ఆంధ్ర ప్రదేశ్

జిల్లా ఎస్పీని ఆశ్రయించినా … నా సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు… బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన

సప్తపదుల సూత్రాలలో … భర్త బలవంతముగా దౌర్జన్యంగా తీసుకొనివెళ్లి సంసారం చేయించుకోవడం ఒక సూత్రం అన్న సీఐ చంద్రబాబునాయుడు. నాకూ జరిగినా అన్యాయం  ఇంకోవరికి జరుగకుండా  చూడాలని  జిల్లా sp  ని కోరినా బాధితురాలు  భర్త,కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి, న్యాయం చేయండి మహాప్రభో. .. బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన.  V POWER NEWS  : news ప్రేమించానన్నాడు.అంగీకరించకపోతే బాధితురాలి అక్కతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం అసలు సైకోరూపం బహిర్గతం అయింది. అతని బుద్ది దారి తప్పింది. మానసికంగా,శారీరకంగా హింసించడం, ప్రశ్నించిన వారిపై అక్రమసంబంధాల పేరుతో దుర్భషలాడడం ఇది తంతుగా తాళి కట్టిన భార్యను వేధింపులకు గురిచేయడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,నన్నూరు గ్రామానికి చెందిన మహిళా కె.యశోదకు జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కె.యశోద, కుటంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది. నందికొట్కూరుకు చెందిన ఆవుల సురేష్ అనే వ్యక్తికి ఇరువురు పెద్దల అంగీకారంతో 2019,మార్చి,13న వివాహం చేశారని అన్నారు.అయితే కొంతకాలం సజావుగా సాగిన కుటుంబం,గత ఆరు సంవత్సరాలుగా సురేష్ వేధింపులకు తాళలేక తల్లి వద్ద జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇది సాగించలేక తనను,తన కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా దాడులు చేయడం, గాయపరచడం జరుగుతుంది.  అంతేకాకుండా 2025, మార్చి,15వ తేదీన భర్త సురేష్,వారి కుటంబ సభ్యులు రెండు ఆటోలతో వచ్చి,బలవంతంగా తనను, కుమార్తెను తీసుకెళ్లి దాడి చేయడం జరిగిందని ఆవేదన చెందారు.  ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులు నందికొట్కూరు, ఓర్వకల్,కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరం అని కన్నీటిపర్యంతమైంది. చివరకు 112 కాల్ సెంటర్ కు ఫోన్ ద్వారా పిర్యాదుచేయడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ లు ఘటన స్థలానికి చేరుకొని, రక్షణ కల్పించి, నందికొట్కూరు అర్బన్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు. అనంతరం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు వారిని కలిసి నాపై నాకు ఇష్టం లేకున్నా నన్ను నా కూతుర్ని దౌర్జన్యంగా దాడి చేస్తూ బలవంతముగా తీసుకువెళ్లడం జరిగిందని తెలియపరచి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరగా ” సప్తపదుల సూత్రాలలో ” భర్త భార్యను బలవంతంగా తీసుకొని వెళ్లి కాపురం చేయించుకోవడం ఒక సూత్రం అని తెలయ చెప్పిన సీఐ చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం బలవంతముగా తీసుకువెళ్లిన కేసు నేను కట్టను అని ఇదే నా “లా” ఇదే నా “రూల్” అంటూ నాకు తెలియపరచి పంపివేయడం జరిగింది.  నీ ఇష్టం ఉంటే ఓర్వకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 498a కేసు కడతారు కట్టించుకో “లేదా” నీ ఇష్టం వచ్చిన వారికి తెలియపరుచుకో అని పంపించడం జరిగిందన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నాకు ఓర్వకల్లో గాని రూరల్ సిఐ సర్కిల్ ఆఫీసులో గాని న్యాయం జరగదని తెలుసుకొని జిల్లా ఎస్పీ దొరవారికి ఫిర్యాదు చేసు కొంటె ,మహిళ పీఎస్ వారికి సిఫార్సు చేసి న్యాయం చేయమని తెలపరిచారని, అయినా అక్కడ నాకు న్యాయం జరగకపోవడంతో మీడియా మిత్రుల ద్వారా నా ఆవేదన వ్యక్తపరచుకొని ఫై అధికారులకు తెలపరిచి నా భర్త సురేషు మరియు వారి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని రక్షణ కల్పించమని మీడియా ప్రతినిధుల ద్వారా పై అధికారులకు తెలపరుచుకుంటూన్నా అని ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భర్త సురేష్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి తనకు, తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, కనీసం తమకు రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందారు.

భూ సమస్యలను ….సామరస్యంగా పరిష్కరించుకోవాలి – పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్

V POWER NEWS : సామరస్యంగా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం హలహర్వి మండలం కామినహల్ గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో ఏమైనా కొలతలు తేడాలు, భూసమస్యలు ఉంటే నేరుగా అధికార సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కామినహల్ గ్రామానికి చెందిన రైతు మహిళ ఆర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ సర్వేనెంబర్ 277,278 నాలుగు ఎకరాల పొలంలో సాగులో ఉన్నాం ఆన్లైన్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నజ్మభాను, డిప్యూటీ తాహాశీల్దార్ జి.లక్ష్మి, ఆర్ ఐ మహేష్ గౌడ్, సర్వేర్ దేవేంద్ర స్వామి, వీరాంజనేయులు, జనార్ధన, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

చాగలమర్రి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక.

V POWER  NEWS  :  నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షలతో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయనకి యువజన సంఘం సభ్యులందరూ పూలదండ వేసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో చెప్పినట్టుగానే అయప్ప స్వామి దేవస్థాన ఆలయ ఆవరణంలో రేకుల షెడ్డుకు గాను విరాళము అందించిన తొమ్మండ్రు వినయ్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం , యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా 2025వ సంవత్సరంలో వాసవి యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులు : కామిషెట్టి మధుసూధన్ రావు , బచ్చు సుగుణాకర్ , కార్యదర్శి : బింగుమళ్ళ హరికృష్ణ , ఉప-కార్యదర్షులు : తలుపుల సునిల్ కుమార్ , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, వందవాసీ శివసుబ్బ చక్రధర్ , కోశాధికారి : లింగం రంగనాథ్ , ఉప-కోశాధికారి : కామిషెట్టి సుబ్రమణ్యం కార్యవర్గ సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , బింగుమళ్ళ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , కామిశెట్టి ప్రసాద్ , మేడ నరేంద్ర , అయినాల శ్రీనివాసులు , మద్దాల సుబ్రమణ్యం , చాటకొండు దుర్గ ప్రసాద్ గార్లను నియమించి నూతన కార్యవర్గంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ , కమిటీ సభ్యులు , అవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

టిడిపి నేతల దౌర్జన్యం మహిళ ఆత్మహత్యాయత్నం

– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది  V POWER NEWS :  ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

ఆదోని చందన షాపింగ్ మాల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి …

V POWER NEWS  : ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, తదితరులు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈరోజు చందన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రధాన రోడ్డు మొత్తం పూర్తిగా రాకపోకలను పోలీసు వారు అధికారులు దగ్గరుండి బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. మండుటెండలో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర నుండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్ వరకు ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, నరకయాతన పడ్డారని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి షాపింగ్ మాల్ లాంటివి రావడం మంచిదే అయినప్పటికీ ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు తెలిపారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఇబ్బందులు గురిచేసిన చందన షాపింగ్ మాల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పులికనుమ రిజర్వాయర్ లో వ్యక్తి గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. .. కొనసాగుతున్న సహాయక చర్యలు. … లభించని ఆచూకీ..! మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దకడుబూరు మండల పరిధిలోని పులికనుమ గ్రామానికి చెందిన (60) గొర్రెల నాగేంద్ర ఇవాళ ఉదయం గ్రామ శివారులో ఉన్న పులికనుమా రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.. ఆయన కనిపించకపోవడంతో గల్లంతయారేమోననే అనుమానంతో అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నా … నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి.

V POWER  NEWS   :    నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. 

తుంగభద్ర నదిలో ఆంధ్ర గట్టు వైపు కర్ణాటక కన్ను పడింది.. అక్రమంగా ఇసుక తరలింపు … ట్రాక్టర్ల తో ఇతర ప్రాంతాలకు తరలింపు.. పథకాలకు తూట్లు పొడుస్తున్న మాఫియా..!

V POWER NEWS :  మంత్రాలయం రూరల్/కోసిగి : కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే..కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు..కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఆంధ్ర గడ్డ వైపు కర్ణాటక రాష్ట్రంలో తమాపూర్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..పదుల సంఖ్యలలో ట్రాక్టర్ లతో యదేచ్ఛగా ఇసుకను నిలువ చేస్తూ పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటుంది.అగసనూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తే రాబోయే తరానికి ఇసుక అనేది ఉండకుండా పోతుందని వారిని ఆపడానికి ట్రై చేస్తున్నా అవడం లేదు..అక్రమంగా ఇసుకను పట్టపగలే గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గట్టు వద్ద గుట్టాలుగా నిల్వచేస్తున్నారు..అనంతరం రాత్రి వేళలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్క ట్రిప్పు రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం..ఇప్పటికైనా రెవెన్యూ,పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియా పై చర్యులుa తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

మంత్రాలయంలో అత్యంత వైభవంగా  .. రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం. 

శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించినా … సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. V POWER  NEWS :   మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ మఠంలో స్వామివారి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించి, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ రాయర రథోత్సవాన్ని స్వామిజీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్వామిజీ దీప ప్రజ్వలనం చేసి “నాద హారం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా, ప్రఖ్యాత సంగీత కళాకారులు తమ కళ రూపాన్ని, సేవను భక్తితో స్వామివారికి సమర్పించారు.ఈ పవిత్రమైన మరియు గొప్ప కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాయల ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.  

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.

మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి. .. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. V POWER NEWS  …  KURNOOL  :  పోలీసు అధికారులు, పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు స్టేషన్ లో  రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ మన్మధ విజయ్ తదితరులు ఉన్నారు.

error: Content is protected !!