శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించినా … సుబుధేంద్ర తీర్థ స్వామీజీ.
V POWER NEWS : మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ మఠంలో స్వామివారి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించి, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ రాయర రథోత్సవాన్ని స్వామిజీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్వామిజీ దీప ప్రజ్వలనం చేసి “నాద హారం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా, ప్రఖ్యాత సంగీత కళాకారులు తమ కళ రూపాన్ని, సేవను భక్తితో స్వామివారికి సమర్పించారు.ఈ పవిత్రమైన మరియు గొప్ప కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాయల ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.