మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తి వంతమైన సాధనమే యోగా … తహశీల్దార్ లక్ష్మినారాయణ

హాలహర్వి Vపవర్ న్యూస్ :- యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవిస్తారు. యోగా, యోగాంధ్ర వేడుకలో భాగంగా హాలహర్వి మండల పరిధిలోని పచ్ఛారపల్లి పాఠశాల నందు శనివారం ఉదయం పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ హాలహర్వి మండల తహాశీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొని అయన ప్రసంగించారు. యోగా అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు, యోగాంధ్ర కార్యక్రమంలో పాటలు పాడిన, బొమ్మలు గీసిన విద్యార్థులు దీపిక , పవిత్ర,ఊహా, విద్యార్థులకు యోగ సర్టిఫికెట్, బహుమతులను తహశీల్దార్ లక్ష్మినారాయణ,మండల క్లస్టర్ ఇంచార్జ్ ప్రహ్లాద రెడ్డి, అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి ఆసనాలు వేసి. శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగ విజయవంతం చేసినందుకు పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పచ్ఛారపల్లి జనార్ధన ఆలూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలియజేశారు.యోగా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు,పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్, విఆర్ఓ సతీష్ కుమార్ గౌడ్,వెటర్నరీ అసిస్టెంట్ మల్లికార్జున, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, అంగన్వాడి ఆయా లక్ష్మి, ఆశా వర్కర్ రమిజాబి, పొదుపు విఓఏ సుధాకర్, పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ , నాగరాజు ,రంజాన్, పాండు, గాదిలింగ, ఈశ్వరప్ప, రమేష్,ఈరన్న, శివకుమార్,సురేంద్ర, మధు, బీమేష్ ,వినోద్,బాపురం బసవ, ఉపాధి హామీ పథకం వారు,పోదుపు లక్ష్మి మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు,యువతి యూవకులు, తదితరులు పాల్గొన్నారు.