ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి – నందికొట్కూరు MLA గిత్త జయసూర్య.
గ్రీవెన్సెస్ కార్యక్రమంలో …. నందికొట్కూరు శాసనసభ్యుడు గిత్త జయసూర్య V POWER NEWS : నంద్యాల జిల్లా, నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ ప్రజాపిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 నెలలు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, సామాన్యుడికి కూడా పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు. ప్రజల నుంచి, అర్జీలు స్వీకరించారు. అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ,ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనాలని సూచించారని , ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగినది.