యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి – సీఈఓ సెట్కూరు డాక్టర్ కె.వేణుగోపాల్
నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలో యుువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల, డోన్ నందు ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటి ఫై మువ్వన్నెల జండా) ప్రచార కార్యక్రమం లో భాగంగా సీఈఓ, సెట్కూరు డా!! కె. వేణుగోపాల్ గారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా* ప్రతి భారతీయుడిని తమ ఇళ్లలోకి తిరంగను తీసుకువచ్చి, మన దేశ స్వాతంత్ర్య వేడుకలలో గర్వంగా ఎగురవేయమని, భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, మన దేశ ఐక్యతకు చిహ్నం అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు అనుగుణంగా. హర్ ఘర్ తిరంగా ఆగష్టు 2 నుంచి 15 వ తేదీ వరకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు నిర్వహిస్తున్నారని ,భారత జాతీయ జెండాతో ప్రతి పౌరుడు గౌరవ భావంతో ఉండాలని, ఈ ప్రచారం ద్వారా లోతైన వ్యక్తిగత మరియు హృదయపూర్వక సంబంధంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని, ప్రతి పౌరుడిలో లోతైన దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తుందని మరియు యువత స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని వారి ఆశయాలకు అనుగుగుణగా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత పౌరులందరు కుల, జాతి, మతాలకు అతీతంగా సోదర భావనతో మెలగాలని, ఐక్యతతో దేశభివృద్ధికి తోడ్పాడాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి అరుణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులందరూ స్వాతంత్ర దినోత్సవాన్నీ పురస్కరించుకొని తమ ఇళ్లపై జాతీయ జండా ఎగురవేసి హారఘర్ తిరంగా కార్యక్రమంను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సూపరింటెండెంట్ శ్యాంబాబు, పాఠశాల అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు https://youtu.be/mXOgl_1LmOk?si=hPtsxA0f4UuXlZS1