ఆంధ్ర ప్రదేశ్

ఆదోని పట్టణంలో .. యోగాంధ్ర 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ర్యాలీ

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపాలిటీ అధికారులు.. V POWER NEWS   : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరaకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ, ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామ్మూర్తి, డిఈ గోపీనాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్ధన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 పై ప్రజల భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హమ్యూనిటీ సచివాలయం సెక్రెటరీ పావని, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మునిసిపల్ రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ మండలం లో.. వంక వాగులలో అక్రమ ఇసుక రవాణా

కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్న అధికారులు…….! • దేవనకొండ మండలం వేలంకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో వంక వాగుల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులు … • చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు … • ఒకే వ్యవహారంపై వివరణ  విషయంలో.. ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం..? • దేవనకొండ ఎమ్మార్వో … ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా……? అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదం. • వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ ..  అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న మాట  వాస్తవం,  రాత్రిపూట మాత్రమే జరుగుతుందన్న  VRO.   • ప్రజల  కష్టాలపై  …    అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో .. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…?    ద్వని కాలుష్యం  ..  రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందన్న  గ్రామ ప్రజలు  కర్నూలు  జిల్లా, దేవనకొండ మండలం లో …   రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ప్రతిరోజు 50 ట్రాక్టర్ల నుండి 100 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు అమ్ముతున్న దళారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని దేవనకొండ గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు వాపోతున్నారు. దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వంకలో ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది ఈ ఇసుక రవాణా గ్రామ స్థాయి నాయకుల అండదండలతో నడుస్తుందని ప్రజలు అంటున్నారు వెలంకూరు గ్రామ సర్పంచ్ కనుసనల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో భారీ ఇసుక రవాణా జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడడం లేదన్నారు.  ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం పై అధికారులకు చెప్పుదామని ఎవరైనా వెళ్లిన అటువైపు చూసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవసరమైతే వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడడం లేదని ప్రజలు అంటున్నారు.. ఈ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు జరుగుతుండడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఈ అక్రమ ఇసుక రవాణా రాత్రి 12 గంటల తర్వాత కూడా జరుగుతుందని ఈ ట్రాక్టర్ల ధ్వని కాలుష్యం వలన రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు.  ఈ ట్రాక్టర్ల రాకపోకల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అన్న సమాచారం మేరకు వివరణ ఇవ్వవలసిందిగా దేవనకొండ  మండల  రెవెన్యూ అధికారులను  అడుగగా విస్తుపోయే విధంగా సమాధానం ఇచ్చారు.  నేను ఇక్కడికి ఎమ్మార్వో గా బదిలీ అయి వచ్చి మూడు నెలలు మాత్రమే అయిందని ఇక్కడ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలు జరుగుతున్నాయో తనకు తెలియదని తన దృష్టికి ఇంతవరకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం కూడా రాలేదని అసలు ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా……?అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది, దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి మూడు నెలలు అవుతున్న అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్న ఎమ్మార్వో ఇది ఎంతవరకు నిజం ..?   • చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు … ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం విఆర్ఓ ను అడిగి తెలుసుకుంటానని విఆర్ఓ ను పిలిపించి వివరణ అడగగా  వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తెలుసని కానీ అది రాత్రిపూట మాత్రమే జరుగుతుందని ఆ రాత్రిపూట తలారులను పంపించి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని కానీ ఉదయం పూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని వీఆర్వో అన్నారు సదరు విఆర్ఓ కు తెలిసిన సమాచారం ఎమ్మార్వో కు తెలియక పోవడం గమనార్హం ….? మరి ఆ విఆర్ఓ ఎందుకు అక్రమ ఇసుక రవాణా గురించిన సమాచారము ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లలేదు అన్న విషయము ప్రశ్నార్ధకంగా మారింది.    వీఆర్వో ను మరి ఎమ్మార్వో కు మీరు ఈ విషయము తెలియపరిచారా లేదా అని అడగగా వెంటనే ఎమ్మార్వో కల్పించుకొని గతంలో ఒకసారి ఆర్ ఐ తలారులు ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడులు చేశారని చెప్పడం విచిత్రంగా ఉంది తనకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అన్న విషయము తెలియదని చెప్పిన ఎమ్మార్వో తిరిగి ఆర్ఐ తలారులపై దాడికి ప్రయత్నించారు అని చెప్పడం గమనార్హం… !  ఒకే వ్యవహారంపై ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం.  ఇకపై ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తన పరిధిలోకి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పిన మాట దాటవేసిన ఎమ్మార్వో.. ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారము అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…………కష్టానికి 

ఆగ్రలో నిర్వహించిన రాణి అహల్యా బాయి 300వ .. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

 V POWER NEWS :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్ర లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి అహల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకల్లో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి జగదీష్ దంకర్ , యూ.పి సీ.ఎం యోగి ఆదిత్య నాథ్ , హరియాణ గవర్నర్ బండారు దత్తత్రేయ ల తో కలిసి రాణి అహల్యా బాయి చిత్ర పట్టానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు…అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాణి అహల్య బాయి మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు..సామాజిక సంక్షేమం, మరియు మానవతా పనులతోపాటు మత పరమైన , విద్య మరియు సాంస్కృతిక పురోగతికి కృషి చేసారన్నారు…ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారన్నారు..రాణి అహల్యా బాయి జీవితం అందరికి స్ఫూర్తిదయాకమన్నారు…ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకి చెందిన ఎంపీ లు , నాయకులు పాల్గొన్నారు…

చాగలమర్రి వాసులకు … ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రుద్రవరంలో అరుదైన గౌరవం

• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం. V POWER NEWS :   చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.

చౌక దుకాణాల్లోని రేషన్ సరుకులు పంపిణీ ..

ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు… హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో “హనుమాన్ జయంతి” వేడుకలకు గట్టి పోలీసు బందోబస్తు

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టినా పోలీసులు గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

నేర ప్రవృత్తికి స్వస్తి పలకి .. సత్ప్రవర్తనతో ఉండాలి

• శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుంది కఠిన చర్యలు తీసుకుంటాం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ V POWER  NEWS  : నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కృషి చేస్తాం ..

• గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తిచేస్తాం.. కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్  సింగ్ రాణా,  గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనచే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అహోబిల శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్ లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగు తోందని కేంద్రమంత్రి ప్రహ్లాదు జోషి తెలిపారు. ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సోలార్ ప్లాంట్ లో 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు ముమ్మారంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ పైల వాసుదేవరావుకు  విప్లవ జోహార్లు ..

  V POWER NEWS,  నందికొట్కూరు :  శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాటయోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ  పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి 15వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ  కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ గిరిజన సాయిధ రైతాంగ పోరాటంలో పనిచేసి భూమికోసం. భుక్తి కోసం .ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి తన తుది  శ్వాస విడిచే వరకు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పనిచేశారన్నారు .బడా బూర్జువ  బడా భూస్వామ్య నిరంకుశ పాలక వర్గాలను మెడలు వంచి  ఈ దేశంలో ఎర్రజెండాను ఎగరవేయాలని పట్టుదలతో ప్రతిఘటన పోరాటాలను నిర్మించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు .శ్రీకాకుళ పోరాట వారసత్వంతో దోపిడీ  పీడనలు లేని సమ సమాజ స్థాపన కై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. నేడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న భూస్వామ్య బడా కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి ఈ పోరాటాలను ఒక ప్రక్క నెత్తురు  టేర్ల లో ముంచుతూ మరోపక్క ప్రజలను మతం .కులం  తెగలు పేరుతో విభజించి తమ కార్పొరేట్ కాషాయఎజెండాను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలపై ప్రయోగిస్తున్నది .కుహనా దేశభక్తి జాతీయ తల పేరు చెప్పి లౌకికవాదంపై దాడి చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి సూపర్ సిక్స్  పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి నాలిక మడత పె బెడుతున్నది .మోడీ అమిత్ షా కూటమిలో భాగంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడానికి పూనుకుంటుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా భూస్వాములకు ఆదాని .అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు సామ్రాజవాదుల యొక్క బహుళ జాతి సంస్థలకు సేవ చేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అందువలన అన్ని వర్గాల ప్రజలని సమరశీల పోరాటాలకు సమహిత్యం చేసినప్పుడే పైల గారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారతా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ . ఐ ఎఫ్ టి యు  డివిజన్ అధ్యక్షులు పి తిక్కయ్య .మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు .తిమ్మన్న .ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దేవన్న. భాస్కర్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్ లో… ఘనంగా ” శ్రీ సేవాలాల్ మహారాజ్ ” జయంతిని  అధికారికంగా  జరిపించాలి …

LHPS రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్    V POWER NEWS  :  లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం విలేకరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్  మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా కలిగిన లంబాడి బంజారా తెగలకు సంబంధించిన వారు దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఒకె సాంప్రదాయాలు పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకే భాషని మాట్లాడుతూ జీవిస్తున్న బంజారా జాతి కులదైవం ఆరాధ్యుడు జాతి ప్రజలు అందరూ మంచి మార్గంలో నడవాలని భారతదేశమంతా కూడా నడిచి తన సందేశాన్ని బంజారా జాతి తో పాటు ఇతర జాతుల వారిని కూడా చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడు శాంతి స్వరూపుడు అహింస వాది నేటికీ ప్రతి రాష్ట్రంలో ఫిబ్రవరి 14,15 తేదీలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అధికారికంగా జరుపుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల పైబడి జనాభా గలిగిన లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు ఈ సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న, త్రిపురనేని రామస్వామి చౌదరి,  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , పుట్టపర్తి నారాయణచార్యుల,  బాబు జగజీవన్ రామ్,  మహాత్మ జ్యోతిరావు పూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,  అల్లూరి సీతారామరాజు,  మహర్షి వాల్మీకి జయంతి ఇలా ప్రముఖుల జయంతుల్ని వర్ధంతులను ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ యువజన సర్వీసులు దేవాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల పైబడిన జనాభా కలిగి 40 నియోజకవర్గాలలో ఓటు శాతం ఉన్న గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ  కార్య్రమంలో  ఎస్ నాగరాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు తదితరులు ఉన్నారు.

error: Content is protected !!