V POWER NEWS : శ్రీశైలం నియోజకవర్గంలోని వేల్పనూరు స్వగ్రామం నందు మంగళవారం నియోజకవర్గానికి చెందిన 58 మంది వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులు, అలాగే CM AJY పథకం క్రింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈసందర్భంగా చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
