శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజీత్ బాషకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యా సాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.


శ్యామ్ విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ వెంచర్లో ఓకిరాణం షాపు విషయంలో గోడవ చోటుచేసుకుందని ఈఘటనపై నాగులాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మందలించారని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో అందరూ మంచి గా ఉండాలని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై అసభ్యంగా మాట్లాడి దాడి చేశారన్నారు. ఈఘటన పై నాగులాపురం స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. విద్యా సాగర్ ను సస్పెండ్ చేసి ఈకేసులో వారిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు 15మంది పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు