గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి …. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్
V POWER NEWS .. : నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో వున్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ కరెక్షన్స్, మ్యుటేషన్ ట్రాన్స్‌యాక్షన్స్ సంబంధిత దరఖాస్తులను కూడా దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాసిల్దార్, సర్వే అధికారులు, గ్రామ రైతులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.