నేరా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. … రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలి – కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
V POWER NEWS .. : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామ న్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు, శిక్షణ డీఎస్పీ ఉష శ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.