ఆంధ్ర ప్రదేశ్

మాధవరం చెక్ పోస్ట్ వద్ద .. భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత

మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద శనివారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా కొందరు టాటా సుమోలో అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రమేష్ రెడ్డి తెలిపారు..వాహనంలో 30 బాక్సుల మద్యం 2080 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులు వెంకటేష్, తిమ్మయ్య, నాగయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు లబ్ధి – ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి.

సయ్యద్ ఖాన్ సర్జరీ కి 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందచేసినా ఎమ్మెల్యే  ఆదోని  ఎమ్మెల్యే  పార్థసారథి  మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు బాగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అనంతరం గురువారం ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే డా.పీవీ పార్థసారథి దరఖాస్తుదారులకు అందజేశారు.కూటమి ప్రభుత్వము అనారోగ్య తో బాధపడి, హాస్పటల్ లో ఎక్కువ ఖర్చు పెట్టిన వారికి సీఎంరిలీఫ్ ఫండ్ ఉపయోగపడు తుందనీ తెలిపారు. పింజరి కాలనీకి సంబంధించి సయ్యద్ ఖాన్ కి సర్జరీ నిమిత్తం ముందుగా 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందజేసమాని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వము ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

పోలీసు లపై తిరగబడిన ముద్దాయులు అరెస్టు .. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ 

ముద్దాయిలను రిమాండ్ కు  తరలించినా  పోలీసులు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు  విక్రాంత్ పాటిల్  ఆదేశాల మేరకు, ఆదోని  డి.ఎస్.పి యం. హేమలత  వారి సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  కే. శ్రీరామ్.   11.02.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని మధు ఆసుపత్రి యజమాని అయిన  గుర్రెడ్డి  ఫిర్యాదు మేరకు, ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్  18/2025 u/s 308(2), 351 (2) r/w 3 (5)  BNS మేరకు రఘునాద్ మరియు అడివేష్ అను ముద్దాయులపై కేసు నమోదు చేయడమైనది.  సదరు కేసులో ముద్దాయులు మధు ఆసుపత్రి లో  ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరున చాలా అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు.  సదరు పిర్యాదులను వెనుకకి తీసుకోవడానికి ఫిర్యాదు దారుడు అయిన గుర్రెడ్డి ని ముద్దాయులు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారని ఫిర్యాదు దారుడి అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకుని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విదంగా ఒప్పందం  కుదుర్చుకోవడం జరిగింది.  అంతేకాకుండా బలవంతంగా 10 వేల రూపాయలను ఫోన్ పే కూడా చేయించుకున్నారు.  సదరు కేసులో ముద్దాయులకు నోటీసులు ఇవ్వడానికి 12.02.2025 వ తేదీన సాయంత్రము 17.15 గంటలకు బాల భాస్కర్ మరియు ముని చంద్ర కానిస్టేబుళ్లు వెళ్ళగా వారిపై తిరగబడి దాడికి పాల్పడి గాయపరచి పారిపోవడము  జరిగినది.  సదరు సంఘటనపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు Cr No.19/2025 u/s 121(1) r/w 3(5) BNS,ఆదోని  వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ రామ్ కేసు నమోదు చేయడo జరిగిందని, శనివారం నాడు  ఆదోని ఎస్డిపిఓ అయిన  ఎo. హేమలత వారి పర్యవేక్షణలో , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన. శ్రీరామ్ , ఎస్ ఐ.రామస్వామి  మరియు సిబ్బంది ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జి వద్ద సదరు ముద్దాయులను అరెస్టు చేసి రిమాండుకు పంపడము జరిగిందని అలాగే  ప్రస్తుత పంచాయతీ రాజ్ డెపార్టుమెంట్ కు చెందిన డిప్యూటీ ఇంజనీర్  (DE) ని కూడా డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారమ ఉందని  కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి అడివేష్ @ ఏనుగుల అడివేష్, అను వీరిపై  గతంలో వీరిపై ఇస్వి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాబడినది అని  వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్  మీడియా సమావేశంలో తెలిపారు. 

విద్య మించిన వెలుతురు కిరణం మరొటిలేదు ..

.. సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐ.జి ఇక్బాల్  కర్నూలు జిల్లా/ కోసిగి మండలం… విద్యను మించిన వెలుతురు కిరణం మరోటి లేదని,విద్య అనేది సమాజం యొక్క ఆత్మ అని,విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఒకరిని ఆలోచింపజేయటమనీ,ఎంత ఎక్కువ చదివితే ఎక్కువ విషయాలను తెలుసుకోవచ్చని రిటైర్డ్ ఐజి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్,బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ విక్రాంత్ బాటిల్ తో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులను గురువులను గౌరవించి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచాలన్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి ఎదగాలన్నారు. మారుమూల పల్లెల్లో చదివిన వారు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నారని ఇందుకు ఉదాహరణ ఇక్బాల్ గారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని జిల్లా అధికారులతో పరిష్కారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఈరన్న, ఉస్మాన్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి వారి ఏడవ వార్షికోత్సవం. … ముఖ్య అతిథులుగా మాజీ టిడిపి ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు

కర్నూలు జిల్లా ,పెద్దకడబూర్ మండలం నెమలికల్లు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి వారి 7 ఏడవ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివారికి అభిషేకం అర్చన జరిపారు తదుపరి స్వామి వారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు టిడిపి యువ నాయకుడు భూపాల్ చౌదరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ దేవాలయ అభివృద్ధి కొరకు నా వంతు సహకారం అందిస్తాము అలాగే ప్రభుత్వం నుండి సహాయ సహకారం అందే విధంగా చూస్తాను ఎల్లవేళలా మా కుటుంబ సమేతంగా దేవాలయానికి మరియు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం అంటూ మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు ఇక్కడ ముఖ్యంగా దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున దయచేసి మాకు సీసీ రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటూ మౌనేశ్వర స్వామి భక్త బృందం వారు వేడుకుంటున్నారు

పెద్ద తుంబలం గ్రామంలో.. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే పార్థసారథి

తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన బిజెపి ఎమ్మెల్యే. – పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి   కర్నూలు జిల్లా.. ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి .ఈ సమావేశంలో మీడియాలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాం గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం. కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టిన పార్టీ చీలిపోదు. ఇది మీరు గుర్తుంచుకోవలసినది కూటమిలో పొత్తుల భాగంగా అలిగిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్థసారథి ఇకనుంచి అన్ని మంచి రోజులే మనమందరం కలిసి ఉందాం కలిసి అభివృద్ధి చేద్దాం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అన్వర్ భాష మౌలా సాబ్ ,షేకఅహ్మద్ నాగరాజు,కాసిమయ్య నరసయ్య,జాహీర్, రామిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే నాకు శాపం … భర్తను పోగొట్టుకున్న భార్య .. నాకుటుంబం పై కర్రలతో దాడులు..

 – పోలీసులు కేసు నమోదు చేసి .. న్యాయంచేయాలని శిరీష రోదిస్తూ ఆవేదన  కర్నూలు జిల్లా, ఆదోని డివిజన్ కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి వేసుకుందని ఆమె తెలిపారు.  ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుండి భర్త వారింట్లో వేదింపులకు పెట్టారని శిరీష రోదిస్తూ తెలిపారు.  నా భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాపోయింది. అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిరీషను తమ పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు. అయితే నా భర్తకు రావలసిన ఆస్తి కి అడ్డు అవుతుందని నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనతో శిరీష ఇంటిపై బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కర్రలతో ఇనుప రాడ్తో దాడి చేశారని నా తమ్ముడికి బలమైన గాయాలైనాయని శిరీష రోదిస్తూ వాపోయింది. అలాగే నిన్ను చంపేస్తాం మీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శిరీష ఆరోపించింది.  నా కుటుంబ సభ్యులకు  నా పిల్లలకు, రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదుచేసి నా పిల్లలకు నాకు న్యాయం చేయాలని పోలీస్ వారిని బాధితురాలు శిరీష రోదిస్తూ వేడుకుంది.

శ్రీశైలం మల్లన్న సేవలో … తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS దర్శించుకుని పూజలు నిర్వహించారు ముందుగా స్వామివారి దర్శనార్ధం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS కు ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు వేదపండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులు స్వామిఅమ్మవారి జ్ఞాపికను అందజేయగా అర్చకస్వాములు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్ధప్రసాదాలను అందించారు..

విజిబుల్ పోలీసింగ్ పెంచడం…రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్. 

•  గత వారం రోజుల నుండి జిల్లాలో కొనసాగుతోన్న పోలీసుల చర్యలు. … డ్రంకన్ డ్రైవ్ కింద 316  కేసులు నమోదు చేసిన పోలీసులు. …ఓపెన్ డ్రింకింగ్ పై 659  కేసులు. ..  విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు

గిరిజన ప్రజలకు ఉపయోగం లేని  “గిరిజన భవన్” …

కర్నూలు  :    లంబాడి హక్కుల పోరాట సంఘం  రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కైలాష్ నాయక్  గిరిజన భవన్  సందర్శించిన సందర్భంగా సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ .. రాష్ట ప్రభుత్వం గిరిజన ప్రజలకు వివాహాముల పంక్షన్ సుబాకార్యలకు మరియు ప్రభుత్వ కార్యక్రమం ల కోసం చాల సంవత్సరాలు గా  గిరిజన సంగాల పోరాట పలితంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2023 సంవత్సరం లో కర్నూలు పట్టడానికి 5 కిలోమీటర్ దూరంగా ఉండడం మరియు కోటి 35 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి.కనిసం రహదారి కూడ సరిగ్గా లేకుండా  గిరిజనం భవన్ కట్టించారన్నారు. అందులో కనీసం కూర్చోవడానికి కుర్చీలు ‘ వంట సామానులు’ సప్లయర్ సామాన్లు మరియు మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఖాళీ స్థలంలో ఉన్న గుంతలు పూడ్చక పోవడం,  గిరిజన ప్రజలకు భవనం ఎటువంటి ఉపయోగం పడటం లేదని వీటిని ప్రభుత్వం వెంటనే సమకూర్చలని. డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో  రత్నవత్ శంకర్ నాయక్,కాట్రవత్ శంకర్ నాయక్ ఉన్నారు. 

error: Content is protected !!