…
V POWER NEWS : కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన పి.కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఆయన తన కార్యాలయంలో అందజేశారు… కేశవరెడ్డి ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ఎంపీ నాగరాజును సంప్రదించి సీఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.3,09,470 మంజూరు అయ్యాయి.. కాగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు…ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు…