V POWER NEWS

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్

అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినా .. జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ V POWER  NEWS :   కర్నూలు జిల్లా  సీ. బెలగల్ మండల పరిధిలోని పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక శ్రీలేఖ మృతి చెందింది. ఫిబ్రవరి 28వ తేదీన పోలకల్ పాఠశాల మైదానంలో వున్న చెట్టు ఈదురు గాలులకు మీద పడటం తో తీవ్రగాయాల పాలయ్యింది. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. ప్రమాదం జరిగిన రోజు నుండి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా డిఇఓ తో పాటు మండల విద్య శాఖ అధికారి ఆదమ్ బాషా గారు , హెడ్మాస్టర్ అసోసియేషన్ , ఆ పోలకల్ హెడ్మాస్టర్ మరియు టీచర్స్ ఆవిరామంగా కృషి చేశారు. డీఈఓ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే కాకుండా మండల విద్యాధికారులు అక్కడే వుంచి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం శ్రీలేఖ తుదిశ్వాస వదలడంతో జిల్లా విద్యాధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధను దిగమింగి పోస్టుమార్టం వద్ద తనే దగ్గర వుండి బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ భరోసాను కుటుంబ సభ్యులకు అందించారు. స్వగ్రామం గోనెగండ్ల మండలపరిధిలోని పెద్దనెలటూరుకు వెళ్లిన జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసి నివాళులు అర్పించారు. వెంటనే అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” వారోత్సవాలు …

V POWER NEWS :   కర్నూల్ పట్టణంలో, స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సాధికారత ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాల సందర్బంగా, మార్చ్ 1 నుండి 8 వరకు మహిళా హక్కులు ,మానవ హక్కులు, సమాన వేతనం, పనిలో గౌరవం, మహిళకు, బాలికలకు ,రక్షణలో భాగంగా, ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.  అందులో భాగంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్కూలు విద్యార్థులు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు మరియు కలెక్టర్ కార్యాలయం నుండి మెడికల్ కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు మరియు బాలికలందరికి హక్కులు, సమానత్వం, సాధికారత ఉండాలని సమాజానికి ప్లే కార్డు ద్వారా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగి ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని పి. నిర్మల, ACDPO రేవతి జోష్ట్న, మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాస్ ఆచారి, DCPO శారదా, ఇండ్ల విజయలక్ష్మి ,వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ, స్వర్ణలత, మరియు ఫేవోర్డ్ నెట్వర్క్ ఏవి రమణయ్య ,కొమ్ము పాలెం శ్రీనివాస్ , మధు, శకుంతల, ఎలీషాబాబు పాల్గొన్నారు.

పంచలింగాల గ్రామంలో … ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసినా …కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

… బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితం… గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు   V POWER NEWS  :     రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితమని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు.. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించారన్నారు.. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న ఎం.పి..రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, రఫిక్, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు..

పోలీస్ స్టేషన్ ఆశ్రయించే .. బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

నేరా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. … రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలి – కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ V POWER NEWS .. : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామ న్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు, శిక్షణ డీఎస్పీ ఉష శ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

ఐస్ ముద్దుపై శివలింగం – చిన్నారి అద్భుతం

కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన కిడ్నీస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఉజ్వల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐస్ ముద్దపై శివలింగాన్ని తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి శిక్షణ లేకుండా, స్వయంగా తన సృజనాత్మకతతో శివలింగాన్ని తీర్చిదిద్దడం విశేషం. ఈ సూక్ష్మ శిల్పకళను తయారు చేయడానికి ఉజ్వలకు ఒక గంట సమయం పట్టింది. ఐస్ ముద్దను తన చేతుల్లో పట్టుకొని సుతిమెత్తగా శిల్పాన్ని రూపొందించిన విధానం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఐస్ గడ్డతో శివలింగాన్ని సునాయాసంగా తయారు చేయగలగడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. ఉజ్వల యొక్క సృజనాత్మకతను పాఠశాల టీచర్లు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందిస్తూ, ఆమెకు ప్రశంసలు కురిపించారు. పసివాడైనప్పటికీ, పునీతమైన శివలింగాన్ని రూపొందించిన ఉజ్వల, భవిష్యత్తులో గొప్ప శిల్పి అవుతుందని ఆశాభావం వ్యక్తమైంది. ఆమెకు మహాశివరాత్రి పట్ల ఉన్న భక్తి, కళాప్రతిభ ఈ చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంది.

మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు …. అన్నపూర్ణ దేవి గృహస్థాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు … అంతిరెడ్డి అరవింద రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల) శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బుధవారం నాడు శ్రీశ్రీశ్రీ తిరుపతి నాయన ఆరాధన కార్యక్రమం శుభ సందర్భంగా, శివోహం టెంపుల్ ట్రస్ట్ ఈ మహత్తర కార్యక్రమానికి అదేవిధంగా స్వామి అమ్మవార్ల భక్తులకు మరియు శివ స్వాములకు సేద తీర్చుకొనుటకు వసతులు, నీటి వసతులు, అన్న ప్రసాద వితరణ పూర్తిగా ఉచితంగా సంపూర్ణంగా జరిగినది. ఈ మహత్తర కార్యక్రమం వేల మంది శివ దీక్ష స్వాములు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి …

డిమాండ్ చేసినా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్   నంద్యాల జిల్లా “Vపవర్  న్యూస్ :  రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్.యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం నాడు మంగళగిరి లోని విద్యా భవన్ నందు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ భాష్యం శ్రీ చైతన్య ఆక్స్ఫర్డ్ రవీంద్ర కేకేఆర్ వంటి మరియు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 2025 -26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు. కార్పొరేట్ సంస్థల వారు బహిరంగంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు వేసి అడ్మిషన్ల కొరకు ఎలక్షన్ ప్రచారం రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దిక్రీడో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ స్కూల్, అని ప్రచారం నిర్వహిస్తూ ఐఐటి త్రిబుల్ ఐటీ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఎల్కేజీ నుండే ప్రారంభిస్తున్నామని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆర్థికమే ధ్యేయంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి, చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల పేర్లతో పిఆర్ఓ లను ,ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్ ఫీజులతో పాటు,స్పెషల్ ఫీజు,పుస్తకాల ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాలలో ఉదృతమైన ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులుబి.సిద్ధు, కె.నాగరాజు,రూపాశంకర్, శ్రీను,మణి, భానుప్రసాద్ పాల్గొన్నారు.

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి

శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పవిత్ర సందర్భంలో మంత్రి , ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల మంగళకాంక్షల మధ్య స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. భక్తుల భద్రత,సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అని తెలిపారు.రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నాము. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేదుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గానియ దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్ ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ,ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు …… తండోపతండాలుగా శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో పాదయాత్ర ద్వారా శివ భక్తులు

భక్తుల అడుగులన్ని శ్రీశైలం వైపే .. నల్లమల అడవుల్లో మారుమ్రోగుతున్నా శివనామ స్మరణం. .. పాదయాత్రతో వచ్చే భక్తులకు … దేవస్థానం మరియు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు. .. నంద్యాల జిల్లా శ్రీశైలం అడవులు శివనామ స్మరణతో మారు మ్రోగుతున్నాయి శివస్వాములు సాధారణ భక్తుల అడుగులన్ని శ్రీశైలం కొండలవైపు పరుగెడుతున్నాయి. తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినానికి తరలి వెళ్లాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎండను సైతం లెక్క చేయకుండా వృద్దులు చిన్నపిల్లల సైతం పాదయాత్రతొ శివయ్య సన్నిధికి చేరుకుంటున్నారు అడుగులన్ని శ్రీశైలం వైపే నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి ఎండను సైతం లెక్కచేయకుండా కొండలు కోనాలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు వెంకటాపురం నుంచి నల్లమల అడవులలొ పాదయాత్రతొ ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద చేదతీరుతూ మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్దకు చేరుకుని శివలింగానికి తల తాకించి కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కలు తీర్చుకుంటున్నారు. శ్రీశైం మల్లన్న భక్తులు కిలోమీటర్ల మేర కొండా కోనలు దాటుకుంటూ శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్ద సేదతీరుతూ పాదయాత్ర కష్టాలన్ని శ్రీశైల మల్లన్నపై ఉంచి చేదతీరుతున్నారు పాదయాత్రతో వచ్చే భక్తులకు దేవస్థానంతోపాటు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు చేశారు.  దట్టమైన అటవీప్రాంతంలో నడక సాగించి బారీ సెడ్లలో కొంతసేపు భక్తులు సేదతీరుతూ శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు పాదయాత్ర చేసి అలసట చెందిన భక్తులకు దేవస్థానం వైద్యం కోసం అటవీప్రాంతంలో సుమారు 10 చోట్ల వైద్యశిబిరాలు అలానే స్వచ్చంద సేవకులు కాళ్ల నొప్పులకు ఒల్లు నొప్పులకు కాళ్లు బొబ్బలకు మెడిసిన్ టాబ్లెట్లు ఆయిట్ మెంట్లు ఇచ్చి భక్తుల సేవలొ తరిస్తున్నారు పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవా కర్తలు భక్తుల కోసం ఉచ్చిత బోజనాలు ఏర్పాటు చేశారు ఆకలితో వచ్చిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలి బాటలో వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్దానం అధికారులు మార్గమధ్యంలో మంచినీటి ట్యాంక్ లు కైలాసద్వారం వద్ద ఏర్పాటు చేశారు భక్తుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లు నిరంతరం 10 ట్యాంకర్స్ తో నిటి సరఫర చేస్తున్నారు. శ్రీశైల మల్లన్న భక్తుల పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురానికి చేరుకొని అక్కడినుండి అటవీ మార్గం ద్వారా కోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి నాగులుటి వీరభద్ర స్వామి ఆలయం దామర్లకుంట పెద్ద చెరువు మఠం బావి ధూమును కొలను కైలాస ద్వారం మీదుగా సుమారు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవులను దాటుకుంటూ శ్రీశైలాన్ని పాదయాత్ర భక్తులు చేరుకుంటారు అయితే పాదయాత్ర భక్తులకు నాగులుటి వద్ద ఆహారము దామర్లకుంట,పెద్ద చెరువు వద్ద నీటి వసతి,ఆహార వసతి తిరిగి మఠంభావిది,భీమునికొలను,కైలాసద్వారం వద్ద నీటి వసతి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మల్లయ్య శంభో శంకర అంటూ శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో శివ భక్తులు సాధారణ భక్తులు తండోపతండాలుగా రోడ్లపై పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడడంతో లక్షలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలర్పిస్తున్నారు.

ఊట కాల్వ సమస్య పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి రైతుల వినతి

నంద్యాల జిల్లాలో… రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేదిలేదు …  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం. ఆళ్లగడ్డ మండలం బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల్లోని ఊట కాల్వ శిదిలావస్థకు చేరుకోవడంతో మా గ్రామాలకు కేసి కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు, తాగు నీరు అందడం లేదని, ఊట కాల్వ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయా గ్రామాల రైతులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రం ద్వారా శనివారం నంద్యాల ఎంపీ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. రైతుల సమస్యలు విన్న వెంటనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించి కే సి కెనాల్ ఈ ఈ ప్రతాప్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల ప్రజలను ఇబ్బందిపెట్టే, నష్టం కలిగించే ఊట కాల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకుంటే తాను ఊట కాల్వ వద్దకు వెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేసి కెనాల్ ఈ ఈ కి స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎంపీ ఆదేశించారు. ఎంపీ శబరికి వినతి పత్రం అందించిన బత్తులూరు గ్రామ పెద్దలు కె.చిన్న వెంకటసుబ్బారెడ్డి, పార్థసారథిరెడ్డి,ఇరిగెల మహేశ్వరరెడ్డి,  తదితరులు ఉన్నారు.

error: Content is protected !!