– మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం.
– వైద్య సేవల్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం.
— నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

అలాగే మధు మణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదనరావు రూ 1000/- విలువైన వినికిడి పరీక్ష (OAE) పూర్తిగా ఉచితంగా, వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం, పుట్టు, మూగ, చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు, రెండు అక్షరాల పదాలు అత్త, మామ, అమ్మ,అని కూడా పలుకలేకపోయిన నిరుపేదలకు ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం, 2-3 సంవత్సరాలైనా అందరి పిల్లల మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు 13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డా. ఎన్. టి. ఆర్ వైద్య సేవ & CMRF ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు. భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలలో 150 ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్ గర్వాంగా ఉందన్నారు. అందరు డాక్టర్ల సహకారంతో నంద్యాల జిల్లాను వైద్య సేవల్లో మొదటి స్థానం నిలుపుదాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు. నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్లుతానని ఆమె చెప్పారు. రాష్ట్రంలోనే నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాటుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్, ఎంపీ శబరి గురువు లు డాక్టర్ ఫణిందర్, నంద్యాల ఐ ఎం ఏ అధ్యక్ష, కార్యదర్సులు మధుసూదనరావు, జి. రవికృష్ణ, డాక్టర్లు నాగమణి, మాధవి, మణిదీఫ్, ఎం. వెంకట మస్తానయ్య, రోహిత్, తదితర వైద్యులు ఉన్నారు.