V POWER NEWS

చాగలమర్రి వాసులకు … ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రుద్రవరంలో అరుదైన గౌరవం

• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం. V POWER NEWS :   చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.

చౌక దుకాణాల్లోని రేషన్ సరుకులు పంపిణీ ..

ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు… హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో “హనుమాన్ జయంతి” వేడుకలకు గట్టి పోలీసు బందోబస్తు

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టినా పోలీసులు గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

తమపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి. … శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు

శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజీత్ బాషకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యా సాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు. శ్యామ్ విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ వెంచర్లో ఓకిరాణం షాపు విషయంలో గోడవ చోటుచేసుకుందని ఈఘటనపై నాగులాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మందలించారని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో అందరూ మంచి గా ఉండాలని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై అసభ్యంగా మాట్లాడి దాడి చేశారన్నారు. ఈఘటన పై నాగులాపురం స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. విద్యా సాగర్ ను సస్పెండ్ చేసి ఈకేసులో వారిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు 15మంది పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు

నేర ప్రవృత్తికి స్వస్తి పలకి .. సత్ప్రవర్తనతో ఉండాలి

• శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుంది కఠిన చర్యలు తీసుకుంటాం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ V POWER  NEWS  : నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కృషి చేస్తాం ..

• గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తిచేస్తాం.. కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్  సింగ్ రాణా,  గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనచే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అహోబిల శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్ లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగు తోందని కేంద్రమంత్రి ప్రహ్లాదు జోషి తెలిపారు. ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సోలార్ ప్లాంట్ లో 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు ముమ్మారంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తర్తూరు గ్రామంలో …. రమణీయంగా శ్రీలక్ష్మి రంగనాథ స్వామి రథోత్సవం.

ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి హాజరు. V POWER NEWS  : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా ఆలయ కమిటీ నిర్వహకులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగించారు. అనంతరం రథంలో స్వామివారిని ఉంచి గోవింద నామ స్మరణంతో వేలాది మంది భక్తుల మధ్య ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, రథోత్సవం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రథోత్సవం సందర్బంగా చేపట్టిన పలు పూజా కార్యక్రమాలలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి శివానందరెడ్డి , పాణ్యం టీడీపీ యువనాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి సాయి కుమార్ , తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి కృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నా ఎమ్మెల్యే స్వామి వారి తేరును భక్తులతో కలసి లాగారు. స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లా కర్నూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఇదేళ్ల పాలనలో తర్తూరు జాతర కళ తప్పిపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ పల్లెల్లో పండగ జాతరలు అంగరంగ వైభావంగా ప్రజలు జారుకున్నరన్నారు. రైతు జాతర తర్తూరు కు పూర్వవైభవం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటుచేకోకుండ ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఆధ్వర్యంలో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయమే వివిధ గ్రామాల నుంచి భక్తులు బక్షాలబండ్లు తో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పంటలు వచ్చిన సమయంలో స్వామివారిపేరు మీద తీసిపెట్టిన ధాన్యంతో చేసిన భక్ష్యాలను నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెపుతుంటారు . కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తరిగోపుల మందడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి రమణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాధవరం ప్రకాశం మాధవరం, తాటిపాడు నాగిరెడ్డి కమిటీ సభ్యులు ప్రభావతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు, పరమేశయ్య, వెంకటసుబ్బమ్మ, సుబ్బన్న, టీడీపీ నాయకులు రమణారెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, గుండం రమణారెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

డ్రోన్ కెమెరాలతో… ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి

V  POWER  NEWS  :   కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్. ఆదివారం తెలిపారు. కర్నూల్ జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాలతో కర్నూల్ పట్టణంలో పోలీసులు డ్రోన్ల తో నిఘా పటిష్టం చేశారు.అనంతరం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్‌ ను పరిశీలించారు. ట్రాఫిక్ సిఐ  మాట్లాడుతూ…నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు. అలాగే ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రధాన దృష్టి సారిస్తున్నాని, ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామని,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్. 

నిర్లక్ష్య ధోరణి లో  ..  శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి 

V POWER NEWS, SRISAILAM  :   శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి వర్కింగ్ సమయంలో హాస్పిటల్ ని తెరిచి ఉంచి, డాక్టరు మరియు ఇతర సిబ్బంది హాస్పిటల్ లో లేకపోవడం, ఎమర్జెన్సీలో వచ్చినటువంటి రోగులని పట్టించుకోకపోవడం లేదనీ, శ్రీశైల దేవస్థానం స్వామివారి దర్శనార్థం యావత్ భారతదేశం నుండి అనేక విధాలైనటువంటి ఏజ్ లిమిట్ లేనటువంటి వారు భక్తులు వస్తుంటారు. వేసవికాలం సమయంలో, ప్రయాణంలో ఇబ్బందులకు  చేస్తున్నారన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే వారు, వేసవికాలంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ హాస్పిటల్ చేరుకున్న వారికి, ఈరోజు సాయంత్రం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు డాక్టరు మరియు ఇతర సిబ్బంది లేకపోవడం, భక్తులకు మరియు స్థానికులకు రెండు గంటలసేపు వెయిటింగ్ చేసి, వెళ్లడం జరుగుతుంది. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పై, మరియు సిబ్బందిపై, చర్యలు తీసుకోవలసినదిగా, పాత్రికేయుల సమక్షంలో పై పెద్దలకు వినతి కోరుతున్నామన్నారు.  వేసవికాలంలో ఈ రకంగా ఆసుపత్రిని తెరిచి ఉంచి రోగులను వేటింగ్ చేయించడం సరికాదని, డాక్టరు లేని సమయంలో మిగతా సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం రోగులకు ఇబ్బందికరంగా ఉందన, ఎవరూ లేని సమయంలో ఆసుపత్రిని తెరిచి ఉంచడం మంచిది కాదని, ఆసుపత్రి తెరిచి ఉంచినప్పుడు సంబంధిత సిబ్బంది ఉండవలసి ఉంటుందని తెలియపరుస్తూ ఇక్కడ డాక్టర్ లేడు ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది లేదు, కావున తక్షణం వీరిపై పై అధికారులు చర్యలు తీసుకోవలసినదిగా మీడియా ముఖంగా తెలియపరుస్తూ. ఈ విషయంపై హెల్త్ మినిస్టర్  శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఫిర్యాదు చేయవలసి ఉంటుందని అంతిరెడ్డి అరవింద రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. 

శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ పైల వాసుదేవరావుకు  విప్లవ జోహార్లు ..

  V POWER NEWS,  నందికొట్కూరు :  శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాటయోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ  పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి 15వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ  కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ గిరిజన సాయిధ రైతాంగ పోరాటంలో పనిచేసి భూమికోసం. భుక్తి కోసం .ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి తన తుది  శ్వాస విడిచే వరకు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పనిచేశారన్నారు .బడా బూర్జువ  బడా భూస్వామ్య నిరంకుశ పాలక వర్గాలను మెడలు వంచి  ఈ దేశంలో ఎర్రజెండాను ఎగరవేయాలని పట్టుదలతో ప్రతిఘటన పోరాటాలను నిర్మించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు .శ్రీకాకుళ పోరాట వారసత్వంతో దోపిడీ  పీడనలు లేని సమ సమాజ స్థాపన కై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. నేడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న భూస్వామ్య బడా కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి ఈ పోరాటాలను ఒక ప్రక్క నెత్తురు  టేర్ల లో ముంచుతూ మరోపక్క ప్రజలను మతం .కులం  తెగలు పేరుతో విభజించి తమ కార్పొరేట్ కాషాయఎజెండాను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలపై ప్రయోగిస్తున్నది .కుహనా దేశభక్తి జాతీయ తల పేరు చెప్పి లౌకికవాదంపై దాడి చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి సూపర్ సిక్స్  పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి నాలిక మడత పె బెడుతున్నది .మోడీ అమిత్ షా కూటమిలో భాగంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడానికి పూనుకుంటుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా భూస్వాములకు ఆదాని .అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు సామ్రాజవాదుల యొక్క బహుళ జాతి సంస్థలకు సేవ చేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అందువలన అన్ని వర్గాల ప్రజలని సమరశీల పోరాటాలకు సమహిత్యం చేసినప్పుడే పైల గారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారతా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ . ఐ ఎఫ్ టి యు  డివిజన్ అధ్యక్షులు పి తిక్కయ్య .మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు .తిమ్మన్న .ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దేవన్న. భాస్కర్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

error: Content is protected !!