మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినా ఈవో శ్రీనివాసరావు దంపతులు
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మార్చి 1 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ప్రారంభించారు అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీస్వామి అమ్మ వారి దర్శిస్తారని అంచనా వేశామన్నారు అలానే భక్తులకు 30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మ వాళ్ళని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేటి నుండి 23వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5 : 30 గంటలకు అంకురార్పణ,అగ్నిప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ చేస్తారు రేపటి నుండి ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైలం క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.