V POWER NEWS : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్ర లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి అహల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకల్లో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి జగదీష్ దంకర్ , యూ.పి సీ.ఎం యోగి ఆదిత్య నాథ్ , హరియాణ గవర్నర్ బండారు దత్తత్రేయ ల తో కలిసి రాణి అహల్యా బాయి చిత్ర పట్టానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు…అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాణి అహల్య బాయి మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు..సామాజిక సంక్షేమం, మరియు మానవతా పనులతోపాటు మత పరమైన , విద్య మరియు సాంస్కృతిక పురోగతికి కృషి చేసారన్నారు…ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారన్నారు..రాణి అహల్యా బాయి జీవితం అందరికి స్ఫూర్తిదయాకమన్నారు…ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకి చెందిన ఎంపీ లు , నాయకులు పాల్గొన్నారు…
