ఆంధ్ర ప్రదేశ్
తమపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి. … శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజీత్ బాషకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యా సాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు. శ్యామ్ విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ వెంచర్లో ఓకిరాణం షాపు విషయంలో గోడవ చోటుచేసుకుందని ఈఘటనపై నాగులాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మందలించారని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో అందరూ మంచి గా ఉండాలని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై అసభ్యంగా మాట్లాడి దాడి చేశారన్నారు. ఈఘటన పై నాగులాపురం స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. విద్యా సాగర్ ను సస్పెండ్ చేసి ఈకేసులో వారిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు 15మంది పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు
తర్తూరు గ్రామంలో …. రమణీయంగా శ్రీలక్ష్మి రంగనాథ స్వామి రథోత్సవం.
ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి హాజరు. V POWER NEWS : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా ఆలయ కమిటీ నిర్వహకులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగించారు. అనంతరం రథంలో స్వామివారిని ఉంచి గోవింద నామ స్మరణంతో వేలాది మంది భక్తుల మధ్య ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, రథోత్సవం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రథోత్సవం సందర్బంగా చేపట్టిన పలు పూజా కార్యక్రమాలలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి శివానందరెడ్డి , పాణ్యం టీడీపీ యువనాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి సాయి కుమార్ , తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి కృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నా ఎమ్మెల్యే స్వామి వారి తేరును భక్తులతో కలసి లాగారు. స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లా కర్నూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఇదేళ్ల పాలనలో తర్తూరు జాతర కళ తప్పిపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ పల్లెల్లో పండగ జాతరలు అంగరంగ వైభావంగా ప్రజలు జారుకున్నరన్నారు. రైతు జాతర తర్తూరు కు పూర్వవైభవం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటుచేకోకుండ ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఆధ్వర్యంలో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయమే వివిధ గ్రామాల నుంచి భక్తులు బక్షాలబండ్లు తో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పంటలు వచ్చిన సమయంలో స్వామివారిపేరు మీద తీసిపెట్టిన ధాన్యంతో చేసిన భక్ష్యాలను నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెపుతుంటారు . కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తరిగోపుల మందడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి రమణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాధవరం ప్రకాశం మాధవరం, తాటిపాడు నాగిరెడ్డి కమిటీ సభ్యులు ప్రభావతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు, పరమేశయ్య, వెంకటసుబ్బమ్మ, సుబ్బన్న, టీడీపీ నాయకులు రమణారెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, గుండం రమణారెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
డ్రోన్ కెమెరాలతో… ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి
V POWER NEWS : కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్. ఆదివారం తెలిపారు. కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాలతో కర్నూల్ పట్టణంలో పోలీసులు డ్రోన్ల తో నిఘా పటిష్టం చేశారు.అనంతరం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్ ను పరిశీలించారు. ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ…నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్ స్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు. అలాగే ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రధాన దృష్టి సారిస్తున్నాని, ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామని,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్.
నిర్లక్ష్య ధోరణి లో .. శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి
V POWER NEWS, SRISAILAM : శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి వర్కింగ్ సమయంలో హాస్పిటల్ ని తెరిచి ఉంచి, డాక్టరు మరియు ఇతర సిబ్బంది హాస్పిటల్ లో లేకపోవడం, ఎమర్జెన్సీలో వచ్చినటువంటి రోగులని పట్టించుకోకపోవడం లేదనీ, శ్రీశైల దేవస్థానం స్వామివారి దర్శనార్థం యావత్ భారతదేశం నుండి అనేక విధాలైనటువంటి ఏజ్ లిమిట్ లేనటువంటి వారు భక్తులు వస్తుంటారు. వేసవికాలం సమయంలో, ప్రయాణంలో ఇబ్బందులకు చేస్తున్నారన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే వారు, వేసవికాలంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ హాస్పిటల్ చేరుకున్న వారికి, ఈరోజు సాయంత్రం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు డాక్టరు మరియు ఇతర సిబ్బంది లేకపోవడం, భక్తులకు మరియు స్థానికులకు రెండు గంటలసేపు వెయిటింగ్ చేసి, వెళ్లడం జరుగుతుంది. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పై, మరియు సిబ్బందిపై, చర్యలు తీసుకోవలసినదిగా, పాత్రికేయుల సమక్షంలో పై పెద్దలకు వినతి కోరుతున్నామన్నారు. వేసవికాలంలో ఈ రకంగా ఆసుపత్రిని తెరిచి ఉంచి రోగులను వేటింగ్ చేయించడం సరికాదని, డాక్టరు లేని సమయంలో మిగతా సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం రోగులకు ఇబ్బందికరంగా ఉందన, ఎవరూ లేని సమయంలో ఆసుపత్రిని తెరిచి ఉంచడం మంచిది కాదని, ఆసుపత్రి తెరిచి ఉంచినప్పుడు సంబంధిత సిబ్బంది ఉండవలసి ఉంటుందని తెలియపరుస్తూ ఇక్కడ డాక్టర్ లేడు ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది లేదు, కావున తక్షణం వీరిపై పై అధికారులు చర్యలు తీసుకోవలసినదిగా మీడియా ముఖంగా తెలియపరుస్తూ. ఈ విషయంపై హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఫిర్యాదు చేయవలసి ఉంటుందని అంతిరెడ్డి అరవింద రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు.
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. V POWER NEWS : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా,డ్రంకెన్ డ్రైవ్ వంటి తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.(మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు)గత వారంలో కర్నూలు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు 12 నమోదు కాగా,5 మంది మృతి చెందారని,12 మంది గాయపడినట్లు తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 136 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి,కోర్టుకి హజరు పరిచామన్నారు.
ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ నియామకం.
V POWER NEWS : రాష్ట్రంలో అవినీతి నిరోధక మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థకు ఆదోని నియోజకవర్గానికి చెందిన హెచ్ కె శ్రీకాంత్ (రావు)ని కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీగా నియమిస్తూ ఫౌండర్ దేవానంద నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిన ఫౌండర్ దేవానందనాయుడు కి అలాగే బోర్డ్ ఆఫ్ మెంబర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్త నిబంధనలు పాటిస్తూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడంలో నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం ఇవ్వాలి — రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీPDSU
V POWER NEWS: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకులకు 12 నెలల వేతనం చెల్లించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ తెలిపారు.ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులతో వెట్టిచాకిరి చేస్తించుకుంటున్నారని అన్నారు.శ్రమకు తగ్గ వేతనం లేక ప్రైవేటు ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారని అన్నారు.యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తూ ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలల వేతనం ఇచ్చి సరిపెడులుతున్నారని.పాఠశాలలు,కళాశాలల విద్యార్థులకు ర్యాంకులు రావాలన్న,స్కూల్స్,కాలేజీలలో అడ్మిషన్ లు పెరగాలన్న కీలక భూమిక అందులో పని చేస్తున్న సిబ్బందిదే అన్నారు.కనీస సౌకర్యాలకు నోచుకోని జీవితాలు ప్రైవేటు విద్యాసంస్థల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ది అన్నారు. కనీసం పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అంటివి ఏవి లేకుండా ఉద్యోగ భద్రత కూడా లేకుండా సంవత్సరాల తరబడి పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్న వాళ్లకు గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వాలు సైతం ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన వారిని ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైన ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల ఆలకించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
పేదలకు బాసటగా సిఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్న .. శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి
V POWER NEWS : శ్రీశైలం నియోజకవర్గంలోని వేల్పనూరు స్వగ్రామం నందు మంగళవారం నియోజకవర్గానికి చెందిన 58 మంది వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులు, అలాగే CM AJY పథకం క్రింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈసందర్భంగా చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.