శ్రీశైలo మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, శ్రీకాళహస్తి దేవస్థానంఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి అర్చకులు,అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు దంపతులకు శ్రీకాళహస్తి ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణారెడ్డి శేష వస్త్రాలతో సత్కరించారు.

