జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న హాస్పటలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా డబ్బే ధ్యేయంగా నడుపుతున్న హాస్పిటల్ పైన DMHO వత్తాసుపలుకుతున్నారని వారు ఆరోపణ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల హాస్పిటల్లో ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమని గత 21 రోజులుగా వైద్యం అందిస్తున్నామని నటిస్తూ దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఒక పసికందు మృతికి కారణమైనటువంటి మధు చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ రాకేష్ రెడ్డి ని తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో రోజుకు హాస్పిటల్ పూటకు ఒక హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయంటే ప్రధాన కారణం జిల్లా వైద్యశాఖ అధికారులే అని ఆరోపించారు ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయం లేకుండా పార్కింగ్ స్థలం లేకుండా ఫైర్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత కలిగినటువంటి డాక్టర్లు లేకుండా వైద్య చదువును చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా వైద్య విద్యను కొని డాక్టర్లుగా పొందినటువంటి డాక్టర్లు ఉండడం ఇటువంటి అంశాలపైన ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా జిల్లా వైద్య శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడమే ప్రధాన కారణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి నంద్యాల పట్టణంలోని మధు చిన్నపిల్లల హాస్పిటల్ లో పసికందు మృతి పై సమగ్ర విచారణ జరిపించి డాక్టర్ రాకేష్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి హాస్పిటల్లో సీడ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాకాకుండా ఈ సమస్యను తప్పుదో పట్టించేందుకు డిఎంహెచ్ఓ పై స్థాయి అధికారులు ప్రయత్నం చేసి డాక్టర్ రాకేష్ దగ్గర నుండి మూడు పూలు తీసుకొని ఆ పసికందు మృతి పైన ఎటువంటి విచారణ చేయకపోతే పిడిఎస్యు పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో దందా కొనసాగుతున్నప్పటికీ, విచ్చలవిడిగా ఓ పిల్ల పేరుతో వివిధ రకాల టెస్టుల పేరుతో స్కానింగ్ లో పేరుతో డబ్బులు వసూలు చేస్తు పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ లో పైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నినెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి డిఎంహెచ్ఓ పైన జిల్లా వైద్యశాఖ అధికారుల పైన విచారణ చేపట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారి రంగ ప్రవేశం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ పైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ డాక్టర్లపైన ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే రాకేష్ రెడ్డి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి హాస్పిటల్లో సీజ్ చేయాలి రాకేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!