ఆంధ్ర ప్రదేశ్

UJF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విస్తృత సమావేశం… ముఖ్య అతిథులుగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు. స్వేచ్ఛలో భారత్ అధమస్థానం … రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే. …మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి —

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం  ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ . అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ . జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు :ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్. V POWER NEWS  : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని, ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ, చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు. అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు. కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు. అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు. అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు. అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్, వజ్రరాజు, రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు, మద్దిలేటి, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ సొమ్ము ఇంటి పన్నుకుజమ.

వైద్యం కోసండబ్బులు లేక వితంతువు మృతి. .. బతిమలాడిన కనికరించని అధికారి.– గ్రామ పెద్దలు చెప్పిన వినని వైనం. — వైద్యం కోసం డబ్బులు లేకుంటే వడ్డీకి తీసుకోమని చెప్పిన అధికారి. — కన్నీరు కార్చిన కుమారుడు. –మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో మృతి చెందిన వితంతు మహిళ. — తన కన్నతల్లి మృతి పై అధికారుల నిర్లక్ష్యాన్ని చెబుతున్న కొడుకు. V POWER  NEWS  : రుద్రవరం మండలంలో..కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వంటరి మహిళలకు , కుల వృత్తుల వారికి మీ కష్టానికి తోడుగా మేమున్నామంటూ ప్రభుత్వాలు కొంత డబ్బులు పింఛన్ రూపంలో అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వారి జీవనానికి, వారి ఆరోగ్య స్థితి గతులకు , వ్యక్తిగత అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశతో వారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులు ఇంటి పన్ను ,నీటి పన్నులు కట్టాలంటూ మీ అవసరాలతో మాకేంటి మీ బాధలతో మాకేంటి అంటూ ముక్కు పిండి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్మును వసూలు చేయడంతో తమకు కనీస అవసరమైన మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో ఓ వితంతు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవి 45 సంవత్సరాలు ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ తీసుకుంటూ తన ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారి మార్చి మాసానికి చెందిన వితంతు పింఛన్ 4 వేల రూపాయలను లక్ష్మీదేవికి ఇవ్వలేదు. తన వితంతు పింఛను నాకు ఎందుకు ఇవ్వలేదని తన కొడుకుతో సహా వచ్చి అధికారిని అడగగా మీరు ఇంటి పన్ను కట్టలేదంటూ అందుకు బదులుగా మీ పింఛను సొమ్మును జమ చేస్తున్నామని జవాబు ఇవ్వడంతో కృంగిపోయిన ఆ మహిళ అయ్యా నాకు గత కొంతకాలంగా నేను షుగరు ఆయాసంతో నానా ఇబ్బందులు పడుతూ మందులను కొనుక్కొని వాటిని మింగుతూ బ్రతుకుతున్నాను నా మీద కనికరం ఉంచి నా పింఛను డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడిన కనికరించని ఆయన మీకు మందులకు డబ్బులు లేకపోతే నేను ఏమి చేయాలి మీరు ఇంటి పన్ను కట్టలేదు కాబట్టి నేను జమ చేసుకున్నాను. మీకు మందులకు లేకపోతే డబ్బులను వడ్డీకి తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచక గత 15 రోజులుగా నంద్యాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటూ ఉంది. తన పింఛను ఇప్పించమని లక్ష్మీదేవి గ్రామ పెద్దలతో చెప్పింది. గ్రామ పెద్దలు స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారికి పలుమార్లు చెప్పిన ఆయన వినలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. తన పింఛను డబ్బులు పన్నుల పేరిట జమ చేసుకోవడంతోనే సరైన సమయానికి మందులకు డబ్బులు లేకనే లక్ష్మి దేవి మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బుతో మందులను కొని వాటిని మింగుతూ బ్రతుకుతుందని తన కొడుకు రామ మోహన్ తెలిపారు. మా అమ్మకు వచ్చే పింఛను డబ్బును ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్బారావు పన్ను కట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చే 4000 రూపాయలను మాకు ఇవ్వకుండా జమ చేసుకున్నానని చెప్పాడు. మా అమ్మకు బాగాలేదు డబ్బు లేకపోతే మందులను నేను కొనలేను మందులు కొనకపోతే మా అమ్మ చనిపోతుంది సార్ అని గత 15 రోజులుగా బ్రతిమాలుతూనే ఉన్నాను. మీ బాధలతో మాకేంటి పని మీకు డబ్బు లేకపోతే వడ్డీకి తీసుకొని మందులను కొనుక్కొని మీ అమ్మను బ్రతికించుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు. ఇవాళ కేవలం మా అమ్మకు మందులు కొనలేక మా అమ్మ మృతి చెందిందని ఒక్కగా నొక్క కొడుకు కన్నీరు కార్చాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు కన్నీరు కార్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్మును పన్నుల పేరట వసూలు చేస్తూ ప్రజల చావులకు కారణమవుతున్న ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో … ప్రతి అంశాన్నీ నమోదు చేయాలి — జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ …  ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.  పోలీసులు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  అన్నారు.  ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ నేర సమీక్షా సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్  తో  జిల్లా ఎస్పీ  మాట్లాడారు. అనంతరం  సిఐడి ఐజి ,  సిసిటిఎన్ఎస్  గురించి  జిల్లా ఎస్పీ తో మాట్లాడారు… ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ   పోలీసు అధికారులతో  మాట్లాడo  జరిగింది.   కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు,  సూచనలు చేశారు.  కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలని,   పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్ఎస్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్‌ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు.   సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు,  నాన్‌ గ్రేవ్‌ కేసులలో పార్ట్‌ 1, పార్ట్‌ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.   మర్డర్‌ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా  కోర్టులో ధాఖలు  చేయాలని,  డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా  చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో  పని చేసే సిసిటిఎన్ ఎస్   పోలీసు సిబ్బందితో  మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు,  పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు  మరియు  డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్  ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో  తనిఖీలు నిర్వహించాలన్నారు.  సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.   ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా,  ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,  డిఎస్పీలు బాబు ప్రసాద్,  శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు ,  ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ ,  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు. 

మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములవ్వాలి .. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

V POWER NEWS  :  కర్నూలు జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాaలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆయా శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చూడాలన్నారు. ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే దాచి పెట్టవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, టోల్ ఫ్రీ నంబర్ వివరాలతో శాశ్వతంగా ఉండే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. పొలాల్లో గంజాయి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వీఆర్వోల ద్వారా సమాచారం తీసుకుని పోలీసు శాఖకు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులు కూడా గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం పట్ల నిఘా ఉంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు గంజాయి సాగు చట్ట పరంగా నేరమనే విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. బస్సులు, రైళ్ల ద్వారా వీటి రవాణాను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా … ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య

మెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ.…ఈ నెల 14 న ప్రారంభం.

… నెరవాటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సక్సెస్ సాధించింది…ఈ.ఎన్.టి గైనకాలని ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో.…నా చిరకాల కోరికను కొడుకు,కోడలు నెరవేర్చారు. నంద్యాల జిల్లా కావడంతో మెట్రో నగరాలకు పరమితమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.కనిపించని దేవిడి కంటే కనిపించే దేవుళ్ళు వైద్యులు…నంద్యాల పట్టణంమెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ. ఈ నెల 14 న ప్రారంభం.లో ప్రజలు వైద్య పరంగా కొన్ని సేవలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ ,చెన్నై,బెంగళూరు ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకునేవారు.అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలో నంద్యాల వైద్యులు ముందుకు వస్తున్నారు.కార్పొరేట్ వైద్యాన్ని నంద్యాల ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి లు నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నెల 14 న ప్రారంభిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలతో పేస్టు ఆర్థోపెడిక్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా వైద్యులు వినోద్ కుమార్,అరుణ కుమారి లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో 2004 లో నెరవాటి ఆసుపత్రిని ప్రారంభించి చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్యసేవలు అందించామని అన్నారు.2014 లో డాక్టర్ అరుణ కుమారి సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేశారని అన్నారు.10 ఏళ్లలో సంతానం లేనివారికి వైద్య సేవలు చేశారన్నారు. నెరవాటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏర్పాటు చేసి35 శాతం విజయం సాధించారని పేర్కొన్నారు.మెట్రో నగరాలకు దీటుగా వృద్ధి సాధించామని అన్నారు.2024 లో 100 పడకలు ఏర్పాటుచేసి నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంది అన్నారు.ఈ నేపథ్యంలోనే రైతుబజార్ సమీపంలో ఈ నెల 14 న నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నీ ప్రారంభిస్తున్నామని అన్నారు.గతంలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలు ,టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్లు ఉండేవని ఇప్పుడు ఆర్థోపెడిక్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.డాక్టర్లు సుమన్,ఫతిమాలు వైద్య సేవలు అందిస్తారని అన్నారు.ఆక్సిడెంట్ కేసులు,జాయింట్ రీ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ సాదారణ కాన్పులు,డెలివరీ సమయంలో మహిళలు ఇబ్బందులు పడకుండా కాస్మొటిక్ గైనకాలజీ వింగ్ ను ఏర్పాటుచేశామన్నారు.డెలివరీ సమయంలో కుట్లు పడడం,గర్భసంచి జారిపోవడం,యోని లూజు కావడం,కొందరికి మూత్రం పడిపోవడం జరుగుతుందని అన్నారు.ఈ సమస్యలకు ఆపరేషన్ లేకుండా వైద్య సేవలు( కాస్మొటిక్ గైనకాలజి ట్రీట్మెంట్)అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు.గర్భసంచి సమస్యలకు పొట్టమీద కుట్లులేకుండా లాప్రోసిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సంతానం లేనివారు ఎందరో మా ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకున్నారని అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఆశయం ఉండేదన్నారు.మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖర్చుతో కూడుకున్నవి అన్నారు.హైదరాబాద్ కు ధీటుగా నంద్యాలలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించాలనే నా చిరకాల కోరికను కొడుకు,కోడలు తీర్చడం సంతోషంగా ఉందన్నారు.కృషి,పట్టుదలతో ప్రజలకు మంచి వైద్య సేవలు చేసి మంచిపేరు తెచ్చుకున్నారని ఒక తండ్రిగా,మామగా ఇంతకన్నా నాకు ఏమి కావాలన్నారు.హైదారాబాద్ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గగన్,ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి రవి కుమార్ పాల్గొన్నారు.

సర్పంచ్ ఆగ్రహం…

వాటర్ షెడ్ అధికారితో వాగ్వాదం చేస్తున్న సర్పంచ్.  సర్పంచి తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని యాపదిన్నె గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి ఆగ్రహ వ్యక్తంం చేశారు. మంగళవారం ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి వాటర్ షెడ్ అధికారిని విజేతమ్మ తో వాగ్వాదం దిగారు. తెలుగుదేశం పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యత పెరుగుతుంది అనుకుంటే వాటికి విరుద్ధంగా నడుస్తుందని ఆయన వాపోయారు. అధికారులు ఒక ఒక వర్గానికి కొమ్ముకోయడం సరికాదన్నారుు. తమకు జరుగుతున్న అన్యాయంతమకు జరుగుతున్న అన్యాయం పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన … ఎం.పి బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : క‌ర్నూలు జిల్లా ఆదోని మండ‌లం పాండ‌వ‌గ‌ల్లు వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్ర‌మాదం పై ఎం.పి బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన ఫోన్ ద్వారా రోడ్డు ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. కర్ణాటక ఆర్టీసీ బస్సు రెండు బైకులను ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.. ఈ ప్రమాదంలో కుప్పగల్ కి చెందిన భార్య భర్తలు, కర్ణాటక లోని మాన్వికి చెందిన తల్లి తండ్రి కుమారుడు ఒకే సారి మరణించడం తన మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్న  ఎం.పి నాగరాజు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు…

మహిళా శాసన సభ్యురాలు  పల్లె సింధూర రెడ్డి మాటలను ఖండిoచినా … లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్.

— నాడు నేడు భిక్షాటనతోనే ఎరుకల , లంబాడి ప్రజల జీవితాలు.   గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా  గిరిజన,లంబాడీలకు ఉంది.  — రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు చేపడతాo.   V POWER NEWS  :   కర్నూలు మండలం ఎన్ఎస్ తండా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ గారు మాట్లాడుతూ ఈమధ్య ఆరవ తేదీన పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రజలు 35 లక్షల పైబడి 32 తెగలుగా ఉన్నారని వీరిలో ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థాయి ప్రాంతంలో ఏజెన్సీ గిరిజనులుగా ఇంకా కనీస రోడ్డు వైద్య సౌకర్యం లేని ప్రాంతంలో బ్రతుకుతున్నారని అలాగే మైదాన ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 20 లక్షల పైబడి జనాభా 70 నియోజకవర్గాలలో ఉన్నారని, ఈ ప్రజలను పాలకులు ఓటర్లుగా మాత్రమే వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని ఈ రాష్ట్రం వదిలి పారిపోయేటట్లు చేసే కార్యక్రమాలు పెట్టుకున్నట్టు ఉన్నట్లు ఉన్నారని. అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మొదటిసారి పుట్టపర్తి నియోజకవర్గం లో ఎన్నిక కాబడిన పల్లె సింధూర రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో దాదాపుగా 30 వేల  లంబాడి ఓట్లతోగెలిచి అక్కడ ఉన్నటువంటి గిరిజన లంబాడి ప్రజల. జీవితాలపై కనీస అవగాహన లేకుండా. స్వాతంత్రానికి ముందు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగల కంటే అన్ని విధాలుగా విద్య వ్యవసాయము వ్యాపార రంగాలలో ఉంటూ  హార్దికంగా రాజకీయంగా బ్రిటిష్ కాలంలోనే పాలేగాల్ల పాలన చేసినటువంటి బోయ కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ని స్వయానా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తో బోయలు నేటికీ దుర్భర జీవితాలు గడుపుతున్నారు లంబాడి ప్రజల ఓట్లతో గెలిచిన  ఎమ్మెల్యే  మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. నాడు నేడు గిరిజన లంబాడీల లు బ్రతుకుతెరువు లేక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తమిళనాడు రాష్ట్రం చెన్నై బాంబే కలకత్తా లాంటి నగరాలకు వెళ్లి బ్రతుకుతున్న సంగతి పాలకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ గిరిజనుల జీవితాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా కులాల మధ్య కుంపటి  పెట్టే కార్యక్రమాలు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామన్నారు.  ఒకవైపు అన్ని రంగాలలో రాయలసీమ బ్రిటిష్ కాలంలోనే  పాలెగాలుగా నేడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా శాసించే స్థాయిలో ఉండి అన్ని రకాల ముందున్న బోయజాతి వారిని అతి పేదవారిగా వర్ణిస్తూ విలువైన శాసనసభ  సమయాన్ని కేటాయించిన పల్లె సింధూర రెడ్డిని స్వయానా స్పీకర్ గారే సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా మా గిరిజన లంబాడీలకు ఉందని సంగతి గుర్తు చేస్తున్నామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు మొదలుపెడతామని కైలాస్ నాయక్  తెలిపారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ….

మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు.  …పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు.  … బ్యాంకు లింకేజీ కింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ  చేశాం.  ….నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతి చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు.  20వ శతాబ్ద ప్రధమార్ధంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. 

error: Content is protected !!