కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్న అధికారులు…….!
• దేవనకొండ మండలం వేలంకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో వంక వాగుల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులు …
• చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు …
• ఒకే వ్యవహారంపై వివరణ విషయంలో.. ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం..?
• దేవనకొండ ఎమ్మార్వో … ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా……? అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదం.
• వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ .. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న మాట వాస్తవం, రాత్రిపూట మాత్రమే జరుగుతుందన్న VRO.
• ప్రజల కష్టాలపై … అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో .. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…?
ద్వని కాలుష్యం .. రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందన్న గ్రామ ప్రజలు
• చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు …
ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం విఆర్ఓ ను అడిగి తెలుసుకుంటానని విఆర్ఓ ను పిలిపించి వివరణ అడగగా వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తెలుసని కానీ అది రాత్రిపూట మాత్రమే జరుగుతుందని ఆ రాత్రిపూట తలారులను పంపించి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని కానీ ఉదయం పూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని వీఆర్వో అన్నారు సదరు విఆర్ఓ కు తెలిసిన సమాచారం ఎమ్మార్వో కు తెలియక పోవడం గమనార్హం ….? మరి ఆ విఆర్ఓ ఎందుకు అక్రమ ఇసుక రవాణా గురించిన సమాచారము ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లలేదు అన్న విషయము ప్రశ్నార్ధకంగా మారింది. వీఆర్వో ను మరి ఎమ్మార్వో కు మీరు ఈ విషయము తెలియపరిచారా లేదా అని అడగగా వెంటనే ఎమ్మార్వో కల్పించుకొని గతంలో ఒకసారి ఆర్ ఐ తలారులు ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడులు చేశారని చెప్పడం విచిత్రంగా ఉంది తనకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అన్న విషయము తెలియదని చెప్పిన ఎమ్మార్వో తిరిగి ఆర్ఐ తలారులపై దాడికి ప్రయత్నించారు అని చెప్పడం గమనార్హం… ! ఒకే వ్యవహారంపై ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం. ఇకపై ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తన పరిధిలోకి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పిన మాట దాటవేసిన ఎమ్మార్వో.. ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారము అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…………కష్టానికి

