కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.
V POWER NEWS : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా,డ్రంకెన్ డ్రైవ్ వంటి తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.(మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు)గత వారంలో కర్నూలు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు 12 నమోదు కాగా,5 మంది మృతి చెందారని,12 మంది గాయపడినట్లు తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 136 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి,కోర్టుకి హజరు పరిచామన్నారు.
