దండాలు దోరో… నాకు న్యాయం చేయండి ..

నష్టపరిహారం కోసం భర్త,కొడుకును కోల్పోయా .. ఇప్పటికైనా కనికరించండి.

నా చావును కూడా చూడాలనుకుంటున్నారా.. వృద్దురాలి ఆవేదన

కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం, బ్రాహ్మణ పల్లె గ్రామానికి చెందిన వృద్దురాలు షేక్ మహబూబ్ బి ఆవేదన కర్నూలు కలెక్టరేట్ లోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సహకరించని వయసులో న్యాయం తమకు అందించాల్సిన నష్టపరిహారం కోసం తహసీల్దార్,ఆర్ డి ఓ,కలెక్టర్ కార్యాలయానికి కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపొగా నానా దుర్భాషాలాడిన ఘటనతో తీవ్ర మనస్తాపనికి గురైంది. చివరిగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,గ్రీవెన్స్ లో ఆమె న్యాయం కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన అనంతరం కన్నీటి పర్యంతం అయింది.వివరాలు ఇలా ఉన్నాయి…కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లెకు చెందిన షేక్ మహబూబ్ బి,భర్త పేరు ఖాసీం సాహెబ్ (లేట్)కి సంబందించిన సర్వే నంబర్ 121/ B4,B5లలో ఆమె భర్త ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ ఇరువురు కలిసి సంయుక్తంగా వారికీ ఉన్న 6.14 ఎకరాలలో గత 30ఏళ్ల నుండి వివిధ రకాల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.అయితే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎపిఐఐసి కోసం చేపట్టిన భూ సేకరణలో భాగంగా వారికీ 6.14ఎకరాలకు నష్టపరిహారం ఇస్తామని అంగీకరిస్తూ నోటీసులు జారీచేశారు.దానికి అనుగుణంగా ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ లు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను అంగీకరిస్తూ అనుభవంలో ఉన్న తమ భూమిని ఓర్వకల్ మండల రెవిన్యూ అధికారికి వ్రాత పూర్వకంగా అప్పగించడం జరిగింది.ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆర్.శివరాముడు,అప్పటి కర్నూలు జిల్లా రెవిన్యూ డివిజన్ అధికారికి పూర్తి సమాచారం అందచేయడం జరిగింది.ఆ సందర్బంగా ఆర్ డిఓ అధికారి సైతం తమకు సంబంధిత అనుభవంలో ఉన్న సర్వే నంబర్ లు 121/ బి4,బి5లకు నష్ట పరిహారం మంజూరైనట్లు నమ్మబలుకుతూ తమకు సమాచారం తెలియచేశారని పేర్కొన్నారు. అధికారులను గుడ్డిగా నమ్మిన తన భర్త, కుమారుడులు ఆర్ డిఓ కార్యాలయానికి తనను కూడా వెంటబెట్టుకుని, ఆర్డిఓకార్యాలయంను సంప్రదించి 6.14 ఎకరాలకు నష్టపరిహారం కోరినట్లు షేక్ మహబూబ్ బి చెప్పారు.దీంతో ఆర్డిఓ ప్రస్తుతం 5ఎకరాలకు ఇస్తాము,మరల మిగిలి ఉన్న 1.14ఎకరాలకు తదుపరి విడతలో ఇస్తామని చెప్పునట్లు షేక్ మహబూబ్ బి పేర్కొన్నారు.అయితే అప్పటికే నా కుమారుడికి పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఉన్నందువలన, మరోవైపు పొలం సాగు కొరకు చేసిన అప్పుల ఒత్తిడికి తాళలేక ఆర్ డిఓ చెప్పిన విధంగా అంగీకరించామని అన్నారు.కానిమాకు ఐదు ఎకరాలకు నష్టపరిహారం చెల్లించిన తదనంతరం 10రోజులకే,ఒక రాజకీయ నాయకుడి సిఫారస్ మేరకు ప్రభుత్వ నిబంధనలు దిక్కరించి, ఇతరులకు అదనంగా నష్ట పరిహారం చెల్లించారు.ఈ విషయం తెలుసుకున్న తాము ఆర్ డిఓ అధికారిని కలిసి కార్యాలయంలో విచారించగా వారు మాపై దుర్భాషాలాడుతూ,వారు తాము సమర్పించిన వినతులను తమ ముఖంపై విసిరివేస్తూ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం,ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ తమను భయబ్రాంతులకు గురిచేస్తూ, అవమాన పరచినట్లు ఆవేదన చెందారు.దీంతో తాము హ్యూమన్ రైట్స్ ను 2022, ఆగస్ట్,3వ తేదీన ఆశ్రయించడం జరిగిందని చెప్పారు.ఆ సమయంలో ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్ కు ఆర్ డిఓ కార్యాలయం నుండి 2023,మార్చి,06వ తేదీన బాధితులు అర్జీ పెట్టుకుంటే… గతంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించిన విధంగా తమకు 50సెంట్లకు నష్టపరిహారం ఇస్తామని కౌంటర్ దాఖలు చేశారని అన్నారు.అదే సమయంలో తమ కుమారుడు చిన్న ఖాసీం సాహెబ్ అనారోగ్యంతో మృతి చెందాడు. అయినకూడా బాధలో ఉన్న తాము కుమారుడి మరణం గురించి పూర్తి సమాచారం ఇచ్చాము.అదే సమయంలో ప్రభుత్వం ఆదేశాలు ప్రకారంగా…వారిని, మాకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంజూరైనా ఉత్త (RG. G1/317/BRAHMANAPALLI/2021), DATE: 23/03/2022 ప్రకారం 6.14 ఎకరాలకు మొత్తంగా రూ.46.05.000 లక్షలకు గాను రూ.37.50.000 చెల్లించారు.అయితే న్యాయంగా మాకు మిగిలిన 1.14ఎకరాలకుగాను రూ.8.55.000లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలో నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే 2025,జులై,20వ తేదీన అనారోగ్యంతో తన భర్త ఖాసీం సాహెబ్ ను సైతం కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఇప్పటికైనా తనకు ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను.ఈ నేపథ్యంలో 2025,జులై,09వ తేదీన కూడా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి తన పరిస్థితిని విన్నవించారు.ఆ సమయంలో జాయింట్ కలెక్టర్ సైతం ఫోన్ ద్వారా ప్రస్తుత ఆర్ డిఓ సందీప్ కుమార్ కు సమాచారం ఇచ్చి,పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.అప్పటికి సానుకూలంగా స్పందించిన ఆర్ డిఓ నష్టపరిహారం చెల్లించే చివరి సమయంలో గత ఆర్ డిఓ ఇవ్వలేని,నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడడం తాను పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి గురికావాల్సి వచ్చింది.ఈ వయసులో తాను కార్యాలయాల చుట్టూ తిరగలేని పరిస్థితి ఒకవైపు…కనీసం వయసుకు సైతం కనికరం చూపలేని ప్రభుత్వ యంత్రాంగంను చూస్తుంటే తనకు నవ్వాలో…ఏడవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను.ఏదిఏమైనా చివరి సారిగా తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేయడం జరిగింది.ఇందులో తమకు న్యాయం జరిగితే ఒకే…లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ కన్నీటిపర్యంత మయ్యారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!