శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు … అంతిరెడ్డి అరవింద రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల)
శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బుధవారం నాడు శ్రీశ్రీశ్రీ తిరుపతి నాయన ఆరాధన కార్యక్రమం శుభ సందర్భంగా, శివోహం టెంపుల్ ట్రస్ట్ ఈ మహత్తర కార్యక్రమానికి అదేవిధంగా స్వామి అమ్మవార్ల భక్తులకు మరియు శివ స్వాములకు సేద తీర్చుకొనుటకు వసతులు, నీటి వసతులు, అన్న ప్రసాద వితరణ పూర్తిగా ఉచితంగా సంపూర్ణంగా జరిగినది. ఈ మహత్తర కార్యక్రమం వేల మంది శివ దీక్ష స్వాములు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.