వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామి చేసుకోవాలని సూచించిన .. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు


కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో గలకర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో నిర్వహించిన ప్రపంచం హృద్రోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ వెంకటేష్, హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీ.సీ డాక్టర్.చంద్రశేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడ, దురాలవాట్ల కారణంగా రోజు రోజుకూ గుండె జబ్బులు పెరిగిపోతున్నాయన్నారు.50శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి రోజూ 40 నిముషాల పాటు నడవడం, యోగా చేయడం తో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తవని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్. ప్రతాప్ శరత్,హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కల్కూర చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు డాక్టర్.భవాని ప్రసాద్ మరియు వైద్యులు పాల్గొన్నారు..