ఆంధ్ర ప్రదేశ్

పంచలింగాల గ్రామంలో … ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసినా …కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

… బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితం… గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు   V POWER NEWS  :     రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితమని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు.. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించారన్నారు.. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న ఎం.పి..రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, రఫిక్, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు..

ఐస్ ముద్దుపై శివలింగం – చిన్నారి అద్భుతం

కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన కిడ్నీస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఉజ్వల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐస్ ముద్దపై శివలింగాన్ని తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి శిక్షణ లేకుండా, స్వయంగా తన సృజనాత్మకతతో శివలింగాన్ని తీర్చిదిద్దడం విశేషం. ఈ సూక్ష్మ శిల్పకళను తయారు చేయడానికి ఉజ్వలకు ఒక గంట సమయం పట్టింది. ఐస్ ముద్దను తన చేతుల్లో పట్టుకొని సుతిమెత్తగా శిల్పాన్ని రూపొందించిన విధానం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఐస్ గడ్డతో శివలింగాన్ని సునాయాసంగా తయారు చేయగలగడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. ఉజ్వల యొక్క సృజనాత్మకతను పాఠశాల టీచర్లు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందిస్తూ, ఆమెకు ప్రశంసలు కురిపించారు. పసివాడైనప్పటికీ, పునీతమైన శివలింగాన్ని రూపొందించిన ఉజ్వల, భవిష్యత్తులో గొప్ప శిల్పి అవుతుందని ఆశాభావం వ్యక్తమైంది. ఆమెకు మహాశివరాత్రి పట్ల ఉన్న భక్తి, కళాప్రతిభ ఈ చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంది.

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి

శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పవిత్ర సందర్భంలో మంత్రి , ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల మంగళకాంక్షల మధ్య స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. భక్తుల భద్రత,సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అని తెలిపారు.రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నాము. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేదుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గానియ దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్ ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ,ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఊట కాల్వ సమస్య పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి రైతుల వినతి

నంద్యాల జిల్లాలో… రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేదిలేదు …  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం. ఆళ్లగడ్డ మండలం బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల్లోని ఊట కాల్వ శిదిలావస్థకు చేరుకోవడంతో మా గ్రామాలకు కేసి కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు, తాగు నీరు అందడం లేదని, ఊట కాల్వ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయా గ్రామాల రైతులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రం ద్వారా శనివారం నంద్యాల ఎంపీ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. రైతుల సమస్యలు విన్న వెంటనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించి కే సి కెనాల్ ఈ ఈ ప్రతాప్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల ప్రజలను ఇబ్బందిపెట్టే, నష్టం కలిగించే ఊట కాల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకుంటే తాను ఊట కాల్వ వద్దకు వెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేసి కెనాల్ ఈ ఈ కి స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎంపీ ఆదేశించారు. ఎంపీ శబరికి వినతి పత్రం అందించిన బత్తులూరు గ్రామ పెద్దలు కె.చిన్న వెంకటసుబ్బారెడ్డి, పార్థసారథిరెడ్డి,ఇరిగెల మహేశ్వరరెడ్డి,  తదితరులు ఉన్నారు.

మయూర వాహనంపై మల్లన్న వైభవం …. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పరవశించిన భక్తులు

నేడు రావణవాహన సేవలో దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు …  శ్రీశైలం  మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు శనివారం రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. ఆనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూర వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజారికాలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్షేత్రపుర వీదుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి. డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన… కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

సిబ్బంది సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని భరోసా .. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  జిల్లా పోలీస్ కార్యాలయంలో “పోలీస్ వెల్ఫేర్ డే” (గ్రీవియన్స్ డే) ను నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారి యొక్క సమస్యల గురించి ( ట్రాన్స్ఫర్స్, రిక్వెస్ట్లు, మెడికల్ సమస్యలు) జిల్లా ఎస్పీ కి విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ  వారి సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.సిబ్బంది వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రీవియన్స్ డే ను ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ  తెలిపారు.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీశైలo మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, శ్రీకాళహస్తి దేవస్థానంఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి అర్చకులు,అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు దంపతులకు శ్రీకాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శేష వస్త్రాలతో సత్కరించారు.

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినా ఈవో శ్రీనివాసరావు దంపతులు  శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మార్చి 1 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ప్రారంభించారు అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీస్వామి అమ్మ వారి దర్శిస్తారని అంచనా వేశామన్నారు అలానే భక్తులకు 30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మ వాళ్ళని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేటి నుండి 23వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5 : 30 గంటలకు అంకురార్పణ,అగ్నిప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ చేస్తారు రేపటి నుండి ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైలం క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో అవినీతి వృక్షం వీఆర్వో జయరాం రెడ్డి .. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ  477 సర్వేనెంబర్ నందు 2 ఎకరాల 77 సెంట్లు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధ కుటుంబం ఆశ్రయించినారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో ఇటువంటి దుర్మార్గుల గ్రూప్ అండదండలతో వీఆర్వో జయరాంరెడ్డి అవినీతిపరుడుగా అంచలంచలుగా ఎదిగినారని, అతని మీద విచారణ జరుపుతున్నారని తెలిసిందే అన్నారు. నేను సబ్ కలెక్టర్ కు మరియు  సబ్ రిజిస్టర్ కు ఒక లేఖ రాస్తున్నామన్నారు.   కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగేవరకు  ఆ స్థలం పై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తరం రాస్తున్నామన్నారు. ఆదోని చుట్టుపక్క ప్రాంతాల్లో ఇట్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్ కు ఒక లెటర్ రాసి వారికి అందించగలరని మీ వివరాలు రహస్యంగా ఉంచుతూ కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోండి – ఎమ్మెల్యే గిత్త జయసూర్య.

గ్రామాల్లో అభివృద్ధి పనులపై నివేదికలు తయారు చేయండి. – సీసీ రహదారులు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. …గ్రామంలో తాగునీటి సమస్య రానివ్వొద్దు. – అవసరమైతే బోర్లు, పైపులు ఎంత అవసరమో ముందే చెప్పండి. – నియోజకవర్గ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే జయసూర్య.

error: Content is protected !!