దేవనకొండ మండలం లో.. వంక వాగులలో అక్రమ ఇసుక రవాణా

కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్న అధికారులు…….! • దేవనకొండ మండలం వేలంకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో వంక వాగుల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులు … • చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు … • ఒకే వ్యవహారంపై వివరణ  విషయంలో.. ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం..? • దేవనకొండ ఎమ్మార్వో … ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా……? అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదం. • వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ ..  అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న మాట  వాస్తవం,  రాత్రిపూట మాత్రమే జరుగుతుందన్న  VRO.   • ప్రజల  కష్టాలపై  …    అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో .. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…?    ద్వని కాలుష్యం  ..  రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందన్న  గ్రామ ప్రజలు  కర్నూలు  జిల్లా, దేవనకొండ మండలం లో …   రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ప్రతిరోజు 50 ట్రాక్టర్ల నుండి 100 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు అమ్ముతున్న దళారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని దేవనకొండ గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు వాపోతున్నారు. దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వంకలో ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది ఈ ఇసుక రవాణా గ్రామ స్థాయి నాయకుల అండదండలతో నడుస్తుందని ప్రజలు అంటున్నారు వెలంకూరు గ్రామ సర్పంచ్ కనుసనల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో భారీ ఇసుక రవాణా జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడడం లేదన్నారు.  ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం పై అధికారులకు చెప్పుదామని ఎవరైనా వెళ్లిన అటువైపు చూసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవసరమైతే వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడడం లేదని ప్రజలు అంటున్నారు.. ఈ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు జరుగుతుండడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఈ అక్రమ ఇసుక రవాణా రాత్రి 12 గంటల తర్వాత కూడా జరుగుతుందని ఈ ట్రాక్టర్ల ధ్వని కాలుష్యం వలన రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు.  ఈ ట్రాక్టర్ల రాకపోకల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అన్న సమాచారం మేరకు వివరణ ఇవ్వవలసిందిగా దేవనకొండ  మండల  రెవెన్యూ అధికారులను  అడుగగా విస్తుపోయే విధంగా సమాధానం ఇచ్చారు.  నేను ఇక్కడికి ఎమ్మార్వో గా బదిలీ అయి వచ్చి మూడు నెలలు మాత్రమే అయిందని ఇక్కడ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలు జరుగుతున్నాయో తనకు తెలియదని తన దృష్టికి ఇంతవరకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం కూడా రాలేదని అసలు ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా……?అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది, దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి మూడు నెలలు అవుతున్న అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్న ఎమ్మార్వో ఇది ఎంతవరకు నిజం ..?   • చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు … ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం విఆర్ఓ ను అడిగి తెలుసుకుంటానని విఆర్ఓ ను పిలిపించి వివరణ అడగగా  వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తెలుసని కానీ అది రాత్రిపూట మాత్రమే జరుగుతుందని ఆ రాత్రిపూట తలారులను పంపించి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని కానీ ఉదయం పూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని వీఆర్వో అన్నారు సదరు విఆర్ఓ కు తెలిసిన సమాచారం ఎమ్మార్వో కు తెలియక పోవడం గమనార్హం ….? మరి ఆ విఆర్ఓ ఎందుకు అక్రమ ఇసుక రవాణా గురించిన సమాచారము ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లలేదు అన్న విషయము ప్రశ్నార్ధకంగా మారింది.    వీఆర్వో ను మరి ఎమ్మార్వో కు మీరు ఈ విషయము తెలియపరిచారా లేదా అని అడగగా వెంటనే ఎమ్మార్వో కల్పించుకొని గతంలో ఒకసారి ఆర్ ఐ తలారులు ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడులు చేశారని చెప్పడం విచిత్రంగా ఉంది తనకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అన్న విషయము తెలియదని చెప్పిన ఎమ్మార్వో తిరిగి ఆర్ఐ తలారులపై దాడికి ప్రయత్నించారు అని చెప్పడం గమనార్హం… !  ఒకే వ్యవహారంపై ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం.  ఇకపై ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తన పరిధిలోకి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పిన మాట దాటవేసిన ఎమ్మార్వో.. ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారము అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది…………కష్టానికి 

ఆగ్రలో నిర్వహించిన రాణి అహల్యా బాయి 300వ .. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

 V POWER NEWS :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్ర లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి అహల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకల్లో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి జగదీష్ దంకర్ , యూ.పి సీ.ఎం యోగి ఆదిత్య నాథ్ , హరియాణ గవర్నర్ బండారు దత్తత్రేయ ల తో కలిసి రాణి అహల్యా బాయి చిత్ర పట్టానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు…అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాణి అహల్య బాయి మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు..సామాజిక సంక్షేమం, మరియు మానవతా పనులతోపాటు మత పరమైన , విద్య మరియు సాంస్కృతిక పురోగతికి కృషి చేసారన్నారు…ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారన్నారు..రాణి అహల్యా బాయి జీవితం అందరికి స్ఫూర్తిదయాకమన్నారు…ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకి చెందిన ఎంపీ లు , నాయకులు పాల్గొన్నారు…

చాగలమర్రి వాసులకు … ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రుద్రవరంలో అరుదైన గౌరవం

• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం. V POWER NEWS :   చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.

చౌక దుకాణాల్లోని రేషన్ సరుకులు పంపిణీ ..

ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు… హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో “హనుమాన్ జయంతి” వేడుకలకు గట్టి పోలీసు బందోబస్తు

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టినా పోలీసులు గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

తమపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి. … శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు

శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజీత్ బాషకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యా సాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు. శ్యామ్ విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ వెంచర్లో ఓకిరాణం షాపు విషయంలో గోడవ చోటుచేసుకుందని ఈఘటనపై నాగులాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మందలించారని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో అందరూ మంచి గా ఉండాలని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై అసభ్యంగా మాట్లాడి దాడి చేశారన్నారు. ఈఘటన పై నాగులాపురం స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. విద్యా సాగర్ ను సస్పెండ్ చేసి ఈకేసులో వారిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు 15మంది పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు

నేర ప్రవృత్తికి స్వస్తి పలకి .. సత్ప్రవర్తనతో ఉండాలి

• శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుంది కఠిన చర్యలు తీసుకుంటాం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ V POWER  NEWS  : నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కృషి చేస్తాం ..

• గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తిచేస్తాం.. కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్  సింగ్ రాణా,  గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనచే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అహోబిల శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్ లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగు తోందని కేంద్రమంత్రి ప్రహ్లాదు జోషి తెలిపారు. ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సోలార్ ప్లాంట్ లో 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు ముమ్మారంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తర్తూరు గ్రామంలో …. రమణీయంగా శ్రీలక్ష్మి రంగనాథ స్వామి రథోత్సవం.

ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి హాజరు. V POWER NEWS  : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా ఆలయ కమిటీ నిర్వహకులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగించారు. అనంతరం రథంలో స్వామివారిని ఉంచి గోవింద నామ స్మరణంతో వేలాది మంది భక్తుల మధ్య ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, రథోత్సవం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రథోత్సవం సందర్బంగా చేపట్టిన పలు పూజా కార్యక్రమాలలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి శివానందరెడ్డి , పాణ్యం టీడీపీ యువనాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి సాయి కుమార్ , తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి కృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నా ఎమ్మెల్యే స్వామి వారి తేరును భక్తులతో కలసి లాగారు. స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లా కర్నూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఇదేళ్ల పాలనలో తర్తూరు జాతర కళ తప్పిపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ పల్లెల్లో పండగ జాతరలు అంగరంగ వైభావంగా ప్రజలు జారుకున్నరన్నారు. రైతు జాతర తర్తూరు కు పూర్వవైభవం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటుచేకోకుండ ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఆధ్వర్యంలో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయమే వివిధ గ్రామాల నుంచి భక్తులు బక్షాలబండ్లు తో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పంటలు వచ్చిన సమయంలో స్వామివారిపేరు మీద తీసిపెట్టిన ధాన్యంతో చేసిన భక్ష్యాలను నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెపుతుంటారు . కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తరిగోపుల మందడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి రమణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాధవరం ప్రకాశం మాధవరం, తాటిపాడు నాగిరెడ్డి కమిటీ సభ్యులు ప్రభావతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు, పరమేశయ్య, వెంకటసుబ్బమ్మ, సుబ్బన్న, టీడీపీ నాయకులు రమణారెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, గుండం రమణారెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!