ఆంధ్ర ప్రదేశ్

విద్య మించిన వెలుతురు కిరణం మరొటిలేదు ..

.. సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐ.జి ఇక్బాల్  కర్నూలు జిల్లా/ కోసిగి మండలం… విద్యను మించిన వెలుతురు కిరణం మరోటి లేదని,విద్య అనేది సమాజం యొక్క ఆత్మ అని,విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఒకరిని ఆలోచింపజేయటమనీ,ఎంత ఎక్కువ చదివితే ఎక్కువ విషయాలను తెలుసుకోవచ్చని రిటైర్డ్ ఐజి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్,బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ విక్రాంత్ బాటిల్ తో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులను గురువులను గౌరవించి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచాలన్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి ఎదగాలన్నారు. మారుమూల పల్లెల్లో చదివిన వారు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నారని ఇందుకు ఉదాహరణ ఇక్బాల్ గారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని జిల్లా అధికారులతో పరిష్కారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఈరన్న, ఉస్మాన్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి వారి ఏడవ వార్షికోత్సవం. … ముఖ్య అతిథులుగా మాజీ టిడిపి ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు

కర్నూలు జిల్లా ,పెద్దకడబూర్ మండలం నెమలికల్లు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి వారి 7 ఏడవ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివారికి అభిషేకం అర్చన జరిపారు తదుపరి స్వామి వారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు టిడిపి యువ నాయకుడు భూపాల్ చౌదరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ దేవాలయ అభివృద్ధి కొరకు నా వంతు సహకారం అందిస్తాము అలాగే ప్రభుత్వం నుండి సహాయ సహకారం అందే విధంగా చూస్తాను ఎల్లవేళలా మా కుటుంబ సమేతంగా దేవాలయానికి మరియు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం అంటూ మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు ఇక్కడ ముఖ్యంగా దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున దయచేసి మాకు సీసీ రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటూ మౌనేశ్వర స్వామి భక్త బృందం వారు వేడుకుంటున్నారు

పెద్ద తుంబలం గ్రామంలో.. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే పార్థసారథి

తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన బిజెపి ఎమ్మెల్యే. – పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి   కర్నూలు జిల్లా.. ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి .ఈ సమావేశంలో మీడియాలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాం గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం. కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టిన పార్టీ చీలిపోదు. ఇది మీరు గుర్తుంచుకోవలసినది కూటమిలో పొత్తుల భాగంగా అలిగిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్థసారథి ఇకనుంచి అన్ని మంచి రోజులే మనమందరం కలిసి ఉందాం కలిసి అభివృద్ధి చేద్దాం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అన్వర్ భాష మౌలా సాబ్ ,షేకఅహ్మద్ నాగరాజు,కాసిమయ్య నరసయ్య,జాహీర్, రామిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే నాకు శాపం … భర్తను పోగొట్టుకున్న భార్య .. నాకుటుంబం పై కర్రలతో దాడులు..

 – పోలీసులు కేసు నమోదు చేసి .. న్యాయంచేయాలని శిరీష రోదిస్తూ ఆవేదన  కర్నూలు జిల్లా, ఆదోని డివిజన్ కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి వేసుకుందని ఆమె తెలిపారు.  ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుండి భర్త వారింట్లో వేదింపులకు పెట్టారని శిరీష రోదిస్తూ తెలిపారు.  నా భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాపోయింది. అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిరీషను తమ పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు. అయితే నా భర్తకు రావలసిన ఆస్తి కి అడ్డు అవుతుందని నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనతో శిరీష ఇంటిపై బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కర్రలతో ఇనుప రాడ్తో దాడి చేశారని నా తమ్ముడికి బలమైన గాయాలైనాయని శిరీష రోదిస్తూ వాపోయింది. అలాగే నిన్ను చంపేస్తాం మీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శిరీష ఆరోపించింది.  నా కుటుంబ సభ్యులకు  నా పిల్లలకు, రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదుచేసి నా పిల్లలకు నాకు న్యాయం చేయాలని పోలీస్ వారిని బాధితురాలు శిరీష రోదిస్తూ వేడుకుంది.

శ్రీశైలం మల్లన్న సేవలో … తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS దర్శించుకుని పూజలు నిర్వహించారు ముందుగా స్వామివారి దర్శనార్ధం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS కు ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు వేదపండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులు స్వామిఅమ్మవారి జ్ఞాపికను అందజేయగా అర్చకస్వాములు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్ధప్రసాదాలను అందించారు..

విజిబుల్ పోలీసింగ్ పెంచడం…రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్. 

•  గత వారం రోజుల నుండి జిల్లాలో కొనసాగుతోన్న పోలీసుల చర్యలు. … డ్రంకన్ డ్రైవ్ కింద 316  కేసులు నమోదు చేసిన పోలీసులు. …ఓపెన్ డ్రింకింగ్ పై 659  కేసులు. ..  విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు

గిరిజన ప్రజలకు ఉపయోగం లేని  “గిరిజన భవన్” …

కర్నూలు  :    లంబాడి హక్కుల పోరాట సంఘం  రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కైలాష్ నాయక్  గిరిజన భవన్  సందర్శించిన సందర్భంగా సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ .. రాష్ట ప్రభుత్వం గిరిజన ప్రజలకు వివాహాముల పంక్షన్ సుబాకార్యలకు మరియు ప్రభుత్వ కార్యక్రమం ల కోసం చాల సంవత్సరాలు గా  గిరిజన సంగాల పోరాట పలితంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2023 సంవత్సరం లో కర్నూలు పట్టడానికి 5 కిలోమీటర్ దూరంగా ఉండడం మరియు కోటి 35 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి.కనిసం రహదారి కూడ సరిగ్గా లేకుండా  గిరిజనం భవన్ కట్టించారన్నారు. అందులో కనీసం కూర్చోవడానికి కుర్చీలు ‘ వంట సామానులు’ సప్లయర్ సామాన్లు మరియు మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఖాళీ స్థలంలో ఉన్న గుంతలు పూడ్చక పోవడం,  గిరిజన ప్రజలకు భవనం ఎటువంటి ఉపయోగం పడటం లేదని వీటిని ప్రభుత్వం వెంటనే సమకూర్చలని. డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో  రత్నవత్ శంకర్ నాయక్,కాట్రవత్ శంకర్ నాయక్ ఉన్నారు. 

సీజనల్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్.:-

సీజనల్ హాస్టల్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించండి.. సీజనల్ హాస్టల్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో సీజనల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. హాస్టల్ లోని ప్రతి గదిని తనిఖీ చేసి, విద్యార్థులతో ప్రభుత్వం అందిస్తున్న వసతుల గూర్చి సబ్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు కు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల హాజరు పట్టిక ప్రకారం విద్యార్థులు వసతి గృహం లో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో సబ్ కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

జగనన్న కాలనీపై విచారణ చేపట్టాలి. .. జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

 జగనన్న హౌసింగ్ స్కీం ద్వారా చేపట్టిన భూ సేకరణలో అవినీతి, అక్రమాలపై- విచారణ చేసి  అవినీతి కి  పాలపడ్డ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత రైతులకుa న్యాయం న్యాయం చేయాలని గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కు వినతి పత్రం అందించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి ఎం ఏ వై) కింద 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రాల అవసరాలను బట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్వంతంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని “జగనన్న హౌసింగ్ స్కీమ్” గా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, గృహ నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది.ఈ పథకం కింద ప్రతి జిల్లాలో వేల ఎకరాల భూమిని సేకరించి, అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అప్పటి వైసీపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ క్రమంలో అదోని నియోజకవర్గంలో కూడా ఈ పథకం అమలు చేయడానికి భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు ప్రభుత్వ నిధులను అక్రమంగా దోచుకోవడానికి, రైతులను మోసం చేయడానికి కుట్ర పన్ని, వారికి న్యాయం జరగకుండా నిధులను దారి మళ్లించారు.     ఈ ప్రాజెక్టు కోసం ఆదోనిలో 178 ఎకరాల వ్యవసాయ భూమి, 29/2020 మరియు 30/2020″ భూ సేకరణ నోటీసుల ద్వారా 06-03-2020 తేదీన, 36 సర్వే నంబర్ల పరిధిలోని 65 మంది రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం ₹24,03,00,000.00 నగదును  మంజూరు చేసింది. అయితే, అధికారిక భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టకముందే, రైతులను మోసం చేసి, వారి పరిహారాన్ని దోచుకోవడానికి నేరపూరిత కుట్ర రచించబడింది. ఒత్తిళ్లు, బెదిరింపులు, బలవంతపు ఒప్పందాలు వంటి పద్ధతులను ఉపయోగించి, రైతులను తప్పుదోవ పట్టించి, వారి పరిహారం నుంచి అధిక మొత్తాన్ని అక్రమంగా దోచుకోవడం జరిగింది.                                                                         కుంభకోణం జరిగిన విధానం ..అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆదోని ఎమ్మెల్యే గా ఉన్నటువంటి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. మనోజ్ రెడ్డి S/o వై. సాయి ప్రసాద్ రెడ్డి, నేసే ఎర్రిస్వామి S/o నేసే నారప్ప, చంద్రకాంత్ రెడ్డి S/o మనిక్య రెడ్డి, సుబ్బారెడ్డి, కామాక్షి తిమ్మప్ప, బి. నరసింహులు S/o బి. కృష్ణయ్య, సన్నీ (కాంట్రక్టర్ ), జి. రఘునాథ్ రెడ్డి S/o లాల్ రెడ్డి, జి. సందీప్ రెడ్డి S/o మల్లికార్జున రెడ్డి, కామవరం మహేందర్ రెడ్డి S/o ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి S/o బాలనాగి రెడ్డి, రామకృష్ణ రెడ్డి S/o చంద్రశేఖర్ రెడ్డి బి వెంకటేశ్వర్ రెడ్డి S/o బివి కృష్ణ రెడ్డి, నేసే వీరేష్ Slo నేసే ఈరన్న, బి. శివకుమార్ S/o బి. రామకృష్ణ, గోవిందరాజులు S/o తిక్కన్న, సి.హెచ్. నాగరాజు S/o దుర్గప్ప, పల్ల ఉచ్చిరెప్ప S/o పల్ల శివప్ప, కురువ రాజు S/o పెద్ద ఈరన్న, బి.టి. లక్ష్మన్న S/o బి. తిమ్మప్ప, ఎ. దుర్గప్ప S/o కుంటి అంజినయ్య, పి. రాజేశ్వర్ రెడ్డి S/o పేరం బాలిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి S/o సుదర్శన్ రెడ్డి, ఎస్. అశోక్ S/o ప్రసాద్, కురువ మల్లికార్జున S/o కె. రాముడు, ఈడిగ చిన్న గౌడ్ S/o శివరాజ్ గౌడ్, వినోద్ రెడ్డి S/o మల్లికార్జున రెడ్డి, సునీల్ రెడ్డి S/o కొండారెడ్డి, ఎస్.కే. పొంపారెడ్డి, పెద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాధవ రెడ్డి S/o నరసింహారెడ్డి, నల్లారెడ్డి S/o నరసప్ప, శేషిరెడ్డి, వై. రామకృష్ణ S/o ఈరన్న, ఎస్.కే. విజయ్ కుమార్, సనాఖాన్ ఇక్బాల్ S/o సనాఖాన్ ఖాదర్ వలి, బోయ దేవ S/o బోయ అంజనేయులు, సాకరె మల్లిఖార్జున S/o ఎస్ డీకప్పు, మహమ్మద్ అబ్దుల్ మౌస్ S/o ఎన్.ఎం.డి. మౌస్, బోయపాటి లోకేష్, మహేష్ కుమార్ రెడ్డి, వీరభద్ర రెడ్డి, కోటి రెడ్డి సహకారంతో పాటు, టి జయరామి రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్, అనే ప్రభుత్వ అధికారి ద్వారా రైతులచే బలవంతంగా ముందస్తు ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి చేశారు. రైతులకు ₹5 లక్షలు ఒక్కో ఎకరానికి మాత్రమే పరిహారంగా ఇవ్వబోతున్నట్లు తప్పుదోవ పట్టించి, వారు ప్రభుత్వం నిర్ణయించిన అసలు రేటు ₹13 లక్షలు నుండి ₹23 లక్షలు వరకు ఉన్న విషయం తెలియకుండా చేసారు. అధికారికంగా భూమిని ఎక్కువ ధరకు సేకరించిన తర్వాత, మిగిలిన మొత్తాన్ని అక్రమంగా మళ్లించడానికి కుట్ర పన్ని, రైతులను తీవ్రంగా మోసం చేసినా ప్రభుత్వం పరిహారం చెల్లించిన వెంటనే, అప్పటి ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి మరియు అతని అనుచరులు రైతులను బెదిరించడం, బలవంతపు డబ్బు వసూళ్లు, నేరపూరిత మోసాలకు పాల్పడ్డారు. ఎకరానికి ₹7-78 లక్షలు చొప్పున బలవంతంగా వసూలు చేయడం జరిగింది. దీనిని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులు, భౌతిక దాడులు జరిగాయి.ఈ అవినీతి వ్యవహారం బ్యాంక్ లావాదేవీలకు కూడా విస్తరించింది. రైతులను ఒకే విధంగా నియంత్రిత బ్యాంకు ఖాతాలు తెరవమని బలవంతం చేసి, వారి పేర్లతో ఖాతాలు తెరిపించి, వాస్తవానికి రైతులకు వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా, అతిథి ఖాతాల మాదిరిగా నడిపి, తమ స్వలాభం కోసం వ్యవస్థను దుర్వినియోగం చేశారు. రైతులచే ప్రీ-సైన్ చేసిన చెక్కులను బలవంతంగా తీసుకుని, నగదును అక్రమంగా తీసుకున్నారని  24,03,00,000.00 . 8,90,00,000.00  రైతులకు చేరింది, మిగతా రూ.15,13,00,000.00 అక్రమ మార్గాలలో మళ్లించబడింది. ఇది భూసేకరణ వ్యవస్థలో జరిగిన పెద్ద ఆర్థిక కుంభకోణం. ఇలాగే, ఇంకా ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేశారు…? అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఎన్ డి ఏ  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజలు పరిపాలనపై నమ్మకంతో చాలా మంది బాధితులు నన్ను ఆశ్రయించారు. ఏళ్ల తరబడి ఎదుర్కొన్న బెదిరింపులు, అక్రమ లావాదేవీలు వంటి విషయాలను బయటపెట్టారు. ఒక్క అదోని నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో జరిగిన ఆర్థిక అవినీతి ఇది. ₹15.13 కోట్లు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం) ప్రభుత్వ నిధులను వైసీపీ నాయకులు లూటీ చేసిన విషయం వెల్లడైంది. ఈ స్కామ్ లో  ప్రజల ఫిర్యాదులను దాచిపెట్టి, నిధులను దారి మళ్లించి, రైతులకు రావాల్సిన న్యాయమైన పరిహారాన్ని దోచుకోవడం జరిగింది. ఒక్క చిన్న పట్టణమైన అదోనిలోనే ₹15 కోట్ల అవినీతి జరిగితే, ఈ పథకాన్ని అమలు చేసిన మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇది ఎంత తీవ్రస్థాయిలో జరిగి ఉంటుందో…? ఈ తరహా కుంభకోణం ఒక్క ఆదోనిలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిందనే సమాచారం. మొత్తం స్కామ్ విలువ కనీసం ₹2,500 కోట్ల వరకు ఉండవచ్చు..!!. ఇది కేవలం ప్రభుత్వ నిధుల దుర్వినియోగమే కాదు, వేలాది మంది రైతుల హక్కులను కాలరాసే తీవ్ర అన్యాయం. రైతుల భూములను సేకరణ చేసుకుంటూ వారికి రావాల్సిన న్యాయమైన ప్రభుత్వ పరిహారాన్ని హరించి, లబ్దిదారులను మోసం చేసిన తీరుకు ఈ వ్యవహారం స్పష్టమైన నిదర్శనం. ఈ అవినీతి వ్యవహారంలో బాధిత రైతులకు న్యాయం జరగాలి. నేరపూరిత మోసాలకు పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షించాలి. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని, రైతులకు న్యాయ పరిరక్షణ అందించాలి. అందుకుగాను, తగిన విచారణ చేపట్టి, న్యాయపరమైన చర్యలు తీసుకోగలరని కోరినట్లు తెలిపారు.

error: Content is protected !!