V POWER NEWS : నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.
