ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపాలిటీ అధికారులు..
V POWER NEWS : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరaకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ, ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామ్మూర్తి, డిఈ గోపీనాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్ధన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 పై ప్రజల భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హమ్యూనిటీ సచివాలయం సెక్రెటరీ పావని, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మునిసిపల్ రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

