V power news : కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు మండలం అనుగొండ, ముడుమాలకుర్తి ,వెంకటగిరి కొత్తూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో సంధ్య విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన కండువా వేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మనమంతా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను చింత సురేష్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేరుద్దామని ఆయన చేస్తున్న మంచిని వివరిద్దామని కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సైనికుల్లా కదులుదామని ఆయన పిలుపునిచ్చారు.
