ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్

అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినా .. జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్

V POWER  NEWS :   కర్నూలు జిల్లా  సీ. బెలగల్ మండల పరిధిలోని పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక శ్రీలేఖ మృతి చెందింది. ఫిబ్రవరి 28వ తేదీన పోలకల్ పాఠశాల మైదానంలో వున్న చెట్టు ఈదురు గాలులకు మీద పడటం తో తీవ్రగాయాల పాలయ్యింది. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. ప్రమాదం జరిగిన రోజు నుండి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా డిఇఓ తో పాటు మండల విద్య శాఖ అధికారి ఆదమ్ బాషా గారు , హెడ్మాస్టర్ అసోసియేషన్ , ఆ పోలకల్ హెడ్మాస్టర్ మరియు టీచర్స్ ఆవిరామంగా కృషి చేశారు. డీఈఓ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే కాకుండా మండల విద్యాధికారులు అక్కడే వుంచి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం శ్రీలేఖ తుదిశ్వాస వదలడంతో జిల్లా విద్యాధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధను దిగమింగి పోస్టుమార్టం వద్ద తనే దగ్గర వుండి బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ భరోసాను కుటుంబ సభ్యులకు అందించారు. స్వగ్రామం గోనెగండ్ల మండలపరిధిలోని పెద్దనెలటూరుకు వెళ్లిన జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసి నివాళులు అర్పించారు. వెంటనే అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!