డిమాండ్ చేసినా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్

నంద్యాల జిల్లా “Vపవర్ న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్.యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం నాడు మంగళగిరి లోని విద్యా భవన్ నందు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ భాష్యం శ్రీ చైతన్య ఆక్స్ఫర్డ్ రవీంద్ర కేకేఆర్ వంటి మరియు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 2025 -26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు. కార్పొరేట్ సంస్థల వారు బహిరంగంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు వేసి అడ్మిషన్ల కొరకు ఎలక్షన్ ప్రచారం రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దిక్రీడో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ స్కూల్, అని ప్రచారం నిర్వహిస్తూ ఐఐటి త్రిబుల్ ఐటీ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఎల్కేజీ నుండే ప్రారంభిస్తున్నామని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆర్థికమే ధ్యేయంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి, చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల పేర్లతో పిఆర్ఓ లను ,ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్ ఫీజులతో పాటు,స్పెషల్ ఫీజు,పుస్తకాల ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాలలో ఉదృతమైన ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులుబి.సిద్ధు, కె.నాగరాజు,రూపాశంకర్, శ్రీను,మణి, భానుప్రసాద్ పాల్గొన్నారు.