కోర్టు విచారణలో ఉన్న భూములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలి..
రైతుల భూములు కాపాడాలి…జిల్లా కలెక్టర్ కు రైతులు వినతిపత్రం అందచేత…
V POWER NEWS : కర్నూలు జిల్లా,గోనెగండ్ల మండలం,గంజిహళ్లి గ్రామంలో కోర్టు విచారణలో ఉన్న భూ ములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు కురువ వెంకటేష్, బోయ ధనుంజయులు, గోవిందు, లాజర్, కాటన్న,అరవ రాజు, ఏ.రామాంజినేయులు ఏ. అంజనేయులు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం, ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం, గంజిహళ్ళి గ్రామంలో పరిధి లో 2008వ సంవత్సరంలో షేక్ అస్లాం బాషా అను వ్యక్తి ఫ్యాక్టరీ నిర్మిస్తామని,ఆ ఫ్యాక్టరీ లో ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగవకాశం కల్పిస్తామని, అంతవరకు భూమిలో రైతులు సాగుచేసుకునేలా హక్కులు ఉంటాయని మోస పూరిత మాటలు చెప్పి రైతుల భూముల నుండి సుమారు 200ఎకరాలు,ఎకరా రూ.13వేలకు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన చెందారు. అంతేకాకుండా 2011వ సంవ త్సరంలో షేక్ అస్లాం బాషా, మాచాని రమేష్ కు ఎకరా రూ. 1.25లక్షలకు విక్రయించి నట్లు తెలిసిందన్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు సంయుక్తంగా పత్తికొండ జూని యర్ సివిల్ జడ్జి కోర్ట్ లో OS/46/2021 ప్రకారంగా పిటిషన్ వేయడం జరిగింది. కాని కోర్టులో విచారణ కొనసాగుతున్న కూడా మాచాని రమేష్ భూములను అక్రమంగా విక్రయించేందుకు కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు విచారణలో ఉన్న భూములను విక్రయిస్తే రైతుల కుటుంబ సభ్యులు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,కోర్ట్ తీర్పు వచ్చేవరకు మా చాని రమేష్ పై రిజిస్ట్రేషన్, ఆన్లైన్, అడంగళ్ ను పెండింగ్ లో పెట్టాలన్నారు. ఈ ప్రకారం గా రైతుల భూములను కాపాడి,న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు.