V POWER NEWS KURNOOL, క్రైమ్ : కర్నూలు రెండవ పట్టణ పోలీసులు 16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజారావు, ఎస్సైలు సతీష్, మల్లికార్జున తో కలిసి కర్నూలు రెండవ పట్టణ పోలీసుస్టేషన్ లో నిందితుని వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టామని, మాకు రాబడిన సమాచారం మేరకు కర్నూలు- సుంకేశుల రోడ్డు లో ఉన్న రెండు వాగుల వద్ద శుక్రవారం నాడు , తెలంగాణ రాష్ట్రం, గద్వాల పట్టణం, దౌడురాళ్ళ కాలనీకి చెందిన తెలుగు జయంత్ @జస్వంత్ ను అరెస్టు చేసి, అతని నుండి 32 బైక్ (హోండాషైన్ , హిరో హోండా, యూనికార్న్ ) లను రికవరీ చేయడం జరిగిందని వీటి విలువ రూ. 16 లక్షల వరకు ఉంటుందన్నారు.
