V POWER NEWS

మయూర వాహనంపై మల్లన్న వైభవం …. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పరవశించిన భక్తులు

నేడు రావణవాహన సేవలో దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు …  శ్రీశైలం  మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు శనివారం రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. ఆనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూర వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజారికాలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్షేత్రపుర వీదుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి. డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మాధవరం చెక్ పోస్ట్ వద్ద .. భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత

మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద శనివారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా కొందరు టాటా సుమోలో అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రమేష్ రెడ్డి తెలిపారు..వాహనంలో 30 బాక్సుల మద్యం 2080 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులు వెంకటేష్, తిమ్మయ్య, నాగయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన… కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

సిబ్బంది సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని భరోసా .. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  జిల్లా పోలీస్ కార్యాలయంలో “పోలీస్ వెల్ఫేర్ డే” (గ్రీవియన్స్ డే) ను నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారి యొక్క సమస్యల గురించి ( ట్రాన్స్ఫర్స్, రిక్వెస్ట్లు, మెడికల్ సమస్యలు) జిల్లా ఎస్పీ కి విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ  వారి సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.సిబ్బంది వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రీవియన్స్ డే ను ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ  తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు లబ్ధి – ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి.

సయ్యద్ ఖాన్ సర్జరీ కి 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందచేసినా ఎమ్మెల్యే  ఆదోని  ఎమ్మెల్యే  పార్థసారథి  మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు బాగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అనంతరం గురువారం ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే డా.పీవీ పార్థసారథి దరఖాస్తుదారులకు అందజేశారు.కూటమి ప్రభుత్వము అనారోగ్య తో బాధపడి, హాస్పటల్ లో ఎక్కువ ఖర్చు పెట్టిన వారికి సీఎంరిలీఫ్ ఫండ్ ఉపయోగపడు తుందనీ తెలిపారు. పింజరి కాలనీకి సంబంధించి సయ్యద్ ఖాన్ కి సర్జరీ నిమిత్తం ముందుగా 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందజేసమాని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వము ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీశైలo మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, శ్రీకాళహస్తి దేవస్థానంఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి అర్చకులు,అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు దంపతులకు శ్రీకాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శేష వస్త్రాలతో సత్కరించారు.

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినా ఈవో శ్రీనివాసరావు దంపతులు  శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మార్చి 1 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ప్రారంభించారు అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీస్వామి అమ్మ వారి దర్శిస్తారని అంచనా వేశామన్నారు అలానే భక్తులకు 30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మ వాళ్ళని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేటి నుండి 23వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5 : 30 గంటలకు అంకురార్పణ,అగ్నిప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ చేస్తారు రేపటి నుండి ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైలం క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో అవినీతి వృక్షం వీఆర్వో జయరాం రెడ్డి .. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ  477 సర్వేనెంబర్ నందు 2 ఎకరాల 77 సెంట్లు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధ కుటుంబం ఆశ్రయించినారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో ఇటువంటి దుర్మార్గుల గ్రూప్ అండదండలతో వీఆర్వో జయరాంరెడ్డి అవినీతిపరుడుగా అంచలంచలుగా ఎదిగినారని, అతని మీద విచారణ జరుపుతున్నారని తెలిసిందే అన్నారు. నేను సబ్ కలెక్టర్ కు మరియు  సబ్ రిజిస్టర్ కు ఒక లేఖ రాస్తున్నామన్నారు.   కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగేవరకు  ఆ స్థలం పై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తరం రాస్తున్నామన్నారు. ఆదోని చుట్టుపక్క ప్రాంతాల్లో ఇట్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్ కు ఒక లెటర్ రాసి వారికి అందించగలరని మీ వివరాలు రహస్యంగా ఉంచుతూ కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

పోలీసు లపై తిరగబడిన ముద్దాయులు అరెస్టు .. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ 

ముద్దాయిలను రిమాండ్ కు  తరలించినా  పోలీసులు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు  విక్రాంత్ పాటిల్  ఆదేశాల మేరకు, ఆదోని  డి.ఎస్.పి యం. హేమలత  వారి సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  కే. శ్రీరామ్.   11.02.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని మధు ఆసుపత్రి యజమాని అయిన  గుర్రెడ్డి  ఫిర్యాదు మేరకు, ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్  18/2025 u/s 308(2), 351 (2) r/w 3 (5)  BNS మేరకు రఘునాద్ మరియు అడివేష్ అను ముద్దాయులపై కేసు నమోదు చేయడమైనది.  సదరు కేసులో ముద్దాయులు మధు ఆసుపత్రి లో  ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరున చాలా అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు.  సదరు పిర్యాదులను వెనుకకి తీసుకోవడానికి ఫిర్యాదు దారుడు అయిన గుర్రెడ్డి ని ముద్దాయులు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారని ఫిర్యాదు దారుడి అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకుని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విదంగా ఒప్పందం  కుదుర్చుకోవడం జరిగింది.  అంతేకాకుండా బలవంతంగా 10 వేల రూపాయలను ఫోన్ పే కూడా చేయించుకున్నారు.  సదరు కేసులో ముద్దాయులకు నోటీసులు ఇవ్వడానికి 12.02.2025 వ తేదీన సాయంత్రము 17.15 గంటలకు బాల భాస్కర్ మరియు ముని చంద్ర కానిస్టేబుళ్లు వెళ్ళగా వారిపై తిరగబడి దాడికి పాల్పడి గాయపరచి పారిపోవడము  జరిగినది.  సదరు సంఘటనపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు Cr No.19/2025 u/s 121(1) r/w 3(5) BNS,ఆదోని  వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ రామ్ కేసు నమోదు చేయడo జరిగిందని, శనివారం నాడు  ఆదోని ఎస్డిపిఓ అయిన  ఎo. హేమలత వారి పర్యవేక్షణలో , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన. శ్రీరామ్ , ఎస్ ఐ.రామస్వామి  మరియు సిబ్బంది ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జి వద్ద సదరు ముద్దాయులను అరెస్టు చేసి రిమాండుకు పంపడము జరిగిందని అలాగే  ప్రస్తుత పంచాయతీ రాజ్ డెపార్టుమెంట్ కు చెందిన డిప్యూటీ ఇంజనీర్  (DE) ని కూడా డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారమ ఉందని  కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి అడివేష్ @ ఏనుగుల అడివేష్, అను వీరిపై  గతంలో వీరిపై ఇస్వి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాబడినది అని  వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్  మీడియా సమావేశంలో తెలిపారు. 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోండి – ఎమ్మెల్యే గిత్త జయసూర్య.

గ్రామాల్లో అభివృద్ధి పనులపై నివేదికలు తయారు చేయండి. – సీసీ రహదారులు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. …గ్రామంలో తాగునీటి సమస్య రానివ్వొద్దు. – అవసరమైతే బోర్లు, పైపులు ఎంత అవసరమో ముందే చెప్పండి. – నియోజకవర్గ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే జయసూర్య.

విద్య మించిన వెలుతురు కిరణం మరొటిలేదు ..

.. సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐ.జి ఇక్బాల్  కర్నూలు జిల్లా/ కోసిగి మండలం… విద్యను మించిన వెలుతురు కిరణం మరోటి లేదని,విద్య అనేది సమాజం యొక్క ఆత్మ అని,విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఒకరిని ఆలోచింపజేయటమనీ,ఎంత ఎక్కువ చదివితే ఎక్కువ విషయాలను తెలుసుకోవచ్చని రిటైర్డ్ ఐజి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్,బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ విక్రాంత్ బాటిల్ తో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులను గురువులను గౌరవించి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచాలన్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి ఎదగాలన్నారు. మారుమూల పల్లెల్లో చదివిన వారు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నారని ఇందుకు ఉదాహరణ ఇక్బాల్ గారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని జిల్లా అధికారులతో పరిష్కారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఈరన్న, ఉస్మాన్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!