ఆంధ్ర ప్రదేశ్

పెద్దతుంబలం గ్రామంలో … ఉరి వేసుకుని వివాహిత మృతి.

పెద్ద తుంబలం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది 21ఏళ్ల వివాహిత అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనూష తన భర్త శాంతరాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు రెండేళ్ల అమ్మాయి 9 నెలల బాబు ఉన్నారు. అనూష తండ్రి నక్కల హనుమంతు, తల్లి నక్కల బుజ్జమ్మ. ఆమె కుటుంబంలో నలుగురు సంతానం ఉండగా అనూష రెండవ పాప. భర్త కుటుంబంలో మామ తిక్కయ్య అత్త లలితమ్మ ఉన్నారు. ఈ ఘటనపై అనూష కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అaనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అనూష మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కోసిగి పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

 కోసిగి పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక బార్డర్లో స్టేషన్ కు దగ్గర ఉండటంతో అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక దుకాణదారుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పాత రికార్డులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. రాబోయే రేణుక ఎల్లమాంబ జాతరను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని శాంతి భద్రతలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డి.ఎస్.పి ఉపేంద్ర బాబు,సి.ఐ మంజునాథ్,ఎస్సై చంద్రమోహన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 

తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి ..

తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి …                                                                     ******* నంద్యాల జిల్లాలో తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమాaరి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాగునీరు, పారి శుధ్యం, స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.   ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్టు, పొడి చెత్తతో పేపర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లలో మరమ్మత్తులు, ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలం లోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఏపీసిఎన్ఎఫ్ ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్ ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 15వ తేదీ మూడవ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛగ్రీన్ లీఫ్ రేటింగ్ కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్ లతో సమావేశాలు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాధి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

హలో మాల .. చలో కర్నూలు –

మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ యాట. ఓబులేష్, …రాయలసీమ మాలల యుద్ధ గర్జన ను జయప్రదం చేయండి … స్థానిక ఎస్వి ఎస్వి రెసిడెన్సి నందు మల్లెల వెంకటరావు మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ యాట.ఓబులేష్, గౌరవ అధ్యక్షులు మాధవ్ స్వామి , గోన నాగరాజు, జ్యోతి , మల్లెల వెంకటరావు  మాaట్లాడుతూ మా పోరాటము మాదిగలకు వ్యతిరేకం కాదు మా పోరాటము ప్రభుత్వాలకు వ్యతిరేకం, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ బద్ధమైనది కాదు, దేశంలో ఎస్సీ ఉప కులాలు చాలా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలు మాలలు నష్టపరిచే విధంగా కుట్రపూరితమైన ఆలోచనతో తక్కువ చేసి రిజర్వేషన్లు తక్కువ కల్పించి, విద్యాపరంగా రానీయకుండా అడ్డుపడుతున్నారు. ఉద్యోగాల్లో రాణియకూడదని కుట్ర చేస్తున్నారు.మా పోరాటం మాదిగలకు వ్యతిరేకం కాదు మా పోరాటం ప్రభుత్వాలను వ్యతిరేకం, వర్గీకరణ రాజ్యాంగపరమైన చట్టబద్ధతతో చేయాలనేది మా యొక్క డిమాండు, అందులో భాగమే కర్నూల్లో జరగబోయే రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వడ్డేపల్లి మాధవస్వామి, మాల మహానాడు నాయకులు మాధవస్వామి, వేల్పుల జ్యోతి, శివ శంకర్, కేదార్నాథ్, లక్ష్మయ్య, బండి సుధీర్, మాదాసు నాగరాజు,ప్రసాదు యోగి, బంగి స్వాములు, రవిరాజు, జాన్, శ్యామ్ ఇమ్మానుయేలు, నవీను, శ్రీనివాసులు, దండగేరి లక్ష్మన్న, శివ, బిసన్న తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మౌలిక వసతులపై సుదీర్ఘ సమీక్ష సమావేశo..

 భక్తులకు సౌకర్యాలతో వసతులను కూడిన ఏర్పాట్లను చేయండి .. నంద్యాల జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రుల బృందం ఆదేశాలు ..     శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానాన్ని సోమవారం  నాడు  రాష్ట్ర మంత్రులు బృందం పర్యటించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు కల్పించాల్సిన మౌలిక వసతులపై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని ఆలయ సీసీ కంట్రోల్ భవనంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నంద్యాల జిల్లా అన్ని విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లదర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించేందుకు  ఆదేశాలు జారీ చేశారన్నారు.గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు.ప్రతి భక్తునికి శ్రీస్వామిఅమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని,హోల్డింగ్ ఏరియా,పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు చేస్తూ దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు.   11 రోజుల  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల  కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు పాలు,మంచినీరు,బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్లో ఉన్న మహిళల పట్ల ప్రత్యేక దృష్టి చేపట్టాలని మంత్రుల బృందం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26,27 నాలుగు రోజులలో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసు అధికారులకు ఇచ్చేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందని,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు.అలాగే  ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుక అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.40 కి.మీ మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు,బిస్కెట్లు తదితర వాటిని ఇతర చేసేలా ఏర్పాటు చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.  అటవీ చెక్‌పోస్టులను, దేవదాయశాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ,పోలీస్, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని,  ప్రముఖుల దర్శనాలకు టైంస్లాట్ ఏర్పాటు చేయాలన్నారు.ఎంఎల్ఏ సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు.ఈ సమావేశానికి ముందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విపులంగా వివరించారు.సోమవారం ఉదయం దేవదాయశాఖ కమీషనర్, రామచంద్రమోహన్,  జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్‌లు భక్తుల క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు

హాస్టల్లో విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాo…. డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు.

నందికొట్కూరు నియోజకవర్గం … నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం బీసీ బాలుర వసతి గృహాన్ని నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లింగాల నాగరాజు పరిశీలించారు. హాస్టల్ వార్డెన్ మహేష్ తో సమస్యల పై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ ప్రభుత్వ హాస్టళ్ళ లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. విద్యార్థులకు త్రాగునీరు, నాణ్యమైన భోజనం అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం నూతన మధ్యాహ్న భోజన పథకం మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా అవకతవకలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య , రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే జిల్లా కలెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని  అన్నారు.

ఇంటి స్థలం గృహానికి 5 లక్షలు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని MRO కి వినతి…

నంద్యాల జిల్లా పగిడాల మండలం తాసిల్దార్ కు MCPI (U) నానాయకులaబృందం వినతి ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు డివిజన్ నాయకులు పి మరి స్వామి ఎల్ శ్రీనివాసులు ఏ కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లమైందని గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం 4 లక్షల రూపాయలు కొత్త రేషన్ కార్డులు తల్లికి వందనం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తానని ప్రతి రైతుకు 20వేల రూపాయలు అకౌంట్ లో వేస్తానని ప్రతి మహిళకు నెలకు 1500 సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు సూపర్ సిక్స్ లో భాగంగా నేటికీ అమలు కాలేదు వెంటనే అమలు చేయాలని వాపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం లో భాగంగా ఎంసిపిఐయు ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు చేస్తున్నామని లేని పక్షంలో మరింత పోరాటాలు దృతం చేస్తామని వారన్నారు.

error: Content is protected !!