V POWER NEWS : కర్నూలు మండలం ఎన్ఎస్ తండా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ గారు మాట్లాడుతూ ఈమధ్య ఆరవ తేదీన పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రజలు 35 లక్షల పైబడి 32 తెగలుగా ఉన్నారని వీరిలో ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థాయి ప్రాంతంలో ఏజెన్సీ గిరిజనులుగా ఇంకా కనీస రోడ్డు వైద్య సౌకర్యం లేని ప్రాంతంలో బ్రతుకుతున్నారని అలాగే మైదాన ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 20 లక్షల పైబడి జనాభా 70 నియోజకవర్గాలలో ఉన్నారని, ఈ ప్రజలను పాలకులు ఓటర్లుగా మాత్రమే వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని ఈ రాష్ట్రం వదిలి పారిపోయేటట్లు చేసే కార్యక్రమాలు పెట్టుకున్నట్టు ఉన్నట్లు ఉన్నారని. అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మొదటిసారి పుట్టపర్తి నియోజకవర్గం లో ఎన్నిక కాబడిన పల్లె సింధూర రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో దాదాపుగా 30 వేల లంబాడి ఓట్లతోగెలిచి అక్కడ ఉన్నటువంటి గిరిజన లంబాడి ప్రజల. జీవితాలపై కనీస అవగాహన లేకుండా. స్వాతంత్రానికి ముందు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగల కంటే అన్ని విధాలుగా విద్య వ్యవసాయము వ్యాపార రంగాలలో ఉంటూ హార్దికంగా రాజకీయంగా బ్రిటిష్ కాలంలోనే పాలేగాల్ల పాలన చేసినటువంటి బోయ కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ని స్వయానా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తో బోయలు నేటికీ దుర్భర జీవితాలు గడుపుతున్నారు లంబాడి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. నాడు నేడు గిరిజన లంబాడీల లు బ్రతుకుతెరువు లేక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తమిళనాడు రాష్ట్రం చెన్నై బాంబే కలకత్తా లాంటి నగరాలకు వెళ్లి బ్రతుకుతున్న సంగతి పాలకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ గిరిజనుల జీవితాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా కులాల మధ్య కుంపటి పెట్టే కార్యక్రమాలు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామన్నారు. ఒకవైపు అన్ని రంగాలలో రాయలసీమ బ్రిటిష్ కాలంలోనే పాలెగాలుగా నేడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా శాసించే స్థాయిలో ఉండి అన్ని రకాల ముందున్న బోయజాతి వారిని అతి పేదవారిగా వర్ణిస్తూ విలువైన శాసనసభ సమయాన్ని కేటాయించిన పల్లె సింధూర రెడ్డిని స్వయానా స్పీకర్ గారే సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా మా గిరిజన లంబాడీలకు ఉందని సంగతి గుర్తు చేస్తున్నామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు మొదలుపెడతామని కైలాస్ నాయక్ తెలిపారు.