.. సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐ.జి ఇక్బాల్

కర్నూలు జిల్లా/ కోసిగి మండలం… విద్యను మించిన వెలుతురు కిరణం మరోటి లేదని,విద్య అనేది సమాజం యొక్క ఆత్మ అని,విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఒకరిని ఆలోచింపజేయటమనీ,ఎంత ఎక్కువ చదివితే ఎక్కువ విషయాలను తెలుసుకోవచ్చని రిటైర్డ్ ఐజి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్,బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ విక్రాంత్ బాటిల్ తో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులను గురువులను గౌరవించి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచాలన్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి ఎదగాలన్నారు. మారుమూల పల్లెల్లో చదివిన వారు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నారని ఇందుకు ఉదాహరణ ఇక్బాల్ గారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని జిల్లా అధికారులతో పరిష్కారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఈరన్న, ఉస్మాన్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.